హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Centro: రిలయన్స్ కొత్త సర్వీసులు.. తొలి స్టోర్ ప్రారంభం! కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్లు!

Reliance Centro: రిలయన్స్ కొత్త సర్వీసులు.. తొలి స్టోర్ ప్రారంభం! కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్లు!

రిలయన్స్ రిటైల్ కొత్త సర్వీసులు.. తొలి స్టోర్ ప్రారంభం! కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్లు!

రిలయన్స్ రిటైల్ కొత్త సర్వీసులు.. తొలి స్టోర్ ప్రారంభం! కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్లు!

Reliance Retail | రిలయన్స్ రిటైల్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. తన తొలి ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ స్టోర్‌ను ప్రారంభించింది. రిలయన్స్ రిటైల్ ఈ కొత్త సేవలను రిలయన్స్ సెంట్రో పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Reliance Centro Store | దేశంలోని అతిపెద్ద రిటైలర్ రిలయన్స్ రిటైల్ (Reliance Retail) తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌ను ఆవిష్కరించింది. రిలయన్స్ సెంట్రో (Reliance Centro) పేరుతో ఈ కొత్త సర్వీసులు లాంచ్ చేసింది. కంపెనీ తొలి రిలయన్స్ సెంట్రో స్టోర్‌ను ఢిల్లీలో ప్రారంభించింది. వసంత్ కుంజ్‌లో ఈ రిలయన్స్ సెంట్రో స్టోర్ ఏర్పాటు చేసింది.

  దేశంలో ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావడం లక్ష్యంగా రిలయన్స్ సెంట్రోను కంపెనీ ఆరంభించింది. తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటూ ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ కావాలని కంపెనీ భావిస్తోంది. అందుకే ఈ కొత్త సేవలను తీసుకువచ్చింది. రిలయన్స్ సెంట్రోలో అప్పరెల్స్, ఫుట్‌వేర్, కాస్మటిక్స్, స్పోర్ట్‌వేర్ దగ్గరి నుంచి లగేజ్, యాక్ససిరీస్ వల్ల దాదాపు 300కు పైగా దేశీ, అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించిన ప్రొడక్టులు అందుబాటులో ఉండనున్నాయి.

  ప్రభుత్వం దసరా కానుక.. 14 కోట్ల మంది అకౌంట్లలోకి డబ్బులు?

  మధ్యస్థం నుంచి ప్రీమియం విభాగపు కస్టమర్ల కోసం ఫ్యాషన్ అవసరాలకు సంబంధించిన అన్ని ప్రొడక్టులను ఒకే చోటు అందించడమే రిలయన్స్ సెంట్రో ముఖ్య లక్ష్యం. భిన్నమైన అభిరుచులు కలిగిన వారికి, అన్ని వయసులు వారికి అన్ని సీజన్లలోనూ రిలయన్స్ సెంట్రో ష్యాషన్ గమ్యస్థానంగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది.

  ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఏర్పాటైన రిలయన్స్ సెంట్రో స్టోర్ చూడటానికి చాలా మోడ్రన్‌గా ఉంది. నేటి తరం వినియోగదారుల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఇందులో అద్భుతమైన నాణ్యతతో కూడిన ఫ్యాషన్ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. అలాగే అనేక రకాల బ్రాండ్‌లు, వివిధ స్టైల్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. పార్టీల నుంచి పండుగలు, పెళ్లిళ్ల వరకు ప్రతి సందర్భానికి అనుగుణమైన ఫ్యాషన్ ప్రొడక్టులను ఈ కొత్త స్టోర్‌లో కొనుగోలు చేయొచ్చు. దీంతో రిలయన్స్ సెంట్రో అనేది అన్ని ఫ్యాషన్ అవసరాలకు గమ్య స్థానంగా ఉంటుంది.

  సామాన్యులకు భారీ ఊరట.. రూ.90కే వంట నూనె.. ధరలు ఇంకా తగ్గుతాయా?

  ఢిల్లీలోని కస్టమర్లు ఇప్పుడు రిలయన్స్ సెంట్రో ద్వారా ప్రత్యేకమైన, అద్భుతమైన షాపింగ్ అనుభూతి పొందొచ్చు. మహిళలు, పురుషులు, పిల్లలు వివిధ బ్రాండ్లకు చెందిన ట్రెండీ ప్రొడక్టులను కొనొచ్చు. 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ రిలయన్స్ సెంట్రో స్టోర్ పూర్తిగా డిపార్ట్‌మెంటల్ స్టోర్. ఇందులో 300కు పైగా బ్రాండ్లు, 20 వేలకు పైగా స్టైల్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

  అంతేకాకుండా కస్టమర్లకు స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. అమేజింగ్ ధరలకే షాపింగ్ పూర్తి చేసుకోవచ్చు. రూ. 3,999 విలువైన ప్రొడక్టులు కొనుగోలు చేస్తే రూ. 1500 తగ్గింపు పొందొచ్చు. లేదంటే రూ. 4,999 లేదా ఆపైన షాపింగ్ చేస్తే రూ. 2 వేల తగ్గింపు వస్తుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Reliance, Reliance Digital, Reliance group, Reliance retail

  ఉత్తమ కథలు