Home /News /business /

RELIANCE TRENDS STRENGTHENS CONNECT WITH CONSUMERS THROUGH SELFIE WITH RANGOLI CONTEST DURING MAKAR SANKRANTI FESTIVAL SS

Reliance Trends: రిలయన్స్ ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోళీ కాంటెస్ట్... మీరూ పాల్గొనండి ఇలా

Reliance Trends: రిలయన్స్ ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోళీ కాంటెస్ట్... మీరూ పాల్గొనండి ఇలా
(image: Reliance Trends)

Reliance Trends: రిలయన్స్ ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోళీ కాంటెస్ట్... మీరూ పాల్గొనండి ఇలా (image: Reliance Trends)

Reliance Trends | రిలయన్స్ ట్రెండ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల్లో ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోళీ కాంటెస్ట్ (Trends Selfie with Rangoli Contest) నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో ఎలా పాల్గొనాలో తెలుసుకోండి.

    దేశంలోనే అతిపెద్ద‌, శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న దుస్తులు, ఇతర ఉపకరణాల రీటైల్ చైన్ అయిన రిల‌య‌న్స్ ట్రెండ్స్ (Reliance Trends) సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లోని చిన్న ప‌ట్ట‌ణాల్లో గ‌ల వినియోగ‌దారుల‌కు ఆస‌క్తిక‌ర‌మైన పోటీలు (Rangoli Contest) పెట్ట‌డం ద్వారా వారితో త‌న బంధాన్ని బ‌లోపేతం చేసుకుంటోంది. మ‌క‌ర సంక్రాంతి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ముఖ్య‌మైన పండుగ‌. సంక్రాంతి అంటే మార్పు. ఈరోజే సూర్యుడు మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశిస్తాడ‌ని చెబుతారు. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఉత్త‌ర‌దిశ‌గా క‌దిలే ఈ సూర్యుడిని దేవుడిగా పూజిస్తారు. సూర్యుడు మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశించే తొలిరోజే మ‌క‌ర సంక్రాంతి.

    మ‌క‌ర సంక్రాంతిని రంగురంగుల అలంక‌ర‌ణ‌లతో సంబ‌రంగా చేసుకుంటారు. గ్రామాల్లో పిల్ల‌లు ఇంటింటికీ తిరిగి పాట‌లు పాడుతూ మిఠాయిలు అడుగుతారు. ఇక భోగి మంట‌లు, విందు వంట‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో చాలా ప్రాధాన్య‌మైన‌వి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో అనేక పట్టణాల్లో విస్తరించి ఉన్న ట్రెండ్స్ మ‌క‌ర‌సంక్రాంతి సంద‌ర్భంగా చిన్న ప‌ట్ట‌ణాల్లోని వినియోగ‌దారుల‌కు ఆస‌క్తిక‌ర‌మైన పోటీ పెట్టింది.

    Sankranti Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్... మరో ఆరు ప్రత్యేక రైళ్లు

    ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోలి కాంటెస్ట్


    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఉన్న ట్రెండ్స్ మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్భంగా వినియోగదారుల‌తో బంధాన్ని పెంచుకుంటోంది. ఇందుకు "ట్రెండ్స్ సెల్ఫీ విత్ రంగోలి" (Selfie with Rangoli) అనే ఆస‌క్తిక‌ర‌మైన పోటీ పెడుతోంది. వినియోగ‌దారులు తాము త‌మ ఇంటి ప్రాంగ‌ణంలో వేసిన రంగురంగు ముగ్గుల‌తో ఓ సెల్ఫీ తీసుకోవాలి. దాన్ని ట్రెండ్స్ ఈ పోటీకోస‌మే ప్ర‌త్యేకంగా పెట్టిన వాట్సాప్ నంబ‌రుకు పంపాలి.

    అత్యుత్త‌మ ముగ్గుగా ఎంపికైన సెల్ఫీ లేదీ ఫొటోకు మొద‌టి బ‌హుమ‌తిగా సుమారు రూ.1500 ఇస్తారు. అంతేకాదు, పోటీలో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికీ ట్రెండ్స్ డిస్కౌంట్ కూప‌న్ ల‌భిస్తుంది. దీన్ని త‌మ‌కు స‌మీపంలోని ట్రెండ్స్ దుకాణం నుంచి పొంద‌చ్చు. ఈ పోటీ 2022 జ‌న‌వ‌రి 20న ముగుస్తుంది. పోటీకి సంబంధించిన వివ‌రాల‌ను వినియోగ‌దారుల‌కు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయ‌డంతో పాటు ఇంటింటికీ వ‌చ్చే ట్రెండ్స్ పాంప్లెట్ల ద్వారా కూడా తెలుపుతారు. ట్రెండ్స్ దుకాణాల‌కు స‌మీపంలో ఉండే ప్ర‌ముఖులు విజేత‌ల‌ను ఎంపిక చేస్తారు.

    UPI offline: మొబైల్ డేటా లేకపోయినా యూపీఐ పేమెంట్స్... *99# సర్వీస్ వాడుకోండి ఇలా

    ఎంట్రీలు అందిన త‌ర్వాత వినియోగ‌దారులంద‌రికీ ట్రెండ్స్ వాట్సాప్ నుంచి వారి భాగ‌స్వామ్యానికి థాంక్యూ అనే సందేశం పంపుతుంది. విజేత‌లు ఎవ‌ర‌న్న విష‌యాన్నీ అంద‌రికీ వాట్సాప్ ద్వారా తెలియ‌జేస్తారు. మొద‌టి బ‌హుమ‌తి విజేత‌ను ఆయా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని ట్రెండ్స్ దుకాణానికి ఆహ్వానిస్తారు. మొద‌టి బ‌హుమ‌తి సుమారు రూ.1500 ఆయా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోని మునిసిపాలిటీ లేదా పోలీసు శాఖ‌ల‌లో ఉన్న సీనియ‌ర్ మ‌హిళా ప్ర‌భుత్వాధికారుల చేతుల మీదుగా బ‌హూక‌రిస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు మీకు స‌మీపంలోని ట్రెండ్స్ స్టోర్ల‌ను సంద‌ర్శించండి.

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో వినియోగ‌దారుల‌తో ట్రెండ్స్ అనుబంధం మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్భంగా మ‌రోసారి రుజువైంది. వినియోగ‌దారుల రోజువారీ జీవితాల్లో భాగమైన ముఖ్య‌మైన పండుగ‌లు, సామాజిక సంద‌ర్భాల‌లో వారితో అనుబంధం ఏర్ప‌రుచుకుంటోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో మ‌క‌ర సంక్రాంతి స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని రెండు రాష్ట్రాల్లో వినియోగ‌దారుల కోసం ట్రెండ్స్ స‌రికొత్త వ‌స్త్రశ్రేణిని తీసుకొచ్చింది. పురుషులు, మ‌హిళ‌లు, పిల్ల‌ల కోసం తాజా డిజైన్ల‌లో వ‌స్త్రాల‌తో పాటు పాద‌ర‌క్ష‌లు, ఇత‌ర యాక్సెస‌రీలు అన్నీ అందుబాటులోకి తెచ్చింది.

    అత్యాధునిక ఫ్యాష‌న్ల‌తో, అందుబాటు ధ‌ర‌ల్లో ఉండే ఈ రేంజితో ట్రెండ్స్ త‌న వినియోగ‌దారుల‌కు ప్ర‌తిరోజూ తిరుగులేని వ‌స్త్ర ప్ర‌పంచాన్ని అందిస్తోంది. దీంతో వారు రోజూ ఫ్యాష‌న‌బుల్‌గా క‌నిపిస్తారు, ప్ర‌జ‌లంతా వీరిని గుర్తించి, వీరిగురించే మాట్లాడుకుంటారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Reliance Trends, Sankranti

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు