పర్యావరణ పరిరక్షణపై రిలయన్స్ ఇండస్ట్రీస్ దృష్టిసారించింది. ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్‌గా కర్భన ఇంధనాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. 2035 నాటికి కార్బన్-జీరో సంస్థగా మార్చాలని నిర్ణయించినట్లుకున్నట్లు రియలన్స్ యానువల్ జనరల్ మీటింగ్(RIL AGM)లో రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం వాహనాల్లో వినియోగిస్తున్న ఇంధనాల స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్, హైడ్రోజన్ వంటి ఎకో ఫ్రెండ్లీ ఇంధనాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అంతేకాదు అధునాత టెక్నాలజీ సాయంతో కర్బన ఉద్గారాలను ఉపయోగకర ఉత్పత్తులు, రసాయనాల కింద మార్చడంపై దృష్టి పెడతామన్నారు ముకేశ్ అంబానీ.
హైడ్రోజన్, విండ్, సోలార్, ఫ్యూయెల్ సెల్స్, బ్యాటరీ వంటి ప్రత్యామ్నాయాలతో నమ్మదగ్గమైన, స్వచ్ఛమైన, అందుబాటులో ధరలో లభించే ఇంధనాన్ని తీసుకొస్తాం. ప్రపంచంలోనే అధునాతన ఇంధన శక్తితా అవతరించేందుకు 15 ఏళ్ల విజన్‌తో ముందుకెళ్తున్నాం. ఈ వ్యూహాన్ని విజయవంతంగా అమలుచేసి 2035 నాటికి కార్బన్ రహిత ఇంధనం సంస్థగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
దీన్ని వ్యాపార కోణంలో చూడవద్దని.. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు ముకేశ్ అంబానీ. వాతావరణ మార్పుల నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన చెప్పారు. ఈ కల సాకారమయ్యేందుకు అన్ని విధాలా కృషిచేస్తామని వెల్లడించారు ముకేశ్ అంబానీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mukesh Ambani, Reliance, Reliance Jio