హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Home Loan | మీ నెలవారీ ఈఎంఐ మీరు తీసుకునే లోన్ అమౌంట్, దానిపై వర్తించే వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు బ్యాంకును ఎంపిక చేసుకునే ముందు మార్కెట్లో వడ్డీరేట్లపై అధ్యయనం చేయండి.

  ప్రతి మనిషి జీవితంలో సొంతిల్లు కట్టుకోవడం అనేది ఒక కల. తమ కలల ఇంటిని వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా కట్టించుకోవాలని భావిస్తుంటారు. అయితే, సొంత ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు దానికి చాలా డబ్బులు కావాలి. ఒకే సారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది. అందువల్ల, బ్యాంకులను ఆశ్రయించి, హోమ్లోన్ తీసుకుంటారు చాలా మంది. అయితే, హోమ్ లోన్ తీసుకోవాలంటే దీర్ఘకాలిక నిబద్ధత ఎంతో అవసరం. హోమ్ లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉందో తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచింది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చార్జీలు వంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ (హెచ్ఎఫ్‌సీ) కంపెనీలు తమ హోమ్ లోన్లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఈ పండుగ సీజన్లో మీరు హోమ్లోన్ తీసుకోవాలనుకుంటే ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోండి.

  Realme C15: రియల్‌మీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్... కొత్త ఫీచర్స్‌తో మళ్లీ రిలీజైన రియల్‌మీ సీ15

  Flipkart Big Diwali sale: మీ పాత ఫోన్ ఇస్తే సగం ధరకే iPhone SE కొనొచ్చు ఇలా

  లోన్ అమౌంట్, ఎలిజిబిలిటీ


  ఒక వ్యక్తికి ఎంత మొత్తంలో హోమ్ లోన్ ఇవ్వాలనేది ఆ వ్యక్తి నెలవారీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాక, ఆ వ్యక్తి ఆస్తి విలువను పరిగణలోకి తీసుకొని కూడా బ్యాంకులు రుణాన్ని మంజూరు చేస్తాయి. వ్యక్తి ఆస్తి విలువలో 80 శాతం నుంచి 90 శాతం మేరకే బ్యాంకులు హోమ్ లోన్ మంజూరు చేస్తాయి.

  వడ్డీ రేటు


  మీ నెలవారీ ఈఎంఐ మీరు తీసుకునే లోన్ అమౌంట్, దానిపై వర్తించే వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు బ్యాంకును ఎంపిక చేసుకునే ముందు మార్కెట్లో వడ్డీరేట్లపై అధ్యయనం చేయండి. తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని అందించే బ్యాంకులను సంప్రదించండి. దీనితో పాటు మీరు తీసుకునే రుణానికి వర్తించే వడ్డీ రేటు ఫిక్స్డ్గా ఉంటుందా లేదా మారుతూ ఉంటుందా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకోండి.

  ప్రాసెసింగ్ ఛార్జీలు, ముందస్తు చెల్లింపులు


  రుణం ప్రాసెస్ చేయడానికి బ్యాంకులు లేదా ఫైనాన్సింగ్ సంస్థలు అమలు చేసే ఫీజునే ప్రాసెసింగ్ ఛార్జీలుగా పేర్కొంటారు. ఇది మీరు తీసుకునే మొత్తం రుణంలో 0.25 శాతం నుండి -2 శాతం మధ్య ఉంటుంది. ప్రాసెసింగ్ ఛార్జీ బ్యాంకును బట్టి మారుతుంది. ఆయా బ్యాంకులు ముందస్తు చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు, షరతులను ముందుగానే మీకు తెలియజేస్తాయి.

  SBI ATM cash: ఏటీఎం విత్‌డ్రా లిమిట్ మారింది... మీ ఎస్‌బీఐ కార్డుతో ఎంత డ్రా చేయొచ్చంటే

  LIC Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెల రూ.19,000 మీ అకౌంట్‌లోకి

  అవసరమయ్యే డాక్యుమెంట్స్


  హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే రుణగ్రహీతకు గుర్తింపు, చిరునామా, ఆదాయ ధృవీకరణ వంటి డాక్సుమెంట్స్ అవసరం అవుతాయి. మీ ఆదాయాన్ని నిరూపించుకోవడానికి ఆదాయపు పన్ను రిటర్నులు, ఫారం 16, పే స్లిప్స్, జిఎస్టి రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా ఇతర డాక్యుమెంట్స్ను సిద్దం చేసుకోండి.

  లోన్ మంజూరుకు పట్టే సమయం


  హోమ్ లోన్‌ మంజూరు చేయడానికి పట్టే సమయం బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతుంది. మీరు అన్ని డాక్సుమెంట్స్ను సకాలంలో అందజేస్తే మీ లోన్ మంజూరు చేయడానికి బ్యాంకులకు సగటున ఐదు రోజుల సమయం పడుతుంది. బలమైన వ్యవస్థతో మంచి రికార్డును కలిగి ఉన్న రుణదాతను ఎంచుకోవడం శ్రేయస్కరం.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank loans, Home loan, Housing Loans

  ఉత్తమ కథలు