హోమ్ /వార్తలు /బిజినెస్ /

AZORTE: ప్రీమియం ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ స్టోర్ లాంఛ్ చేసిన రిలయన్స్ రీటైల్

AZORTE: ప్రీమియం ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ స్టోర్ లాంఛ్ చేసిన రిలయన్స్ రీటైల్

AZORTE: ప్రీమియం ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ స్టోర్ లాంఛ్ చేసిన రిలయన్స్ రీటైల్

AZORTE: ప్రీమియం ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ స్టోర్ లాంఛ్ చేసిన రిలయన్స్ రీటైల్

రిలయన్స్ రీటైల్ మొదటి ప్రీమియం ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ స్టోర్ AZORTE బెంగళూరులో ప్రారంభమైంది. ఇతర నగరాల్లో కూడా త్వరలో మరిన్ని స్టోర్స్ ప్రారంభం కానున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ రీటైల్ (Reliance Retail) ప్రీమియం ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ స్టోర్ బ్రాండ్‌ను AZORTE పేరుతో లాంఛ్ చేసింది. ప్రీమియం ఇంటర్నేషనల్, సమకాలీన భారతీయ ఫ్యాషన్ వస్తువుల కోసం భారతీయులు షాపింగ్ చేసే విధానాన్ని మార్చడానికి ఈ స్టోర్ ఏర్పాటైంది. AZORTE స్టోర్‌లో అత్యుత్తమ గ్లోబల్ ట్రెండ్‌లతో పాటు, సమకాలీన భారతీయ ఫ్యాషన్ దుస్తులు (Fashion Wear), వస్తువులు ఉంటాయి. పాశ్చాత్య, భారతీయ దుస్తుల నుంచి పాదరక్షలు, ఫ్యాషన్ ఉపకరణాలు, హోమ్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఒరిజినల్ స్టైల్‌వి ఉంటాయి. ఫ్యాషన్-ఫార్వర్డ్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. కొత్త స్టోర్ ఫార్మాట్‌లో స్మార్ట్ ట్రయల్ రూమ్స్, ఫ్యాషన్ డిస్కవరీ స్టేషన్స్, సెల్ఫ్ చెకౌట్ కియాస్క్స్ లాంటి అనేక టెక్-ఎనేబుల్ సౌకర్యాలు ఉంటాయి. వీటితో షాపింగ్ మరింత ఎంజాయ్ చేయొచ్చు.

"మిలీనియల్స్, Gen-Z ఎక్కువగా అంతర్జాతీయ, సమకాలీన భారతీయ ఫ్యాషన్‌ను కోరుకుంటున్నారు కాబట్టి మిడ్‌ప్రీమియం ఫ్యాషన్ సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల విభాగాలలో ఒకటి. వారికి AZORTE కొత్త భారతదేశంలోని ఫ్యాషన్ ఫార్వర్డ్ కస్టమర్ల కోసం వార్డ్‌రోబ్‌లల్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఫ్యాషన్ అందిస్తుంది. స్టోర్‌లో బెస్ట్ ఇన్ క్లాస్ టెక్ సదుపాయాలు అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని అందిస్తాయి."

అఖిలేషన్ ప్రసాద్, సీఈఓ, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్, రిలయన్స్ రీటైల్

IRCTC Rules: మీ రైలు టికెట్‌ను ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు... రూల్స్ ఇవే

AZORTE store, AZORTE Bangalore, AZORTE fashion store, Reliance Retail, Reliance Retail stores, రిలయన్స్ రీటైల్ స్టోర్, రిలయన్స్ రీటైల్, రిలయన్స్ ఫ్యాషన్ స్టోర్, రిలయన్స్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్

రిలయన్స్ రీటైల్ మొదటి AZORTE స్టోర్ బెంగళూరులో ప్రారంభమైంది. బెంగళూరులోని ఎంజీరోడ్‌లో ఉన్న 1 ఎంజీ లీడో మాల్‌లో ఈ స్టోర్ ఏర్పాటైంది. ఈ స్టోర్ విస్తీర్ణం 18,000 స్క్వేర్ ఫీట్లు. రాబోయే నెలల్లో కీలక మార్కెట్లలో స్టోర్లను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. AZORTE స్టోర్ ఎలా ఉందో azorte.ajio.com వెబ్‌సైట్‌లో కూడా చూడొచ్చు.

"ఆన్-ట్రెండ్ స్టైల్స్, క్లాసిక్స్‌తో ఆవిష్కరించబడిన హై-స్ట్రీట్ ఫ్యాషన్‌ను అందించే భారతదేశపు మొట్టమొదటి ఫ్యాషన్ నియోస్టోర్ AZORTE. కొనుగోలుదారులు AZORTE స్టోర్ ద్వారా ఫ్యూచర్ ప్రూఫ్ వార్డ్‌రోబ్‌ రూపొందించుకోవచ్చు. ఉత్తమమైన పాశ్చాత్య దుస్తులు, భారతీయ దుస్తులు, పిల్లల దుస్తులు, పాదరక్షలు, ఫ్యాషన్ ఉపకరణాలు, హోమ్, బ్యూటీ లాంటి విభాగాల్లో ప్రామాణికమైన స్టైల్ ఎంచుకోవచ్చు.

రాకేష్ జల్లిపల్లి, వీపీ, బిజినెస్ హెడ్, AZORTE

LIC Pension Plan: సింగిల్ ప్రీమియం... ఏటా రూ.50,000 పెన్షన్ ... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

AZORTE store, AZORTE Bangalore, AZORTE fashion store, Reliance Retail, Reliance Retail stores, రిలయన్స్ రీటైల్ స్టోర్, రిలయన్స్ రీటైల్, రిలయన్స్ ఫ్యాషన్ స్టోర్, రిలయన్స్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్

పలు రకాల బ్రాండ్స్‌కు చెందిన దుస్తులతో AZORTE రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ పోర్టిఫోలియోలో చేరింది. అన్ని కన్స్యూమర్ సెగ్మెంట్లను ఆకట్టుకోవడానికి మల్టీ ఫార్మాట్ విధానాన్ని అవలంబించింది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Reliance retail

ఉత్తమ కథలు