హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Retail: భారత్ లోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త.. రిలయన్స్ రిటైల్ లో అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్

Reliance Retail: భారత్ లోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త.. రిలయన్స్ రిటైల్ లో అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలోనే అతి పెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ తాజాగా ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన Gap .తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

భారతదేశంలోనే అతి పెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ (Reliance Retail) లిమిటెడ్ తాజాగా ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన Gap .తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో అమెరికన్ ఐకానిక్ బ్రాండ్ (Gap Inc.) ఇండియాలోని ఫ్యాషన్ ప్రేమికులకు మరింత చేరువకానుంది. ఈ ఫ్రాంచైజీ అగ్రిమెంట్ ద్వారా Gapకు రిలయన్స్ రిటైల్ అధికారిక రిటైలర్ గా మారనుంది. దీంతో రిలయన్స్ రిటైల్ GAP కు చెందిన లేటెస్ట్ ఫాషన్స్ ను ఎప్పటికప్పుడు భారతదేశంలోని కస్టమర్లకు చేరువ చేయనుంది. ఈ భాగస్వామ్యం ప్రముఖ సాధారణ జీవనశైలి బ్రాండ్‌గా గ్యాప్ స్థానాన్ని మెరుగుపరుచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భాగస్వామ్యం ప్రముఖ సాధారణ జీవనశైలి బ్రాండ్‌గా గ్యాప్ స్థానాన్ని మెరుగుపరుచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో రిలయన్స్ రిటైల్ భారతదేశంలోని అన్ని ఛానళ్లలో గ్యాప్ ఉత్పత్తులకు అధికారిక రిటైలర్ గా మారనుంది.

ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్ లు, మల్టీ బ్రాండ్ స్టోర్ ఎక్స్ ప్రెషన్లు మరియు డిజిటల్ కామర్స్ ప్లాట్ ఫారమ్ ల మిష్రమం ద్వారా భారతీయ వినియోగదారులకు గ్యాప్ యొక్క సరికొత్త ఫ్యాషన్ ఆఫర్లను పరిచయం చేయనున్నట్లు రియలన్స్ రిటైల్ తెలిపింది. గ్యాప్ శాన్ ఫ్రాన్సిస్కోలో 1969లో స్థాపించబడింది.


ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఫ్యాషన్&లైఫ్ స్టైల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ.. రిలయన్స్ రిటైల్ తన కస్టమర్ల కోసం సరికొత్త మరియు ఉత్తమమైన ఎంపికలను అందించడంలో గర్వపడుతుందన్నారు.


మా ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ పోర్టిఫోలియోకు దిగ్గజ అమెరికన్ బ్రాండ్ అయిన గ్యాప్ ను జోడించడం పట్ల సంతోషిస్తున్నామన్నారు. గ్యాప్ గ్లోబల్ లైసెన్సింగ్ మరియు హోల్ సేల్ బిజినెస్ ఎండీ అడ్రియన్ గెర్నాండ్ మాట్లాడుతూ.. కీలకమైన అంతర్జాతీయ మర్కెట్లలో గ్యాప్ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రిలయన్స్ రిటైల్ వంటి భారతదేశంలోని ప్రాంతీయ నిపుణులతో భాగస్వామ్యం చేయడం వల్ల మనమే తమ ఉత్పత్తులను పంపిణీ చేసుకునే అవకాశం లభించిందన్నారు.

First published:

Tags: Reliance retail

ఉత్తమ కథలు