భారతదేశంలో అతిపెద్ద రీటైలర్ అయిన రిలయన్స్ రీటైల్ (Reliance Retail) ప్రీమియం ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ అయిన అజార్ట్ స్టోర్‌ను (AZORTE Store) హైదరాబాద్‌లోని కొంపల్లిలో ప్రారంభించింది. భారతదేశంలో ఇది నాలుగో AZORTE స్టోర్ కాగా, హైదరాబాద్‌లో రెండోది. సరికొత్త అంతర్జాతీయ ఫ్యాషన్‌ను, టెక్-ఎనేబుల్డ్ కస్టమర్ జర్నీని అందిస్తోంది ఈ స్టోర్. కొంపల్లిలోని సుచిత్ర జంక్షన్ సమీపంలో జైన్ ఫ్రెండ్స్ స్క్వేర్‌లో AZORTE స్టోర్ ఏర్పాటు చేసింది రిలయన్స్ రీటైల్. 23,000 చదరపు అడుగుల రిటైల్ స్థలంలో విస్తరించిన AZORTE స్టోర్, వినియోగదారులందరికీ సేవలు అందించనుంది. అన్ని వర్గాల వినియోగదారులకు మల్టీ ఫార్మాట్ పద్ధతిలో సేవల్ని అందించడంలో రిలయన్స్ రిటైల్ తన నిబద్ధతను బలోపేతం చేస్తుంది.
అంతర్జాతీయ, సమకాలీన భారతీయ ఫ్యాషన్ కోసం హైదరాబాద్ ప్రజలు షాపింగ్ చేసే విధానాన్ని AZORTE స్టోర్ పూర్తిగా మార్చేయనుంది. సహజమైన రిటైల్ టెక్నాలజీతో స్మార్ట్ AZORTE స్టోర్‌లు అత్యుత్తమ ప్రపంచ, దేశీయ ఫ్యాషన్ ట్రెండ్‌లను ప్రదర్శిస్తాయి. పాదరక్షలు, ఫ్యాషన్ ఉపకరణాలు, మరెన్నో ప్రొడక్ట్స్‌ని అసలైన శైలితో అందిస్తాయి. కస్టమర్లను AZORTE స్టోర్ డిజైన్ ఆకట్టుకోవడం ఖాయం. డిస్కవరీ-టు-చెక్అవుట్ వరకు ఎక్కడ కూడా అంతరాయం లేని ప్రయాణాన్ని అందిస్తుంది. AZORTE స్టోర్ ఫార్మాట్‌లో మొబైల్ చెక్‌అవుట్, స్మార్ట్ ట్రయల్ రూమ్‌లు, ఫ్యాషన్ డిస్కవరీ స్టేషన్స్, సెల్ఫ్-చెకౌట్ కియోస్క్ లాంటి ఇండస్ట్రీలో మొట్టమొదటి టెక్ ఎనేబుల్స్ సొల్యూషన్స్ ఉండటం విశేషం.
IRCTC Ambedkar Yatra: అంబేద్కర్ యాత్ర ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... రూట్, ఛార్జీల వివరాలివే
RFID కలిగిన ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు స్టోర్‌లలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు, వర్చువల్ స్టైలింగ్ అసిస్టెంట్‌ల కన్నా రెట్టింపు సేవలు పొందొచ్చు. స్మార్ట్ ఫిట్టింగ్ రూమ్‌లు షాపర్స్ లుక్‌ని పూర్తి చేయడంలో సహాయపడతాయి. అదనపు సైజ్‌లు, ఇతర ఉత్పత్తుల కోసం బటన్‌ను నొక్కి రిక్వెస్ట్ చేయొచ్చు. అదనంగా, కస్టమర్‌లు మనుషులతో కూడిన కౌంటర్ల దగ్గర, క్యూలో నిలబడే బదులు స్వయంగా చెకౌట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
LIC Policy: ఈ ఎల్ఐసీ పాలసీతో రూ.50 లక్షల రిటర్న్స్
స్మార్ట్ స్టోర్‌లు టెక్-ఎయిడెడ్ సొల్యూషన్‌ల ద్వారా ఉన్నతమైన కస్టమర్ అనుభవాన్ని అందజేస్తాయి. కస్టమర్లు ఇన్-స్టోర్ ఫ్యాషన్ కన్సల్టెంట్‌ల రూపంలో సేవలు పొందొచ్చు. ఇక హైదరాబాద్‌లోని మొదటి AZORTE స్టోర్ కొండాపూర్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ప్రారంభమైంది. రాబోయే నెలల్లో కీలక మార్కెట్లలో స్టోర్ ఉనికిని పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఆన్‌లైన్ స్టోర్ ద్వారా AZORTE ప్రపంచాన్ని చూడటానికి azorte.ajio.com వెబ్‌సైట్ ఫాలో అవండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fashion, Hyderabad, Reliance, Reliance retail