రిలయన్స్ రీటైల్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ పోర్ట్‌ఫోలియోలోని హై పర్ఫామెన్స్, టెక్నలాజికల్ యాక్టీవ్‌వేర్ బ్రాండ్ అయిన పర్ఫామ్యాక్స్ (Performax) బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ స్టార్, ఇండియన్ క్రికెట్ టీమ్ టాప్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) ఎంపిక చేశారు. పర్ఫామ్యాక్స్ స్వదేశంలో పెరిగిన బ్రాండ్ కావడం గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మొదటి ఇండియన్ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ కూడా. జస్‌ప్రీత్ బుమ్రాకు, పర్ఫామ్యాక్స్ బ్రాండ్‌తు అంకితభావం, ఎక్సలెన్స్, అథ్లెటిజమ్ విలువలున్నాయి. ఈ బ్రాండ్‌కు భారతదేశానికి చెందిన లీడ్ పేసర్ సరైన ఎంపిక.
జస్‌ప్రీత్ బుమ్రాతో మా అనుబంధాన్ని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. జస్‌ప్రీత్ చాలా సంవత్సరాలుగా భారతదేశం యొక్క పేసర్‌గా స్థిరమైన ప్రదర్శన చూపిస్తున్నాడు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన మొదటి భారతీయ స్పోర్ట్స్ బ్రాండ్ పర్ఫామ్యాక్స్‌ను కూడా అలాగే నిర్మించాలని మేము కోరుకుంటున్నాము. పర్ఫామ్యాక్స్‌ను మా కస్టమర్‌ల కోసం యాక్టీవ్‌వేర్ బ్రాండ్‌గా మార్చడానికి చేపట్టబోయే కార్యక్రమాల్లో ఈ అసోసియేషన్ మొదటిది.
అఖిలేషన్ ప్రసాద్, సీఈఓ, రిలయన్స్ రీటైల్ - ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్
LIC Policy: ఇది కోటి రూపాయల ఎల్ఐసీ పాలసీ... ప్రీమియం, బెనిఫిట్స్ వివరాలివే
ఇప్పటి వినియోగదారులతో జస్‌ప్రీత్ బుమ్రా సంబంధాని పెంచడంతో పాటు, రిలయన్స్ రిటైల్ ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్‌లెట్‌ల ద్వారా బ్రాండ్ ఉనికిని విస్తరిస్తోంది. రిలయన్స్ రిటైల్‌కు చెందిన ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ స్టోర్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో మల్టీ-బ్రాండ్ అవుట్‌లెట్‌లలో ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ చూడొచ్చు.
ఇండియన్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాను పర్ఫామ్యాక్స్ యాక్టీవ్‌వేర్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది రిలయన్స్ రీటైల్.#performax #JaspritBumrah #Ajio #Reliance pic.twitter.com/ZxdXeeV4VY
— News18 Telugu (@News18Telugu) September 2, 2022
ఒక అథ్లెట్‌గా, నేను సరైన ఫిట్‌గా ఉపయోగించే గేర్ చాలా ప్రత్యేకంగా కోరుకుంటాను. అనివార్యంగా నా ఆటను మెరుగుపర్చడంలో ఇది సాయపడుతుంది. పర్ఫామ్యాక్స్ హై పెర్ఫార్మెన్స్ టెక్నాలజీ యాక్టివ్ వేర్ విభాగంలో అద్భుతమైన లైనప్ కలిగి ఉంది. భవిష్యత్ భారతీయ అథ్లెట్లకు ఇది సరైన భాగస్వామి. మ్యాగ్జిమమ్ పర్ఫామెన్స్ అని నేను తరచూ చెప్పే పర్సనల్ మంత్రాను ఈ బ్రాండ్‌తో అనుబంధించడం చాలా ఉత్సాహంగా ఉంది.
జస్‌ప్రీత్ బుమ్రా, భారతీయ క్రికెటర్, పర్ఫామ్యాక్స్ బ్రాండ్ అంబాసిడర్
Post Office Scheme: ఓ పదేళ్లు ఇలా పొదుపు చేస్తే రూ.16.26 లక్షలు మీవే
రిలయన్స్ రీటైల్ సొంత బ్రాండ్ అయిన పర్ఫామ్యాక్స్ యాక్టీవ్‌వేర్ ప్రొడక్ట్స్ అందించడంలో ప్రత్యేక సాధించింది. ఫుట్‌వేర్, దుస్తులు, యాక్సెసరీస్ లాంటి కేటగిరీల్లో అనేక ప్రొడక్ట్స్ రూపొందించింది. ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ 330 పైగా పట్టణాల్లో 1000 పైగా స్టోర్లల్లో అందుబాటులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jasprit Bumrah, Reliance retail