హోమ్ /వార్తలు /బిజినెస్ /

JioMart: అలర్ట్... జియోమార్ట్ ఫ్రాంఛైజ్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్

JioMart: అలర్ట్... జియోమార్ట్ ఫ్రాంఛైజ్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్

JioMart: అలర్ట్... జియోమార్ట్ ఫ్రాంఛైజ్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్

JioMart: అలర్ట్... జియోమార్ట్ ఫ్రాంఛైజ్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్

JioMart | జియోమార్ట్ ఫ్రాంఛైజ్ కోసం ప్రయత్నిస్తున్నవారికి అలర్ట్. రిలయెన్స్ రీటైల్ ఇంకా డీలర్‌షిప్, ఫ్రాంఛైజ్ కార్యకలాపాలను మొదలుపెట్టలేదు. నకిలీ వెబ్‌సైట్స్ నమ్మొద్దని హెచ్చరిస్తోంది రిలయెన్స్ రీటైల్.

  జియోమార్ట్ ఫ్రాంచైజ్ ఇస్తామని ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? ఫ్రాంఛైజ్ కోసం డబ్బులు చెల్లించమని అడిగారా? ఏదైనా వెబ్‌సైట్‌లో జియోమార్ట్ ఫ్రాంఛైజ్ కోసం మీ వివరాలు ఇచ్చారా? అయితే జాగ్రత్త అని హెచ్చరిస్తోంది రిలయెన్స్ రీటైల్ లిమిటెడ్. నకిలీ వెబ్‌సైట్స్‌ని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తోంది. రిలయెన్స్ రీటైల్ లిమిటెడ్ కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్ గ్రాసరీ సర్వీస్‌ను జియోమార్ట్ పేరుతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. www.jiomart.com వెబ్‌సైట్‌తో పాటు జియోమార్ట్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో లాంఛ్ చేసింది. కేవలం ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే రిలయెన్స్ రీటైల్ ఆన్‌లైన్ గ్రాసరీ ఆర్డర్స్ తీసుకుంటోంది. అంతే తప్ప జియోమార్ట్ పేరుతో ఇతర వెబ్‌సైట్స్ లేవు. అంతేకాదు... రిలయెన్స్ రీటైల్ ఎవరికీ ఫ్రాంఛైజ్‌లు కూడా ఇవ్వట్లేదు. కానీ ఇంటర్నెట్‌లో జియోమార్ట్ ఫ్రాంజైజ్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ ఉన్నాయని రిలయెన్స్ రీటైల్ దృష్టికి వచ్చింది. దీంతో రిలయెన్స్ రీటైల్ అప్రమత్తమవడమే కాకుండా కస్టమర్లను, వ్యాపారులను అలర్ట్ చేస్తోంది.

  జియోమార్ట్ డీలర్‌షిప్, ఫ్రాంఛైజ్ మోడల్ లాంటి సేవల్ని ప్రారంభించలేదని రిలయెన్స్ రీటైల్ క్లారిటీ ఇచ్చింది. డీలర్‌షిప్, ఫ్రాంఛైజీల కోసం ఎవర్నీ నియమించలేదని స్పష్టం చేసింది. ఫ్రాంఛైజీల పేరుతో డబ్బులు వసూలు చేయలేదని తెలిపింది. ఇంటర్నెట్‌లో జియోమార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ రూపొందించి, రిలయెన్స్ రీటైల్‌తో సంబంధం ఉన్న వ్యక్తులుగా నమ్మిస్తున్నారని, జియోమార్ట్ ఫ్రాంఛైంజీలు ఇస్తామని మోసాలకు పాల్పడుతున్నారని రిలయెన్స్ రీటైల్ హెచ్చరించింది. రిలయెన్స్ రీటైల్ దృష్టికి వచ్చిన నకిలీ వెబ్‌సైట్స్ ఇవే.

  1. jmartfranchise.in

  2. jiodealership.com

  3. jiomartfranchises.com

  4. jiomartshop.info

  5. jiomartreliance.com

  6. jiomartfranchiseonline.com

  7. jiomartsfranchises.online

  8. jiomart-franchise.com

  9. jiomartindia.in.net

  10. jiomartfranchise.co

  సాధారణ ప్రజలు, తయారీదారులు, వ్యాపారులు, డీలర్లు ఈ ఆన్‌లైన్ మోసాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. జియోమార్ట్ ఫ్రాంఛైజ్ తీసుకుందామన్న ఆలోచనతో మోసగాళ్ల బారిన పడకూడదు. జియోమార్ట్ ఫ్రాంఛైజ్ కోసం ఈ వెబ్‌సైట్లలో కానీ, ఇతరులతో కానీ జరిపే లావాదేవీలు, కార్యకలాపాలకు రిలయెన్స్ రీటైల్ ఎలాంటి బాధ్యత వహించదన్న విషయం గుర్తుంచుకోవాలి. రిలయెన్స్ రీటైల్‌కు చెందిన ట్రేడ్ మార్క్స్, పేర్లను వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నవారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడమని రిలయెన్స్ రీటైల్ చెబుతోంది. జియోమార్ట్ ఫ్రాంఛైజ్ పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, డబ్బులు అడిగినా రిలయెన్స్ రీటైల్‌కు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేయాల్సిన అడ్రస్ ఇదే.

  IP Legal,

  Reliance Retail Limited

  Building 30, C wing, CA 05, Reliance Corporate Park,

  Thane Belapur Road, Ghansoli, Navi Mumbai 400701

  Email: IP.legal@ril.com

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Jio, JioMart, Reliance, Reliance Industries, Reliance Jio, Reliance JioMart

  ఉత్తమ కథలు