హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Card: ఈ 5 టిప్స్‌తో ఆధార్ మోసాలకు చెక్... గుర్తుంచుకోండి

Aadhaar Card: ఈ 5 టిప్స్‌తో ఆధార్ మోసాలకు చెక్... గుర్తుంచుకోండి

Aadhaar Card: ఈ 5 టిప్స్‌తో ఆధార్ మోసాలకు చెక్... గుర్తుంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card: ఈ 5 టిప్స్‌తో ఆధార్ మోసాలకు చెక్... గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card Safety Tips | ఆధార్ కార్డ్ ఉన్నవారు అప్రమత్తంగా లేకపోతే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆధార్ కార్డ్ (Aadhaar Card) ఉపయోగించే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఆధార్ కార్డ్... ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే ఈ కార్డు ఇప్పుడు ప్రతీచోటా ఉపయోగపడుతోంది. బ్యాంక్ అకౌంట్ దగ్గర్నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ చోటా ఆధార్ కార్డును (Aadhaar Card) ఐడెంటిటీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా ఇస్తున్నారు భారత పౌరులు. పీఎం కిసాన్ స్కీమ్ (PM Kisan Scheme), రేషన్ పంపిణీ లాంటి వాటికోసం ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మారింది. ఇలా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఆధార్ చుట్టూ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆధార్ మోసాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డ్ ఉన్నవారు, ఆధార్‌ను ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా స్వీకరిస్తున్నవారు కొన్ని టిప్స్ గుర్తుంచుకుంటే ఆధార్ మోసాలకు చెక్ పెటొచ్చు. ఈ 5 టిప్స్‌తో ఆధార్ మోసాలకు చెక్ పెట్టండి.

1. ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా స్వీకరించేముందు అసలు ఆ ఆధార్ కార్డ్ ఒరిజినలో కాదో చెక్ చేయండి. https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar పోర్టల్లో ఆధార్ నెంబర్ , క్యాప్చా కోడ్ ఎంటర్ చేయడం ద్వారా అసలు ఆ ఆధార్ కార్డ్ ఒరిజనలో కాదో ఈజీగా తెలిసిపోతుంది. కావాలంటే మీ ఆధార్ నెంబర్‌తో ట్రై చేసి చూడండి.

Gas Cylinder: 10 సిలిండర్ల డబ్బులకే 12 సిలిండర్లు... వారికి మాత్రమే

2. ఆధార్ ఆథెంటికేషన్ సమయంలో ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. రేషన్ తీసుకునే సమయంలో వచ్చే ఓటీపీ ఇదే. అయితే మీ ప్రమేయం లేకుండా ఆధార్‌కు సంబంధించి వచ్చే ఓటీపీని ఎవరితో షేర్ చేయకూడదు.

3. ఎక్కడైనా ఆధార్ కార్డ్ అవసరమై ఇంటర్నెట్ సెంటర్‌లో లేదా పబ్లిక్ కంప్యూటర్‌లో ఇ-ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేశారా? అయితే ప్రింట్ తీసుకోగానే ఇఆధార్ ఫైల్ డిలిట్ చేయండి. లేకపోతే మీ వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

4. మీ ఆధార్ కార్డును ఎక్కడా ఉపయోగించట్లేదా? ఆధార్ వివరాలు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదా? అయితే మీ ఆధార్ వివరాలను లాక్ చేయండి. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో మీ ఆధార్ వివరాలను లాక్ చేయొచ్చు. ఎవరికైనా మీ ఆధార్ నెంబర్ తెలిసినా వాటిని ఉపయోగించలేరు.

Train Tickets: దసరా ట్రైన్‌లో టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో చెక్ చేయండిలా

5. అసలు మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేశారా? లేదా మీ దగ్గర లేని పాత మొబైల్ నెంబర్‌నే కొనసాగిస్తున్నారా? అయితే వెంటనే కొత్త మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయించండి. మొబైల్ నెంబర్ మాత్రమే కాదు ఇప్పుడు మీరు ఉపయోగిస్తున్న ఇమెయిల్ అడ్రస్‌ను కూడా అప్‌డేట్ చేయాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, AADHAR, UIDAI

ఉత్తమ కథలు