Home /News /business /

RELIANCE RETAIL LEADS 240 MILLION ROUND IN DUNZO AMID RAPID DELIVERY FRENZY GH VB

Reliance Retail: ఆ స్టార్డప్ లో రిలయన్స్ రిటైల్ భారీ పెట్టుబడులు.. సుమారు రూ.1500 కోట్లతో..

రిలయన్స్ మార్ట్(ఫైల్)

రిలయన్స్ మార్ట్(ఫైల్)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) మరో భారీ ఒప్పందంతో వార్తల్లో నిలుస్తోంది. ఆన్-డిమాండ్ డెలివరీ స్టార్టప్ డున్జో(Dunzo)లో రిలయన్స్ రిటైల్ 25.8 శాతం వాటా దక్కించుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industry) అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) మరో భారీ ఒప్పందంతో వార్తల్లో నిలుస్తోంది. ఆన్-డిమాండ్ డెలివరీ స్టార్టప్ డున్జో(Dunzo)లో రిలయన్స్ రిటైల్ 25.8 శాతం వాటా దక్కించుకుంది. ఇందుకు ఏకంగా సంస్థ $240 మిలియన్ల (సుమారు రూ.1500 కోట్లు) వరకు వెచ్చించింది. డున్జో బెంగళూరు(Bengalore) కేంద్రంగా పనిచేస్తోంది. ఈ స్టార్టప్‌ను 2016లో కబీర్ బిస్వాస్‌(Kabir Biswami) స్థాపించారు. తాజా 240 మిలియన్ డాలర్ల(Millin Dollars) ఒప్పదం.. ఇన్నేళ్లలో డున్జో సేకరించిన మొత్తం ($140 మిలియన్లు) కంటే చాలా ఎక్కువ. ఈ ఒప్పందంతో బ్లింకిట్ (Blinkit- గతంలో గ్రోఫర్స్), జెప్టో, బిగ్ బాస్కెట్ వంటి గ్రాసరీ డెలివరీ సంస్థలకు డున్జో గట్టి పోటీ ఇవ్వనుంది.

Good News: గుడ్ న్యూస్ చెప్పిన బీమా కంపెనీలు.. ఇక ఆ చికిత్స పూర్తిగా ఉచితం అంటూ..


రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL)- డున్జో $240 మిలియన్ల ఒప్పదం గురించి రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. డున్జోలో ప్రధాన వాటాదారులుగా ఉన్న లైట్‌బాక్స్, లైట్‌త్రాక్, 3ఎల్ క్యాపిటల్, ఆల్టెరియా క్యాపిటల్ సంస్థలు కూడా ఫండింగ్ రౌండ్‌లో పాల్గొన్నాయి. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో రిలయన్స్ రిటైల్ డున్జోలో 25.8 శాతం వాటాను పొందుతుందని ప్రకటన పేర్కొంది.

డున్జోకు మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఎక్స్‌క్లూజివ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా, సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ సంస్థ న్యాయ సలహాదారుగా వ్యవహరించాయి. AZB & పార్ట్నర్స్ సంస్థ రిలయన్స్ రిటైల్‌కు లీగల్ కౌన్సెల్‌గా వ్యవహరించింది. డెలాయిట్, హాస్కిన్స్ & సెల్స్ LLP సంస్థలు ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా సేవలు అందించాయి.

Multibagger Stocks: 2022లో ఈ రెండు స్టాక్స్‌తో అధిక రాబడులు.. షేర్ ఇండియా నిపుణుల జోస్యం..


ఈ విషయంపై రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. ‘డున్జోతో తాజా పార్ట్నర్‌షిప్ ద్వారా రిలయన్స్ రిటైల్ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించగలుగుతాం. రిలయన్స్ రిటైల్ స్టోర్స్ నుంచి ప్రొడక్ట్స్‌ను కస్టమర్లకు వేగంగా డెలివరీ చేయగలమని భావిస్తున్నాం. మా మర్చంట్స్ కూడా డున్జో హైపర్‌లోకల్ డెలివరీ నెట్‌వర్క్‌కు యాక్సెస్ పొందుతారు. జియో మార్ట్ (Jio Mart) ద్వారా వారు తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌కు మార్చుకునేందుకు సైతం డున్జో డెలివరీ నెట్‌వర్క్ తోడ్పడుతుంది’ అని చెప్పారు.

Scholarships: ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం యూజీసీ నాలుగు కొత్త స్కాలర్​షిప్స్​.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే..


డున్జో కో-ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కబీర్ బిస్వాస్ మాట్లాడుతూ.. ‘రిలయన్స్ రిటైల్ నుంచి సమీకరించిన ఈ పెట్టుబడితో మేము లాంగ్-టర్మ్ పార్ట్నర్‌షిప్ పొందాం. కొత్త పార్ట్నర్‌తో కలిసి వ్యాపారాన్ని, సేవల వృద్ధిని వేగవంతం చేయవచ్చు’ అని చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలో Dunzo కొత్తగా ఇన్‌స్టంట్ డెలివరీ మోడల్ అయిన 'Dunzo Daily' సేవలను బెంగళూరులో ప్రారంభించింది. ఈ డైలీ మోడల్ ద్వారా రోజువారీగా, వారం వారీగా నిత్యావసరాలను 15-20 నిమిషాల్లో డెలివరీ చేయాలని డున్జో లక్ష్యంగా పెట్టుకుంది.
Published by:Veera Babu
First published:

Tags: Dunzo, Reliance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు