హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Loan: గోల్డ్ లోన్‌కు అప్లై చేస్తున్నారా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి

Gold Loan: గోల్డ్ లోన్‌కు అప్లై చేస్తున్నారా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి

Gold Loan | మీరు గోల్డ్ లోన్‌కు అప్లై చేస్తున్నారా? గోల్డ్ లోన్ తీసుకోవడానికి ముందు ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకోండి.

Gold Loan | మీరు గోల్డ్ లోన్‌కు అప్లై చేస్తున్నారా? గోల్డ్ లోన్ తీసుకోవడానికి ముందు ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకోండి.

Gold Loan | మీరు గోల్డ్ లోన్‌కు అప్లై చేస్తున్నారా? గోల్డ్ లోన్ తీసుకోవడానికి ముందు ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకోండి.

  చేతిలో డబ్బులు ఉన్నప్పుడు బంగారాన్ని కొని దాచుకోవడం తరతరాల నుంచి వస్తున్న అలవాటు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని పెద్దలు నేర్పించిన పొదుపు మార్గం ఇది. ఇంట్లో బంగారం ఉంటే ఎప్పుడు డబ్బులు అవసరమైనా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు. డబ్బులు రాగానే నగలు విడిపించుకోవచ్చు. అయితే బంగారంపై రుణాలు తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే రావాల్సిన దానికన్నా తక్కువ అప్పు తెచ్చుకోవడమో లేదా ఎక్కువ వడ్డీ చెల్లించడమో జరగొచ్చు. దీనివల్ల నష్టపోయేది సామాన్యులే. అందుకే గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేసేముందే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే తెలివిగా బంగారంపై రుణం తీసుకోవచ్చు. ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు.

  బ్యాంకులా? ఫైనాన్సింగ్ సంస్థలా?


  గోల్డ్ లోన్ అనగానే ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థలు గుర్తొస్తాయి. బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ ఇస్తాయి. బ్యాంకులతో పోలిస్తే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువ. అయితే బంగారానికి విలువ కట్టడంలో, బంగారానికి గరిష్టంగా ఇచ్చే రుణం విషయంలో కూడా తేడాలు ఉంటాయి. మీ దగ్గరున్న బంగారానికి గరిష్టంగా ఎంత లోన్ ఇస్తారో లోన్ టు వ్యాల్యూ-LTV రేషియో నిర్ణయిస్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సిషయల్ కంపెనీలు గరిష్టంగా 75 శాతం వరకే రుణాలు ఇవ్వగలవు. అదే బ్యాంకులు అయితే 90 శాతం వరకు లోన్ ఇస్తాయి. అంటే మీ దగ్గర రూ.1,00,000 విలువైన నగలు ఉంటే బ్యాంకులు రూ.90,000 వరకు రుణం ఇస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీలు రూ.75,000 వరకు రుణం ఇస్తాయి.

  Gold Coins: గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? బంగారు నాణేలతో లాభమా... నష్టమా... తెలుసుకోండి

  Gold Price Downfall: రూ.10,000 తగ్గిన బంగారం ధర... ఈ పతనం ఎంతవరకు?

  నగల విలువ ఎలా లెక్కిస్తారు?


  నగల విలువ లెక్కించడంలో కూడా బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు మధ్య తేడాలు ఉంటాయి. మీ దగ్గర 100 గ్రాముల నగలు ఉన్నాయనుకుందాం. ఆ మొత్తాన్ని మీరు తాకట్టు పెట్టాలనుకుంటే బ్యాంకులు బంగారం ధరను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఆ నగలకు ధరను నిర్ణయిస్తుంది. కానీ ఎన్‌బీఎఫ్‌సీలు అంతకన్నా ఎక్కువ ధరను నిర్ణయిస్తాయి.

  ఎలాంటి బంగారం తాకట్టు పెట్టొచ్చు?


  గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్, నగలను తాకట్టు పెట్టొచ్చు. ప్యూరిటీ 18 క్యారెట్ల కన్నా ఎక్కువ ఉండాలి. అయితే జ్యువెలరీ షాపుల్లో కొన్న కాయిన్స్‌ని బ్యాంకులు తాకట్టు పెట్టుకోవు. గోల్డ్ బిస్కిట్స్, బార్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. అందుకే నగలు ఉంటే త్వరగా ఎక్కడైనా తాకట్టు పెట్టొచ్చు. ఇక ఆ నగల్లో ఉన్న రాళ్లు, రత్నాలు, డైమండ్స్‌కి ఏ విలువ ఉండదు. కేవలం బంగారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

  వడ్డీ ఎంత వసూలు చేస్తారు?


  ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువ. ప్రస్తుతం 7.5 శాతం నుంచే బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు ఉన్నాయి. ఫైనాన్సింగ్ సంస్థల్లో అయితే 11 శాతం నుంచి వడ్డీ రేట్లు ఉంటాయి.

  Gold Loan Interest Rates: బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా? లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే

  Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారాన్ని కొనండి ఇలా

  ఛార్జీలు ఎలా ఉంటాయి?


  ఛార్జీలు బ్యాంకులను, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతుంటాయి. వ్యాల్యుయేషన్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్ లాంటివి ఉంటాయి.

  రీపేమెంట్ ఎలా చేయాలి?


  గోల్డ్ లోన్ రీపేమెంట్ కోసం నాలుగు పద్ధతులు ఉంటాయి. లోన్ తీసుకునేప్పుడే వడ్డీ చెల్లించడం ఒక పద్ధతి. అసలుతో పాటు వడ్డీ కలిపి చివర్లో చెల్లించడం రెండో పద్ధతి. రుణాన్ని, వడ్డీని కలిపి ప్రతీ నెల కొద్దికొద్దిగా ఈఎంఐ రూపంలో చెల్లించడం మూడో పద్ధతి. వాడుకున్న డబ్బులకు మాత్రమే వడ్డీ చెల్లించడం నాలుగో పద్ధతి.

  గోల్డ్ లోన్ చెల్లించకపోతే ఏమవుతుంది?


  బంగారు నగలను తాకట్టు పెట్టి రుణం తీసుకున్న తర్వాత సకాలంలో లోన్ తిరిగి చెల్లించాలి. లేకపోతే బ్యాంకు లేదా ఫైనాన్సింగ్ సంస్థలు నోటీసులు ఇస్తాయి. ఆ తర్వాత కూడా రుణం చెల్లించకపోతే ఆభరణాలను సీజ్ చేసి వేలం వేస్తారు.

  First published:

  Tags: Bank loans, BUSINESS NEWS, Gold, Gold bars, Gold jewellery, Gold loans, Gold ornmanets, Gold Prices, Gold rate hyderabad, Gold rates, Gold shops, Personal Finance, Silver rates

  ఉత్తమ కథలు