హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Retail: రిలయన్స్‌ రిటైల్‌లో సిల్వర్ లేక్ రూ.7500 కోట్ల పెట్టుబడులు

Reliance Retail: రిలయన్స్‌ రిటైల్‌లో సిల్వర్ లేక్ రూ.7500 కోట్ల పెట్టుబడులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జియోలో పెట్టుబడులు పెట్టిన సిల్వర్ లేక్ పార్ట్‌నర్ (SLP) తాజాగా రిలయన్స్ రిటైల్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. SLPకి 1.75 శాతం విక్రయించి రూ. 7500 కోట్ల నిధులను సమీకరించింది రిలయన్స్ రిటైల్.

  మొన్నటి వరకు జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల వరద పారింది. గూగుల్, ఫేస్‌బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, కేకేఆర్, ముబదాల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ క్యాటర్టాన్, పీఐఎఫ్ సంస్థలు జియోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌లోనూ పెట్టబడులకు ముందుకొస్తున్నాయి. జియోలో పెట్టుబడులు పెట్టిన సిల్వర్ లేక్ పార్ట్‌నర్ (SLP) తాజాగా రిలయన్స్ రిటైల్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. SLPకి 1.75 శాతం విక్రయించి రూ. 7500 కోట్ల నిధులను సమీకరించింది రిలయన్స్ రిటైల్. తద్వారా రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల విలువ రూ.4.21 లక్షల కోట్లకు చేరింది.

  సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్‌తో తమ వ్యాపార సంబంధాలు మరింత పెరగడం సంతోషంగా ఉందన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. రిటైల్ రంగంలోకి సాంకేతిక పరిజ్ఞానం ఎన్నోసంస్కరణలు తెచ్చిందన్న ఆయన.. ఇండియన్ రిటైల్‌లో తమ దార్శనికతను అమలు చేయడంలో సిల్వర్ లేక్ విలువైన పాత్ర పోషిస్తుందని అన్నారు.

  దేశవ్యాప్తంగా లక్షలాది చిన్న వర్తకులతో కలిసి భారతీయ వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. కాగా, గత నెలలో ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ రిటైల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.24,713 కోట్లు చెల్లించి ఫ్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో రిటైల్ అండ్ హోల్ సేల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌ (ఆర్ ఆర్ ఎఫ్ ఎల్ ఎల్)కు బదిలీ చేయనున్నట్లు తెలిపింది.


  ఇంతకు ముందు జియోలోనూ భారీగా పెట్టుబడులు పెట్టింది సిల్వర్ లేక్. మే, జూన్‌లో రెండు సార్లు వాటా కొనుగోలు చేసింది. మొత్తం 2 శాతం వాటా కొనుగోలుచేసి రూ.10,203 కోట్లను జియోలోకి పంప్ చేసింది. జియో గ్రూప్, రిలయన్స్ రిటైల్‌కి వచ్చిన పెట్టుబడులతో రిలయన్స్ విలువ రూ. 9 లక్షల కోట్లకు చేరింది. ఇంతకుముందు ట్విటర్, ఎయిర్‌బీఎన్‌బీ, డెల్, ఏఎన్‌టీ ఫైనాన్షియల్స్, ఆల్ఫాబెట్‌కు చెందిన వాయ్మో, వెరిలీ వంటి ప్రముఖ కంపెనీల్లో పెట్టబడులు పెట్టింది సిల్వర్ లేక్.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Reliance, Reliance Industries

  ఉత్తమ కథలు