ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ సేల్స్ పరంగా దూకుడును ప్రదర్శిస్తోంది. దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ సేల్స్‌లో దాదాపు అన్ని కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. అయితే పండుగ ఆఫర్ల తర్వాత మరోసారి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి కొన్ని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు. ఈ క్రమంలో నవంబర్‌లో స్పెషల్ ఆఫర్లను అనౌన్స్ చేసింది ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్. రెనాల్ట్ కంపెనీ నవంబర్‌లో వివిధ ప్రొడక్ట్స్‌పై కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. ట్రైబర్, కిగర్, క్విడ్ వంటి మోడళ్లపై రూ. 35,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఇటీవల కంపెనీ ప్రకటించింది. క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్‌లతో కలిపి ఈ వెహికల్స్‌ను అతితక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 2022 నవంబర్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యే ఆఫర్ల వివరాలు చూద్దాం.
రెనాల్ట్ ట్రైబర్
ఈ నెలలో రెనాల్ట్ ట్రైబర్‌ను కొనుగోలు చేసేవారు రూ. 35,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ మోడల్ RXE మినహా అన్ని వేరియంట్లపై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ ఉంది. కొన్ని వేరియంట్లపై రూ. 10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రెనాల్ట్స్ MPVపై రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు ఉన్నాయి. రైతులు, సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ సభ్యులు రెనాల్ట్ రూరల్ ఆఫర్ కింద రూ. 5,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాక RELIVE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద క్లయింట్లకు గరిష్టంగా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.
రెనాల్ట్ క్విడ్
బ్రాండ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన రెనాల్ట్ క్విడ్ కారును ఈ నెలలో రూ. 30,000 వరకు డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్ RXE వేరియంట్ మినహా మిగతా అన్ని వెర్షన్లపై రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంది. కొన్ని వేరియంట్లపై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. కొన్ని మోడళ్లపై రూ. 10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తుంది. వీటితో పాటు కస్టమర్లు RELIVE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లు రూ. 5,000 రూరల్ ఇంటెన్సివ్ కూడా సొంతం చేసుకోవచ్చు.
రెనాల్ట్ కిగర్
ఇది బ్రాండ్ నుంచి వచ్చిన సబ్‌కాంపాక్ట్ SUV. ఈ నెలలో కిగర్ కారును కొనుగోలు చేసేవారు.. క్విడ్, ట్రైబర్ మోడళ్లతో అందించే కార్పొరేట్, రూరల్ డిస్కౌంట్స్ పొందవచ్చు. అయితే ఈ వెహికల్‌పై ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ లేదు. కానీ RELIVE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద ఈ SUVపై రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.