హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Retail-Mubadala Deal: రిలయన్స్‌ రిటైల్‌లో ముబదాలా భారీ పెట్టుబడి

Reliance Retail-Mubadala Deal: రిలయన్స్‌ రిటైల్‌లో ముబదాలా భారీ పెట్టుబడి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Reliance Retail Deals: రిలయన్స్ రిటైల్‌కు దేశంలో 12,000 స్టోర్లు ఉండగా, 64 కోట్ల మంది రిలయన్స్ రిటైల్ సేవలు పొందుతున్నారు.

Investments in Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో (Reliance Retail Ventures Limited) పెట్టుబడుల వరద కొనసాగుతోంది. అబు దాబి ప్రభుత్వ పెట్టుబడిదారు అయిన ముబదాలా (Mubadala Investment Company) సంస్థ రూ.6247.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అందుకు ప్రతిగా రిలయన్స్ రిటైల్‌లో 1.4 శాతం వాటాను దక్కించుకోనుంది. మూడు వారాల వ్యవధిలో రిలయన్స్ రిటైల్‌లో ఇది ఐదో పెట్టుబడి. సిల్వర్ లేక్ (Silver lake partners), జనరల్ అట్లాంటిక్ (General Atlantic), కేకేఆర్ (KKR & Co) లాంటి ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి సంస్థలు రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేశాయి. తాజా పెట్టుబడితో కలిపి రిలయన్స్ రిటైల్ ప్రీ మనీ ఈక్విటీ వాల్యూ రూ.4.285 లక్షల కోట్లకు చేరిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో ముబదాలా సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కే చెందిన జియో ప్లాట్ ఫామ్స్‌లో (Jio Platforms) రూ.9093 కోట్లు పెట్టుబడి పెట్టింది. అబు దాబి ఇన్వెస్ట్‌మెంట్ అధారిటీ తర్వాత ఆ దేశంలో ముబదాలా అనేది రెండో అతిపెద్ద ప్రభుత్వ పెట్టుబడిదారు. ఆ సంస్థకు సుమారు 50 రకాల వ్యాపారాలు, 50 దేశాల్లో పెట్టుబడులు ఉన్నాయి.

వ్యాపారానికి విలువను జోడించే, ఆర్థిక వ్యవస్థను పురోగమింపజేసే, సామాజిక ప్రభావం చూపించే సంస్థల్లో ముబదాలా పెట్టుబడులు పెడుతుంది. పలు భిన్న రంగాల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టింది. వాటిలో ఏరో స్పేస్, వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, మెటల్స్ - మైనింగ్, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ, పునరుద్పాదక ఇంధనం, రిటైల్, వంటి విభన్న రంగాల్లో ముబదాలా పెట్టుబడులు ఉన్నాయి.

సెప్టెంబర్ 30వ తేదీన అమెరికాకు చెందిన సిల్వర్ లేక్  సహ పెట్టుబడిదారులు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో రూ. 1,875 కోట్ల పెట్టుడి పెట్టారు. దీంతో కలిపి రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ సంస్థ మొత్తం పెట్టుబడి రూ.9,375 కోట్లకు పెరిగింది. అందుకు ప్రతిగా రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ సంస్థ 2.13 శాతం వాటాను పొందనుంది. మరోవైపు అమెరికాకు చెందిన కేకేఆర్ అండ్ కంపెనీ రిలయన్స్ రిటైల్‌లో రూ.5550 కోట్లు పెట్టుబడి పెట్టింది. అలాగే, మరో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ సంస్థ రూ. 3,675 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.

రిలయన్స్ రిటైల్ దేశంలో అతిపెద్ద, అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న, లాభదాయకమైన రిటైల్ బిజినెస్. దేశంలో 12,000 స్టోర్లు ఉండగా, 64 కోట్ల మంది రిలయన్స్ రిటైల్ సేవలు పొందుతున్నారు. ఇక ఆగస్టు నెలలో ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ రిటైల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.24,713 కోట్లు చెల్లించి ఫ్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో రిటైల్ అండ్ హోల్ సేల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌ (RRFLL)కు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. భారత్‌లో వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు దీటుగా రిటైల్ వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తోంది.

First published:

Tags: Reliance Industries, Reliance JioMart

ఉత్తమ కథలు