news18-telugu
Updated: November 15, 2020, 11:56 AM IST
ఫ్రతీకాత్మకచిిత్రం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) ప్రముఖ హోం డెకరేషన్ సొల్యూషన్స్ సంస్థ అయిన Urban Ladder Home Decor Solutions Private Ltd (Urban Ladder)లో 182.12 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం Urban Ladder ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో ఇది 96 శాతం హోల్డింగ్‌ను సూచిస్తుంది. అంతేకాదు మరో రూ .75 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ప్రతిపాదించింది. తదుపరి పెట్టుబడులు డిసెంబర్ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
UrbanLadder సంస్థను ఫిబ్రవరి 17, 2012 న ప్రారంభం కాగా, ఈ సంస్థ హోం ఫర్నిచర్, డెకార్ ఉత్పత్తుల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించే వ్యాపారంలో ఉంది. ఇది భారతదేశంలోని పలు నగరాల్లో రిటైల్ దుకాణాల చెయిన్ ను కలిగి ఉంది. అర్బన్ లాడర్ ఆడిట్ చేసిన టర్నోవర్ వరుసగా రూ .434 కోట్లు, రూ .151.22 కోట్లు, రూ .50.61 కోట్లు కాగా నికర లాభం /( నష్టం) రూ .49.41 కోట్లు, రూ .118.66 కోట్లు, రూ .457.97 కోట్లు గా ఉంది.
పైన పేర్కొన్న పెట్టుబడి డిజిటల్ రంగంలో సంస్థ కొత్త వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తృత పరిచేందుకు దోహదపడనుంది. అలాగే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ పెట్టుబడి సంస్థ ఎదుగుదలకు దోహదపడనుంది.
Published by:
Krishna Adithya
First published:
November 15, 2020, 11:56 AM IST