Home /News /business /

RELIANCE RETAIL VENTURES LIMITED ACQUIRES MAJORITY EQUITY STAKE IN CLOVIA NS

RRVL: క్లొవియాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) తాజాగా కీలక ప్రకటన చేసింది. పర్పుల్ పాండా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 89% ఈక్విటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.

    ప్రముఖ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) తాజాగా కీలక ప్రకటన చేసింది. పర్పుల్ పాండా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 89% ఈక్విటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా రూ.950 కోట్ల పెట్టుబడితో క్లోవియా (CLOVIA) వ్యాపారాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. 2013లో పంకజ్ వర్మనీ, నేహా కాంత్ & సుమన్ చౌదరి ద్వారా క్లోవియా ప్రారంభించబడింది. ఇది ఇండియాలో లీడింగ్ D2C బ్రాండ్. మహిళలకు ఇన్నర్వేర్, లాంగర్వేర్ లను ఇది అందిస్తోంది. తన ఉత్తమ క్వాలిటీతో అత్యధిక కస్టమర్లను కలిగి ఉంది ఈ సంస్థ. క్లోవియా 3500లకు పైగా ప్రొడక్ట్ స్టైల్స్ ఉత్పత్తులను కలిగి ఉండడం విశేషం. క్లోవియా ట్రెండింగ్ డిజైన్‌లు మరియు వినూత్న శైలులను అందించడానికి బలమైన ఇన్‌హౌస్ డిజైన్ ప్రక్రియను కలిగి ఉంది. అయితే, ఇది asset-light అవుట్సోర్స్ ఉత్పత్తి నమూనా.

    రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ పెట్టుబడులపై మాట్లాడుతూ.. రిలయన్స్ ఎల్లప్పుడూ ఎంపికలను మెరుగుపరచడంలో మరియు ఉత్తమంగా అందించడంలో ముందంజలో ఉందన్నారు. బలమైన వారితో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నామన్నారు. వ్యాపారాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు క్లోవియాలోని మేనేజ్‌మెంట్ టీమ్ తో కలిసి పని చేస్తామన్నారు."

    పంకజ్ వర్మానీ, ఫౌండర్&సీఈఓ, క్లోవియా మాట్లాడుతూ.. తాము రిలయన్స్ రిటైల్ ఫ్యామిలీలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. రిలయన్స్ స్కేల్ ఎంటర్ ప్రైజ్ ద్వారా తాము లబ్ధిపొందుతామన్నారు. వరల్డ్ క్లాస్ క్వాలిటీని అందిస్తామన్నారు. క్లోవియాను మోస్ట్ లవ్డ్ బ్రాండ్ గా మారుస్తామన్నారు. ఈ కొనుగోలుతో, ఇన్నర్‌వేర్ విభాగంలో RRVL తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుంది. ఇప్పటికే Zivame మరియు Amante బ్రాండ్‌లను రిలయన్స్ కొనుగోలు చేసింది. BDA భాగస్వాములు క్లోవియాకు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా వ్యవహరించగా, శార్దూల్ అమర్‌చంద్ మంగళదాస్ న్యాయ సలహాదారుగా వ్యవహరించారు.

    రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL):
    RRVL అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. RRVL భారతదేశంలో అత్యంత విస్తృతమైన రీచ్‌తో అతిపెద్ద మరియు అత్యంత లాభదాయకమైన రిటైలర్. డెలాయిట్ యొక్క గ్లోబల్ పవర్స్‌లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైలర్లలో జాబితా చేయబడింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Reliance group, Reliance Industries

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు