Home /News /business /

RELIANCE TOPPLES IOC TO BECOME THE BIGGEST INDIAN COMPANY SS

Reliance: ఐఓసీ కన్నా రిలయెన్స్ లాభాలు డబుల్

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ప్రతీకాత్మక చిత్రం)

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ప్రతీకాత్మక చిత్రం)

Reliance | రెవెన్యూ, లాభం, మార్కెట్ క్యాపిటలైజేషన్... మూడు ప్రమాణాల్లో రిలయెన్స్ కన్నా ఐఓసీ చాలా వెనుకంజలో ఉంది.

    రిలయెన్స్... ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాల్లో విస్తరించింది. ఆయిల్ వ్యాపారంలో భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను మించిపోయింది రిలయెన్స్. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రిలయెన్స్ టర్నోవర్ రూ.6.23 లక్షల కోట్లు కాగా, ఐఓసీ టర్నోవర్ రూ.6.17 లక్షల కోట్లు అని రెండు కంపెనీలు రెగ్యులేటరీకి ఫైల్ చేసిన నివేదికల్లో తేలింది. టర్నోవర్‌లో ఐఓసీని దాటిన రిలయెన్స్ లాభాల్లో మరింత దూకుడు చూపించింది. ఐఓసీ అందుకోలేనంత స్థాయిలో రిలయెన్స్ లాభాలున్నాయి. దేశంలోనే అత్యంత లాభదాయక కంపెనీగా రిలయెన్స్ రికార్డులు సృష్టిస్తోంది. టెలికామ్, రీటైల్, డిజిటల్ సర్వీసెస్‌లో వ్యాపారాలను విస్తరించిన రిలయెన్స్ నికర లాభం రూ.39,588 కోట్లు కాగా, ఐఓసీ నికర లాభం రూ.17.274 కోట్లు.

    ఆయిల్ రీఫైనింగ్, పెట్రోకెమికల్స్, గ్యాస్ బిజినెస్ చేస్తున్న ఐఓసీ రెవెన్యూ 2017-18 సంవత్సరంలో రూ.19,945.26 కోట్లు ఉండగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో 23.6 శాతం తగ్గి రూ.17.274 కోట్లకు చేరింది. మరోవైపు రిలయెన్స్ లాభాలు 13 శాతం పెరగడం విశేషం. 2017-18లో రిలయెన్స్ లాభం రూ.34,988 కోట్లు కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.39,588 కోట్లు. అంతకుముందు సంవత్సరం వరకు లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థగా పేరున్న ఐఓసీ ఆ స్థానాన్ని కోల్పోయింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఆస్థానాన్ని ఆక్రమించింది. ఓఎన్జీసీ నికర లాభం 2017-18 సంవత్సరంలో రూ.22,189.45 కోట్లు. అయితే ఇంకా ఓఎన్జీసీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాలను వెల్లడించాల్సి ఉంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో ఓఎన్జీసీ నికర లాభం రూ.22,671 కోట్లు.

    రెవెన్యూ, లాభం, మార్కెట్ క్యాపిటలైజేషన్... మూడు ప్రమాణాల్లో రిలయెన్స్ కన్నా ఐఓసీ చాలా వెనుకంజలో ఉంది. 2010 ఆర్థిక సంవత్సరం నుంచి 2019 వరకు రిలయెన్స్ వార్షిక వృద్ధి రేటు 14 శాతం. ఇదే కాలంలో ఐఓసీ వార్షిక వృద్ధి రేటు 6.3 శాతం మాత్రమే. మంగళవారం రిలయెన్స్ షేర్ ధర రూ.1,345 కాగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.52 లక్షల కోట్లు.

    Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?

    WhatsApp: వాట్సప్‌లో నైట్ మోడ్ ఎలా ఉందో చూశారా?

    IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఇలా బుక్ చేయండి
    First published:

    Tags: Indian Oil Corporation, IOC, ONGC, Reliance

    తదుపరి వార్తలు