Renault India: రెనాల్ట్ కొత్త మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు.. ఇప్పుడు కొనండి.. 2022లో చెల్లించండి

ప్రతీకాత్మక చిత్రం

ఆగస్టు 6 నుంచి కొత్త కిగర్ వేరియంట్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని రెనాల్ట్ ఇండియా ప్రకటించింది.

  • Share this:
ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించి పదేళ్లు పూర్తి చేసుకుంది. దశాబ్ద కాలంలో ఎన్నో వినూత్నమైన మోడళ్లను ఈ సంస్థ పరిచయం చేసింది. తాజాగా పదో వార్షికోత్సవం సందర్భంగా రెనాల్ట్ మరో కొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో వచ్చిన కిగర్ ఎస్‌యూవీ సిరీస్‌లో కొత్త RXT (O) వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం అనేక స్కీమ్‌లను ప్రారంభించింది. ఆగస్టు 6 నుంచి కొత్త కిగర్ వేరియంట్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని రెనాల్ట్ ఇండియా ప్రకటించింది.

కొత్త రెనాల్ట్ కిగర్ RXT (O) వేరియంట్.. మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో, ఒక లీటర్ ఎనర్జీ ఇంజిన్‌తో అందుబాటులో ఉంటాయి. కిగర్ ఎస్‌యూవీ RXZ వేరియంట్‌తో పోలిస్తే.. కొత్త RXT (O) వేరియంట్‌ను రెనాల్ట్‌ అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు కస్టమర్లు ట్రై-ఆక్టా LED ప్యూర్ విజన్ హెడ్‌ల్యాంప్‌లు, 40.64 సెంటీమీటర్ల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ప్రీమియం అప్‌గ్రేడ్‌లను తక్కువ ధర వద్ద పొందవచ్చు.

* ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
కిగర్ RXT (O) వేరియంట్‌లోని ఇతర ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులోని PM 2.5 అడ్వాన్స్‌డ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఫిల్టర్.. క్యాబిన్‌లోని గాలిని శుద్ధి చేస్తుంది. దీంతోపాటు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ రెప్లికేషన్ ఫంక్షన్‌ సేవలను పొందవచ్చు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లను 20.32 సెంటీమీటర్ల డిస్‌ప్లే లింక్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

* వివిధ మోడళ్లపై ఆఫర్లు
స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు ‘ఫ్రీడమ్ కార్నివాల్‌’ ఆఫర్లను రెనాల్ట్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కేరళలో అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ రాష్ట్రాలలో గణేష్ చతుర్థి, ఓనమ్ పండుగల సందర్భంగా డిమాండ్ పెరుగుతుందని సంస్థ ఆశిస్తోంది. అందువల్ల ఈ ప్రాంతాల్లో రూ.90,000 వరకు ప్రయోజనాలు పొందే ఆఫర్లను కస్టమర్లకు అందిస్తామని వెల్లడించింది.

ఫ్రీడమ్ కార్నివాల్‌లో భాగంగా.. ఆఫర్ ఉన్న సమయంలో రెనాల్ట్ కార్లను బుక్ చేసుకునే కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. క్విడ్, ట్రైబర్, కిగర్ కార్ల కొనుగోలుపై క్యాష్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు 'Buy Now, Pay in 2022' స్కీమ్‌ను కూడా సంస్థ ప్రకటించింది. ఈ పథకం కింద వినియోగదారులు ప్రస్తుతం రెనాల్ట్ వేకిల్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనికి ఆరు నెలల తర్వాత EMIలు చెల్లించడం ప్రారంభించవచ్చు. మరిన్ని వివరాల కోసం డీలర్‌షిప్‌లలో సంప్రదించాలని రెనాల్ట్ కోరింది
Published by:Kishore Akkaladevi
First published: