Renault Offer | కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. ఎందుకంటే ప్రస్తుతం కార్లపై (Cars) బంపరాఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా తాజాగా కారు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. డిసెంబర్ నెల చివరి వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. రెనో ట్రైబర్, క్విడ్ (Kwid), కైగర్ వంటి మోడళ్లపై డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా రూ. 50 వేల వరకు తగ్గింపు వస్తుంది.
క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ తగ్గింపు, కార్పొరేట్ బెనిఫిట్ వంటి వాటి రూపంలో కార్లపై ఆఫర్లు లభిస్తాయి. మీరు దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి కారు ఆఫర్ల గురించి తెలుసుకోవచ్చు. షోరూమ్, ప్రాంతం, మోడల్, వేరియంట్ ప్రాతిపదికన కారు ఆఫర్లలో మార్పులు ఉంటాయి. అందుకే డీలర్ షిప్ వద్దకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుంటే ఉత్తమం.
25 బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఇలా.. ఎందులో తక్కువంటే?
రెనో ట్రైబర్ కారుపై రూ. 15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బెనిఫిట్ కింద రూ. 25 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉంది. రూ. 10 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. రూరల్ డిస్కౌంట్ కూడా ఉంది. రైతులు, గ్రామ పంచాయతీ మెంబర్లకు అదనంగా రూ. 5 వేల తగ్గింపు వస్తుంది. రిలీవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద అదనంగా రూ. 10 వేల వరకు తగ్గింపు పొందొచ్చు.
స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? క్షణాల్లో అకౌంట్లోకి రూ.5,000 పొందండిలా!
రెనో క్విడ్ కారుపై రూ. 35 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 15 వేల వరకు తగ్గగింపు వస్తుంది. కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ. 10 వేల వరకు, రూరల్ బెనిఫిట్ కింద రూ. 5 వేల వరకు డిస్కౌంట్ ఉంది. రిలీవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ ఈ కారుకు కూడా వర్తిస్తుంది.
రెనో కైగర్ కారుపై కూడా డిస్కౌంట్ ఉంది. ఈ ఎస్‌యూవీపై రూ. 35 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు ఉంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ. 15 వేల వరకు లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ లేదు. రూరల్ డిస్కౌంట్ రూ. 5 వేలు పొందొచ్చు. స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10 వేల వరకు బెనిఫిట్ ఉంది. అందువల్ల ఈ రెనో కార్లు కొనాలని భావించే వారు ఆఫర్లు పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Cars, Latest offers, Offers, Renault