• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • REMEMBER THESE 9 FINANCIAL DATES THAT WILL EXPIRE IN MARCH HERE FULL DETAILS NS GH

Financial Dates: మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేసుకోండి.. లేదంటే భారీ నష్టం తప్పదు.. తెలుసుకోండి

Financial Dates: మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేసుకోండి.. లేదంటే భారీ నష్టం తప్పదు.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్​ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం అమల్లోకి రాబోతోంది. దీంతో ఆ రోజు నుంచి పలు అంశాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అయితే.. మార్చి 31 సమీపిస్తున్న నేపథ్యంలో ఆ లోపు మీరు పలు కీలక పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకోండి.

  • Share this:
ఏప్రిల్​ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో.. ఆ రోజు నుంచి పలు అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల మార్చి నెల వచ్చిందంటే చాలు పౌరులంతా కొత్త రూల్స్​పై ఆరా తీస్తుంటారు. అయితే, గతేడాది కరోనా సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడుపు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో పాన్​ కార్డును ఆధార్​ కార్డుతో అనుసంధానించడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటి గడువు 2021 మార్చి 31వ తేదీతో ముగియనుండటంతో.. ప్రతి ఒక్కరూ ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చి 31 సమీపిస్తున్న నేపథ్యంలో మీరు పూర్తి చేయాల్సిన కీలక అంశాల గురించి తెలుసుకోండి.

డబుల్ టాక్సేషన్​ నివారణకు డిక్లరేషన్​
కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది విదేశీ పౌరులు, ప్రవాసీయులు భారతదేశంలోనే ఉండాల్సి వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో వారు ఇక్కడ సంపాదించిన ఆదాయంపై డబుల్ టాక్సేషన్​ కట్టాల్సి వస్తోంది. అటువంటి వారు మార్చి 31లోగా ప్రభుత్వానికి డిక్లరేషన్​ సమర్పించి డబుల్​ టాక్సేషన్​ నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. 2021 మార్చి 3న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, డబుల్స్​ టాక్స్​ను ఎదుర్కొంటున్న వారు ఫారం- NRలో ఆయా వివరాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

పాన్ ఆధార్​ లింక్​
పాన్​ కార్డు, ఆధార్​ కార్డు లింక్​ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు గడువు ఇచ్చింది. తొలుత చాలా డెడ్​లైన్లు పెట్టినప్పటికీ,.. చివరగా దీన్ని 2021 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ తేదీలోగా మీ పాన్​ కార్డు, ఆధార్​తో లింక్​ చేయకపోతే పాన్​ నంబర్​ పనిచేయదని కేంద్ర స్పష్టం చేసింది. పాన్​కార్డు పనిచేయకపోతే పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరపడం కుదరదని, తప్పనిసరిగా పాన్​ కార్డుకు, ఆధార్​ కార్డు లింక్​ చేయాలని పేర్కొంది.

ఎల్‌టిసి క్యాష్ వోచర్ స్కీమ్
ఎల్​టీసీ క్యాష్​ వోచర్​ పథకం కింద బిల్లులు సమర్పించడం, పన్ను ప్రయోజనాలను పొందడానికి మార్చి 31వ తేదీలోపు మీ బిల్లులను సరైన ఫార్మాట్​లో ప్రభుత్వానికి సమర్పించాలి. ఆ బిల్లుల్లో జీఎస్టీ మొత్తం, వోచర్​ నంబర్​ వంటి వాటిని పేర్కొనాలి. కాగా, ఈ పథకాన్ని 2020 అక్టోబర్​ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పన్ను చెల్లింపులను ఉత్తేజ పర్చడం, ఎల్​టీఏ మొత్తాన్ని క్లైయిమ్​ చేసుకోవడానికి అవకాశం కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

ఐటీఆర్ ఫైలింగ్​
2019–20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయకపోతే భారీ ఖర్చులను మోయాల్సి వస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది కాబట్టి, త్వరగా ఆదాయపు పన్ను రిటర్న్​ దాఖలు చేయాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఒకవేళ గడువు దాటిన తర్వాత ఐటీఆర్​ దాఖలు చేస్తే రూ.10 వేల ఆలస్య రుసుం చెల్లించాలని తెలిపింది. రూ.5 లక్షల ఆదాయం వరకు ఉన్న చిన్న చెల్లింపుదారులు రూ.1000 ఆలస్య రుసు చెల్లించాల్సి ఉంటుంది. పాత పద్దతి ప్రకారం పన్ను చెల్లించేవారు డిక్లరేషన్​ ఇవ్వకపోతే.. పన్ను ప్రయోజనాలను పొందలేరని స్పష్టం చేసింది. కాబట్టి మార్చి 31లోపు మీ ఐటీఆర్​ దాఖలును పూర్తి చేయాలని పేర్కొంది.

వివాద్​ సే విశ్వాస్​
2020 మార్చి 17న అమల్లోకి వచ్చిన వివాద్​ సే విశ్వాస్​ పథకం కింద సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్ట్​ టాక్సెస్​(సీబీడీటీ) జారీ చేసిన నోటిఫికేషన్​ ప్రకారం డిక్లరేషన్​ దాఖలు చేయడానికి గడువు మార్చి 31 వరకు ఉంది. పెండింగ్​లో ఉన్న ఆదాయపు పన్ను వాజ్యాన్ని తగ్గించడం, ప్రభుత్వానికి సకాలంలో ఆదాయాన్ని సంపాదించడంతో పాటు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మార్చి 31లోగా మీ ఐటీఆర్​ను సమర్పించాలని ప్రభుత్వం కోరుతోంది.

స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్
ప్రభుత్వ ఉద్యోగులు 2021 మార్చి 31 వరకు రూ.10 వేల వరకు స్పెషల్​ ఫెస్టివల్​ అడ్వాన్స్​ పొందవచ్చు. ఎల్​టీసీ క్యాష్​ వోచర్​ పథకంతో పాటు 2020 అక్టోబర్​లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అడ్వాన్స్​ తీసుకుంటే 10 వాయిదాల్లో డబ్బును తిరిగి చెల్లించవచ్చు.

క్రెడిట్​ లైన్​ గ్యారెంటీ స్కీం
కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలను పునరుద్దరించేందుకు కేంద్రం అత్యవసర క్రెడిట్​ లైన్​ పథకాన్ని ప్రకటించింది. దీని కింద కోవిడ్​ కష్టకాలంలో వ్యాపారులకు ప్రభుత్వం హామీ లేకుండా రుణాలు మంజూరు చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు కూడా ఈ నెల చివరి వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాన్ఫిడెన్స్​ బై కాన్ఫిడెన్స్​ స్కీమ్​ కింద డిక్లరేషన్​ దాఖలు చేయడానికి గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించింది. కాగా, ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా 2020 మే 13 న ప్రభుత్వం ఈ అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకాన్ని ప్రకటించింది.
Published by:Nikhil Kumar S
First published: