కొత్త కార్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రెనాల్ట్ ఇండియా కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. స్వాాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ ప్రకటించింది. ఈ కార్నివాల్‌లో భాగంగా https://telugu.news18.com/tag/auto-news/రెనాల్ట్ కార్లపై (Renault Car) భారీ డిస్కౌంట్ అందిస్తోంది. క్విడ్ (Renault Kwid), కైగర్, ట్రైబర్ లాంటి మోడల్స్‌పై బెనిఫిట్స్ వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ సేల్ ఆగస్ట్ 16 వరకే ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, ఫ్రీ యాక్సెసరీస్ లాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి. మరి ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.
Renault Kwid: రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కార్‌పై మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో రూ.50,000 వరకు, ఇతర రాష్ట్రాల్లో రూ.45,000 బెనిఫిట్స్ లభిస్తాయి. రెనాల్ట్ క్విడ్ కార్ ప్రారంభ ధర రూ.4.64 లక్షలు. ఆగస్టులో కొంటే రూ.5,000 విలువైన యాక్సెసరీస్ ఉచితంగా పొందొచ్చు. R.E.Li.V.E స్క్రాపేజ్ ప్రోగ్రామ్ ద్వారా అదనంగా రూ.10,000 బెనిఫిట్స్ లభిస్తాయి. ఇతర డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి.
CIBIL Report: మీ సిబిల్ రిపోర్ట్‌లో తప్పులున్నాయా? ఇలా ఫిర్యాదు చేయండి
Renault Triber: రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ధర రూ.5.91 లక్షలు. ఈ కార్ కొనేవారికి ఆకర్షణీయమైన ఆఫర్స్ ఉన్నాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో రూ.60,000 వరకు, ఇతర రాష్ట్రాల్లో రూ.55,000 బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్ రూ.45,000 వరకు, రూ.5,000 యాక్సెరీస్, స్క్రాపేజ్ పాలసీ ద్వారా రూ.10,000 బెనిఫిట్స్ లభిస్తాయి.
Renault Kiger: రెనాల్ట్ ఎస్‌యూవీ కైగర్ కార్ కొనేవారికి రూ.25,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ కార్ ప్రారంభ ధర రూ.5.99 లక్షలు. అన్ని రాష్ట్రాలవారికి ఒకే తరహా బెనిఫిట్స్ లభిస్తాయి. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10,000 వరకు బెనిఫిట్స్, రూరల్ కస్టమర్స్‌కు స్పెషల్ ఆఫర్స్, స్క్రాపేజ్ పాలసీ ద్వారా రూ.10,000 బెనిఫిట్స్, రూ.5,000 విలువైన యాక్సెసరీస్ లభిస్తాయి.
Savings Scheme: రూ.5 లక్షల రిటర్న్స్ కోసం నెలకు రూ.1,000 పొదుపు చేస్తే చాలు
రెనాల్ట్ మాత్రమే కాదు ఇతర కార్ కంపెనీలు కూడా కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో, వీఎక్స్ఐ, సెలెరియో వీఎక్స్ఐ, స్విఫ్ట్ ఏజీఎస్ మోడల్స్‌పై రూ.9,000 నుంచి రూ.64,000 వరకు, హ్యుందాయ్ సాంత్రో, ఆరా, ఎన్ఐఓఎస్, ఎక్సెంట్ ప్రైమ్ కార్లపై రూ.13,000 నుంచి రూ.50,000 వరకు, టాటా టియాగో, టిగార్, హ్యారియర్, సఫారీ కార్లపై రూ.20,000 నుంచి రూ.40,000 వరకు, టొయోటా అర్బన్ క్రూజర్ వాహనాలపై రూ.40,000 నుంచి రూ.75,000 వరకు, మహీంద్రా బొలెరో, ఎక్స్‌యూవీ కార్లపై రూ.10,000 నుంచి రూ.20,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.