Reliance Smart: తెలంగాణలో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్... రూ.9 ధరకే అనేక ఆఫర్లు

Reliance Smart | రూ.1499 విలువైన వస్తువులు కొన్నవారికి రూ.9 ధరకే కిలో పంచదార లభిస్తుంది. అంతేకాదు... 'పవర్ ఆఫ్ 9' పేరుతో ప్రారంభోత్సవ ఆఫర్ కింద రూ.9 ధరకే అనేక ఉత్పత్తులు, వస్తువుల్ని అందిస్తోంది రిలయెన్స్ స్మార్ట్.

news18-telugu
Updated: July 31, 2019, 5:36 PM IST
Reliance Smart: తెలంగాణలో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్... రూ.9 ధరకే అనేక ఆఫర్లు
Reliance Smart: తెలంగాణలో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్... రూ.9 ధరకే అనేక ఆఫర్లు
news18-telugu
Updated: July 31, 2019, 5:36 PM IST
తెలంగాణలో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ ప్రారంభమైంది. ఖమ్మంలోని బాలాజీనగర్‌లో ఉన్న వైఎస్ టవర్స్‌లో ఈ స్మార్ట్‌ స్టోర్‌ను ఏర్పాటు చేసింది రిలయెన్స్. అతిపెద్ద సూపర్ మార్కెట్ చెయిన్‌గా పేరున్న రిలయెన్స్ స్మార్ట్ స్టోర్‌లో కిరాణా సరుకుల నుంచి కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, కిచెన్ వేర్, హోమ్ వేర్ లాంటి ఎన్నో ఉత్పత్తులు ఒకే చోట కస్టమర్లు కొనొచ్చు. రిలయెన్స్ స్మార్ట్ వినియోగదారులు అన్ని ఉత్పత్తులపై ఏడాదంతా ఎంఆర్‌పీపై కనీసం 6% డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో పాటు రూ.1499 విలువైన వస్తువులు కొన్నవారికి రూ.9 ధరకే కిలో పంచదార లభిస్తుంది. అంతేకాదు... 'పవర్ ఆఫ్ 9' పేరుతో ప్రారంభోత్సవ ఆఫర్ కింద రూ.9 ధరకే అనేక ఉత్పత్తులు, వస్తువుల్ని అందిస్తోంది రిలయెన్స్ స్మార్ట్.

ఖమ్మంలో ఏర్పాటైన స్టోర్‌తో కలుపుకొని తెలంగాణలో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 18 కి చేరుకుంది. ఖమ్మంలో 29,800 విస్తీర్ణంలో స్టోర్ ఏర్పాటు చేయడం విశేషం. దేశవ్యాప్తంగా చూస్తే రిలయెన్స్ స్మార్ట్ స్టోర్లు 100 పైగా నగరాల్లో ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకునే ఆఫర్లతో దేశవ్యాప్తంగా రిలయెన్స్ స్మార్ట్ స్టోర్లు ఉత్తమమైన సూపర్ మార్కెట్లుగా నిలుస్తున్నాయి. లార్జ్ ఫార్మాట్ సూపర్ మార్కెట్ కేటగిరీలో రిలయెన్స్ స్మార్ట్ వినియోగదారులకు ఉత్తమమైన ఉత్పత్తుల్ని తక్కువ ధరకే అందించడం విశేషం. కస్టమర్లకు ఉత్తమమైన షాపింగ్ అనుభూతిని అందించడంలోనూ రిలయెన్స్ స్మార్ట్ ముందుంది.

Realme 3i: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 3ఐ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:

Smart Consumer: మీరు నకిలీ వస్తువులు కొంటున్నారా? ఈ యాప్‌తో తెలుసుకోండి

LIC Plan: రోజుకు రూ.29... రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్... ఇంకెన్నో లాభాలు
Loading...
Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే
First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...