news18-telugu
Updated: November 23, 2020, 7:56 PM IST
Reliance Retail (credit - twitter)
Reliance Retail రిలయన్స్ రిటైల్ దేశంలోని చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించడానికి ముందడుగు వేసింది. ఇందులో భాగంగా స్థానికంగా తయారుచేసిన ఉత్పత్తులను ప్రోత్సహించడానికి రిలయన్స్ రిటైల్ 50 GI క్లస్టర్ల నుండి 40వేలకు పైగా కళాత్మక ఉత్పత్తులను స్టోర్ల ద్వారా విక్రయించి కళాకారులకు తోడ్పాటును అందించింది. ముఖ్యంగా చేతివృత్తుల కళాకారులతో పాటు స్థానికంగా తయారైన అనేక కళాత్మక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, ఈ పండుగ సీజన్లో, రిలయన్స్ రిటైల్ 50 కంటే ఎక్కువ GI క్లస్టర్ల నుంచి 40,000 కంటే ఎక్కువ ఉత్పత్తులను తన వినియోగదారులకు పరిచయం చేసింది. సంస్థ మూడేళ్లుగా చేపడుతున్న తన ప్రధాన కార్యక్రమాలైన “Indie by AJIO” మరియు “Swadesh” ద్వారా స్థానిక చేతివృత్తులవారికి ఉపాధి అమ్మకాలకు మార్గాలను అందిస్తోంది.
ఈ ప్రత్యేక సేల్ ద్వారా 600 రకాల చేతివృత్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 30,000 మందికి పైగా కళాకారులు తయారు చేసిన విస్తృత శ్రేణి బట్టలు, హస్తకళలు, చేతితో తయారు చేసిన సహజ వస్తువులను రిటైల్ స్టోర్ల ద్వారా కస్టమర్లకు పరిచయం చేసింది.
రిలయన్స్ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ప్రెసిడెంట్ అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ 'సంవత్సరాలుగా మా ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నాము. ఇది మాతో కలిసి పనిచేస్తున్న అనే చేతివృత్తుల ఉత్పత్తులను నేటి వినియోగదారులకు అందుబాటులోకి తేవడంలో సఫలీకృతం అయ్యాము. అని తెలిపారు.
"Indie by AJIO" అనే వినూత్న కార్యక్రమం ద్వారా స్థానిక కళలు,హస్తకళ ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెట్ కల్పించనున్నట్లు కంపెనీ తన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇది భారతదేశంలోని అద్భుతమైన వస్త్ర, చేనేత సంప్రదాయాలను ఆధునిక ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన సంస్కృతిని, దుస్తుల నుండి గృహోపకరణాలు, నగలు, బూట్ల వరకు విస్తృత శ్రేణి జీవనశైలి ఉత్పత్తులలో చక్కగా అందుబాటులోకి తెచ్చిందని ఆయన సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వేగంగా విస్తరిస్తున్న ఈ పోర్ట్‌ఫోలియో ద్వారా, AJIO వినియోగదారులకు ఉత్తమమైన దేశీయ ఫ్యాషన్ మరియు హస్తకళలను అందుబాటులోకి తేవడానికి ఉపయోగపడింది. వినియోగదారులు ఇంటి వద్దకే ఈ ఉత్పత్తులను అందుబాటులో తెచ్చేందుకు వీలు కల్పిస్తుందని ఈ ప్రకటనలో పేర్కొంది. అంటే, ఈ ప్లాట్‌ఫాం ద్వారా తమకు ఇష్టమైన ఫ్యాషన్‌ను హోమ్ డెలివరీ ద్వారా వినియోగదారులకు పొందేవీలుంది.
Published by:
Krishna Adithya
First published:
November 23, 2020, 7:56 PM IST