ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు ఈ విషయాలు మర్చిపోవద్దు

మీరు పెట్టుబడులను ఎలా ప్లాన్ చేశారో అలాగే కొనసాగించాలి. అప్పులు ఇవ్వడానికి వాటిని వాడుకోకూడదు. మీ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి కాస్త ఆలస్యంగా తిరిగి చెల్లించినా మీకు ఇబ్బంది లేదనుకుంటేనే అప్పు ఇవ్వాలి.

news18-telugu
Updated: January 19, 2020, 6:39 PM IST
ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు ఈ విషయాలు మర్చిపోవద్దు
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
అప్పు లేకుండా ఎవరి జీవితం గడవదు. జీవితంలో ఒక్కసారైనా అప్పుతీసుకోని వారు ఉండరు. అప్పు ఓ అవసరం. స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర అప్పులు చేయడం సహజం. మరీ అవసరమైతే బ్యాంకుల్లో కూడా అప్పులు తీసుకుంటూ ఉంటారు. బ్యాంకులు అప్పు ఇచ్చే ముందు సవాలక్ష అంశాలు పరిశీలిస్తాయి. అన్నీ నచ్చితేనే అప్పులు ఇస్తాయి. బయట అప్పులు తీసుకోవడం సులువు. స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర ప్రతీ ఒక్కరూ అప్పులు తీసుకుంటూ ఉంటారు. మరి మీరు కూడా మీ స్నేహితులకు లేదా బంధువులకు అప్పులు ఇస్తున్నారా? అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ స్నేహితులో, బంధువులో ఆపదలో ఉన్నారని ఆదుకోవాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ... మీరు చేసే సహాయం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేయకూడదు. అన్నీ బ్యాలెన్స్ అయ్యేలా మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నెలనెలా చెల్లించాల్సిన వాయిదాలు, పొదుపు పథకాల్లో జమ చేయాల్సిన మొత్తం లాంటివన్నీ లెక్కలోకి తీసుకొని మీరు అప్పులు ఇవ్వాలి. మీరు ఏవైనా వస్తువులు కొనడానికి డబ్బులు దాచుకొన్నట్టైతే మీ షాపింగ్‌ను వాయిదా వేయొచ్చు. కానీ ఈఎంఐలు మాత్రం సమయానికి చెల్లించాలి. అలా మీ దగ్గర అదనంగా డబ్బు ఉంటేనే అప్పు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవాలి.

Loan, Personal Loan, Personal finance, Money tips, savings, Lending money, అప్పులు, రుణాలు, పర్సనల్ లోన్, పర్సనల్ ఫైనాన్స్, సేవింగ్స్, పొదుపు
(ప్రతీకాత్మక చిత్రం)


మీరు పూర్తిగా నమ్మే స్నేహితులకు, బంధువులకు మాత్రమే అప్పులు ఇవ్వాలి తప్ప, దూరపు చుట్టాలు అడిగారు కదా అని, వాళ్లెంటారివారో తెలుసుకోకుండా అప్పులు ఇస్తే తిప్పలు తప్పవు. వాళ్లు మీకు అప్పు తిరిగి చెల్లించకపోతే మీరు నష్టపోవడంతో పాటు మీరు ఆర్థికంగా డిస్టర్బ్ అవుతారు. అప్పు అడిగారు కదా అని మీ పెట్టుబడులను తాకట్టుపెట్టి మరీ అప్పులు ఇచ్చేయొద్దు. పిల్లల పైచదువుల కోసమో, పెళ్లిళ్ల కోసమో, ఆస్పత్రి ఖర్చుల కోసమో దాచుకున్న డబ్బును అప్పుగా ఇచ్చి ఇబ్బందులు పడొద్దు. మీరు పెట్టుబడులను ఎలా ప్లాన్ చేశారో అలాగే కొనసాగించాలి. అప్పులు ఇవ్వడానికి వాటిని వాడుకోకూడదు. మీ దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి కాస్త ఆలస్యంగా తిరిగి చెల్లించినా మీకు ఇబ్బంది లేదనుకుంటేనే అప్పు ఇవ్వాలి.

Loan, Personal Loan, Personal finance, Money tips, savings, Lending money, అప్పులు, రుణాలు, పర్సనల్ లోన్, పర్సనల్ ఫైనాన్స్, సేవింగ్స్, పొదుపు
(ప్రతీకాత్మక చిత్రం)


డబ్బుల విషయంలో ఎట్టిపరిస్థితుల్లో మొహమాటపడకూడదు. మొహమాటపెడుతున్నారని అప్పు ఇస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడేది మీరే. అందుకే మీరు అప్పు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కుదరదని ధైర్యంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని స్వార్థపరులు అనుకున్నా ఆలోచించాల్సిన అవసరం లేదు. మొహమాటానికైనా మీరు అప్పు ఇస్తారని తెలిస్తే మీ దగ్గర అప్పు చేసేవారి జాబితా పెరిగిపోతుంది. అందుకే ఎవరికైనా అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే అప్పులు ఇవ్వాలి. అలాగని మీరు ఇబ్బంది పడకూడదు. మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే డబ్బులు అడగడానికి మీరు మొహమాటపడాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన డబ్బులు మీ కష్టార్జితం. కాబట్టి మీరు అడిగి మరీ తీసుకోవాలి. మీ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడానికి మీరు వెనకడుగు వేయకూడదు. స్నేహితులు, బంధువుల దగ్గర తీసుకున్న అప్పుల్ని ఎప్పుడైనా తిరిగి ఇవ్వొచ్చులే అని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. అందుకే మీకు చెప్పిన గడువు లోగా తిరిగి చెల్లించకపోతే మీ బాకీ మీరు అడగాల్సిందే. అవసరమైతే మరో నాలుగు రోజులు గడువు ఇవ్వండి. కానీ మీ డబ్బు మీరు అడిగి తీసుకోండి.

Loan, Personal Loan, Personal finance, Money tips, savings, Lending money, అప్పులు, రుణాలు, పర్సనల్ లోన్, పర్సనల్ ఫైనాన్స్, సేవింగ్స్, పొదుపు
(ప్రతీకాత్మక చిత్రం)


అప్పు ఇస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, మీ స్నేహితులు, బంధువులు తీసుకునే అప్పులకు మీరు ష్యూరిటీ ఉన్నా అన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు అప్పు ఇచ్చేప్పుడు ఎన్ని అంశాలు పరిశీలిస్తారో, ష్యూరిటీ ఇచ్చేప్పుడు కూడా అవన్నీ చూడాలి. ఎందుకంటే మీరు ష్యూరిటీ ఉంటారు కాబట్టి వాళ్లు అప్పు తీర్చకపోతే అది మీవరకు వస్తుంది. అందుకే మీ స్నేహితులు, బంధువులపై 100 శాతం నమ్మకం ఉంటేనే ష్యూరిటీ ఇవ్వాలి. చివరగా ఆర్థిక లావాదేవీలు మీ సంబంధాలను దెబ్బతీయకుండా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

IRCTC: ఆ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేయొద్దంటున్న ఐఆర్‌సీటీసీ

Amazon Great Indian Sale: అమెజాన్‍లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

LIC Home Loan offer: హోమ్ లోన్ తీసుకునేవారికి ఎల్ఐసీ అద్భుతమైన ఆఫర్స్
Published by: Santhosh Kumar S
First published: January 19, 2020, 6:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading