news18-telugu
Updated: November 19, 2020, 7:33 PM IST
Reliance Retail (credit - twitter)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ప్రస్తుత నిధుల సమీకరణ, భాగస్వామ్య ఒప్పందాల దశను పూర్తి చేసుకుంది. కేవలం రెండు నెలల్లోనే రూ.47,265 కోట్ల నిధులను సమీకరించింది. 9 సంస్థల నుంచి ఈ నిధులను సమీకరించింది. అందులో భాగంగా, ఆయా సంస్థలకు 69,27,81,234 ఈక్విటీ షేర్లను (10.09శాతం) వాటాగా ఇచ్చింది. సెప్టెంబర్ 25న సిల్వర్ లేక్ పార్టనర్స్‌తో మొదలు పెట్టిన నిధుల సమీకరణ, నవంబర్ 9న పీఐఎఫ్‌తో ముగిసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏయే కంపెనీలు ఎంత నిధులు పెట్టుబడి పెట్టి, ఎంత షేర్లు కొనుగోలు చేశాయనే వివరాలను అందులో ప్రకటించింది. వాటిలో అత్యధికంగా పీఐఎఫ్ సంస్థ రూ.9555 కోట్లు చెల్లించి 2.04 శాతం షేర్లను దక్కించుకుంది. ఆ తర్వాత సిల్వర్ లేక్, సిల్వర్ లేక్ పార్టనర్స్ కో ఇన్వెస్టర్స్ సంయుక్తంగా రూ.9375 కోట్లు చెల్లించి 2.00 శాతం షేర్లను కొనుగోలు చేశాయి.
ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ‘అలాంటి బలమైన, పేరుపొందిన పార్ట్నర్స్ రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టడం గర్వంగా ఉంది. రిలయన్స్ వ్యాపారంపై ఇన్వెస్టర్లు నమ్మకం ఉంచడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. వారి అనుభవం, గ్లోబల్ కనెక్టివిటీ ద్వారా పరస్పరం లబ్దిపొందేందుకు ప్రయత్నం చేస్తాం. మా న్యూ కామర్స్ విధానం ద్వారా ఇండియా రిటైల్ సెక్టార్లో సమూల మార్పులు తీసుకురావడానికి రిలయన్స్ రిటైల్ కృషి చేస్తుంది. అలాగే, లక్షలాది మంది చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తోడ్పాటు అందిస్తుంది.’ అని అన్నారు.

Reliance Retail: రిలయన్స రిటైల్‌లో పెట్టుబడులు
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.162936 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. రూ.5448 కోట్ల నికర లాభాలను కలిగి ఉంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 19, 2020, 6:57 PM IST