Home /News /business /

RELIANCE SAID IT PROPOSED TO MERGE ALL ITS MEDIA PROPERTIES WITH ZEE ENTERTAINMENT AT FAIR VALUATIONS SS

Zee-Invesco Case: జీ, ఇన్వెస్కో వివాదం... క్లారిటీ ఇచ్చిన రిలయన్స్

Zee-Invesco Case: జీ, ఇన్వెస్కో వివాదం... క్లారిటీ ఇచ్చిన రిలయన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Zee-Invesco Case: జీ, ఇన్వెస్కో వివాదం... క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Zee-Invesco Case | జీ, ఇన్వెస్కో మధ్య వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో రిలయన్స్ (Reliance) పేరు బయటకు వచ్చింది. దీంతో అసలేం జరిగిందో వివరిస్తూ రిలయన్స్ క్లారిటీ ఇచ్చింది.

    జీ, ఇన్వెస్కో మధ్య వివాదంలో (Zee-Invesco Case) రిలయన్స్ పేరు రావడంతో ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది రిలయన్స్. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రిలయన్స్ (Reliance Industries) స్పష్టం చేసింది. జీ మీడియా సంస్థల్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ నుంచి వచ్చిన ఆఫర్ చాలా తక్కువ వ్యాల్యుయేషన్‌తో ఉందని జీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా (Punit Goenka) షేర్ హోల్డర్లకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో రిలయన్స్ పేరు రావడంతో రిలయన్స్ స్పష్టతనిచ్చింది. 2021 ఫిబ్రవరి, మార్చిలో పునీత్ గోయెంకాతో తమ ప్రతినిధులు నేరుగా చర్చల్ని జరిపేందుకు ఇన్వెస్కో సహకరించిందని రిలయన్స్ తెలిపింది.

    Business Ideas: జాబ్ చేయకుండా డబ్బు సంపాదించాలా? ఈ 8 ఐడియాలు మీకోసమే

    న్యాయమైన వ్యాల్యుయేషన్స్‌తో తమ మీడియా సంస్థలు అన్నింటినీ జీలో విలీనం చేసేందుకు విస్తృత ప్రతిపాదన చేశామని, జీ సంస్థలతో పాటు తమ సంస్థల్ని వ్యాల్యుయేషన్ చేసేందుకు ఒకే తరహా ప్యారామీటర్స్ ఫాలో అయ్యామని రిలయన్స్ తెలిపింది. ఈ ప్రతిపాదన ద్వారా విలీన సంస్థల బలాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించామని, జీ వాటాదారులతో సహా అందరికీ గణనీయమైన విలువను సృష్టించడానికి ప్రయత్నించామని రిలయన్స్ తెలిపింది. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తోనే నిర్వహణను కొనసాగించడానికి రిలయన్స్ ఎప్పుడూ ప్రయత్నిస్తుందని, వారి పనితీరును బట్టి ప్రతిఫలం అందిస్తుందని రిలయన్స్ తెలిపింది.

    EPF Rule: రూ.7 లక్షల ఉచిత ఇన్స్యూరెన్స్ కావాలంటే వెంటనే ఈ పనిచేయండి

    ఈ ప్రతిపాదనలో గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించాలన్న అంశం కూడా ఉందని, గోయెంకాతో పాటు టాప్ మేనేజ్‌మెంట్‌కు ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ESOPs) ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉందని రిలయన్స్ తెలిపింది. అయితే ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ద్వారా వాటాలు పెంచుకోవాలని వ్యవస్థాపక కుటుంబం భావించడంతో గోయెంకాకు, ఇన్వెస్కోకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని రిలయన్స్ వివరించింది. అయితే మార్కెట్ కొనుగోళ్ల ద్వారా తమ పెట్టుబడులు పెంచుకోవచ్చని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.

    7th Pay Commission: ఆ ఉద్యోగుల‌కు రూ.17,951 బోనస్ ప్రకటించిన కేంద్రం... ద‌స‌రా, దీపావళి బొనాంజా

    ఇన్వెస్కో, జీ వ్యవస్థాపకుల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ డీల్‌పై చర్చలు ముందుగు సాగలేదు. ఈ వ్యవస్థాపకులందర్నీ రిలయన్స్ గౌరవిస్తుందని, ఎలాంటి ప్రతికూల లావాదేవీలను ఆశ్రయించలేదని రిలయన్స్ స్పష్టం చేసింది. కాబట్టి తాము ముందుకు సాగట్లేదని రిలయన్స్ వెల్లడించింది. ఇక జీలో ఇన్వెస్కోకు 18 శాతం వాటాలు ఉన్నాయి. కార్పొరేట్ గవర్నెన్స్‌లో లోపాల కారణంగా గోయెంకాతో పాటు జీ బోర్డును తప్పించాలని ఇన్వెస్కో భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో రిలయన్స్ పేరు రావడంపై తాము విచారం వ్యక్తం చేస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Reliance, Reliance Industries

    తదుపరి వార్తలు