Reliance-Hamleys Deal: 259 ఏళ్ల బ్రిటీష్ టాయ్‌మేకర్ హామ్లేస్ కొనేందుకు రిలయెన్స్ రీటైల్ చర్చలు

Reliance Hamleys Deal | ప్రపంచవ్యాప్తంగా 11 బిలియన్ డాలర్ల టాయ్ ఇండస్ట్రీలో టార్గెట్, వాల్‌మార్ట్, అమెజాన్ లాంటి కంపెనీలకు ఇప్పటికీ గట్టి పోటీ ఇస్తోంది హామ్లేస్ సంస్థ. ఒకవేళ ఈ సంస్థను సొంతం చేసుకుంటే రిలయెన్స్ రీటైల్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తృతమవుతుంది.

news18-telugu
Updated: April 17, 2019, 1:47 PM IST
Reliance-Hamleys Deal: 259 ఏళ్ల బ్రిటీష్ టాయ్‌మేకర్ హామ్లేస్ కొనేందుకు రిలయెన్స్ రీటైల్ చర్చలు
259 ఏళ్ల బ్రిటీష్ టాయ్‌మేకర్ హామ్లేస్ కొనేందుకు రిలయెన్స్ రీటైల్ చర్చలు
  • Share this:
హామ్లేస్... బ్రిటన్‌లో ప్రముఖ టాయ్ మేకర్ సంస్థ. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి నుంచి ఉంది. 259 ఏళ్ల చరిత్ర గల బ్రాండ్‌ను సొంతం చేసుకునేందుకు రిలయెన్స్ రీటైల్ చర్చలు జరుపుతోందని మనీ కంట్రోల్ కథనం. లండన్‌లోని రెజెంట్ స్ట్రీట్‌లో ఫ్లాగ్‌షిప్‌ స్టోర్ ఉన్న హామ్లేస్‌ను ఒకవేళ రిలయెన్స్ సొంతం చేసుకుంటే అంతర్జాతీయంగా వృద్ధి చెందాలన్న ఆశయం ఇంకాస్త నెరవేరుతుంది. ప్రతీ దశాబ్దంలో 30 శాతం వృద్ధి చెందాలన్నది రిలయెన్స్ రీటైల్ లక్ష్యం. ఈ ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు పురోగతిలో ఉన్నాయని, ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు రిలయెన్స్ రీటైల్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆ సంస్థ వర్గాల సమాచారం.

హామ్లేస్ సంస్థ ప్రయాణం 1970లో లండన్‌లో ప్రారంభమైంది. సౌదీ అరేబియాకు చెందిన రాజ కుటుంబీకులు ఈ సంస్థ నమ్మకమైన కస్టమర్లుగా ఉన్నారు. ఇటీవల కాలంలో బ్రెగ్జిట్ కారణంగా హామ్లేస్ సంస్థ అస్థిరతను ఎదుర్కొంటోంది. 2017లో 12 మిలియన్ పౌండ్ల నష్టాలొచ్చాయి. వార్షిక ఆదాయం 2.5 శాతం పడిపోయి 66.3 మిలియన్ పౌండ్లకు చేరింది.


ప్రపంచవ్యాప్తంగా 11 బిలియన్ డాలర్ల టాయ్ ఇండస్ట్రీలో టార్గెట్, వాల్‌మార్ట్, అమెజాన్ లాంటి కంపెనీలకు ఇప్పటికీ గట్టి పోటీ ఇస్తోంది హామ్లేస్ సంస్థ. ఒకవేళ ఈ సంస్థను సొంతం చేసుకుంటే రిలయెన్స్ రీటైల్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తృతమవుతుంది.

మీడియాలో వచ్చే ఊహాగానాలు, పుకార్లపై స్పందించకూడదన్నది మా పాలసీ. ఎప్పట్లాగే వివిధ అవకాశాలను మా సంస్థ విశ్లేషిస్తోంది. మేము బాధ్యతగా ఎలాంటి అంశాలనైనా సెబీ నియమనిబంధనలు, స్టాక్ ఎక్స్‌ఛేంజీలతో ఉన్న ఒప్పందాలకు అనుగుణంగా బహిర్గతం చేస్తాం.మనీకంట్రోల్ ఇ-మెయిల్‌కు కంపెనీ అధికార ప్రతినిధి స్పందన


హామ్లేస్ సంస్థ ప్రమోటర్ అయిన సీ.బ్యానర్ ఇంటర్నేషనల్ కూడా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే రిలయెన్స్ రీటైల్‌కు హామ్లేస్ టాయ్స్ ఇండియా ఫ్రాంచైజ్ ఒప్పందం ఉంది. హామ్లేస్‌కు ప్రపంచవ్యాప్తంగా 129 స్టోర్లు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా యూకేలో ఉండగా, చైనా, జర్మనీ, రష్యా, ఇండియా, సౌతాఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల్లో స్టోర్లు ఉన్నాయి. ఈ ఒప్పందం పూర్తైతే హామ్లేస్ స్టోర్లను భారతదేశంలో విస్తరించేందుకు రిలయెన్స్ రీటైల్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 50 స్టోర్లు ఉన్నాయని, మూడేళ్లలో 200 స్టోర్లకు పెంచాలని చూస్తున్నట్టు ఈ డీల్ గురించి తెలిసిన వర్గాల సమాచారం.

మార్కెట్ రీసెర్చ్ సంస్థ IMARC నివేదిక ప్రకారం 2018లో భారతదేశంలో టాయ్ మార్కెట్ విలువ 1.5 బిలియన్ డాలర్లు. 2011 నుంచి 2018 మధ్య ఏటా 15.9 శాతం పెరుగుదల కనిపించింది. 2024 నాటికి 3.3 బిలియన్ డాలర్లను చేరొచ్చని IMARC భావిస్తోంది. ఇండియన్ టాయ్ మార్కెట్‌లో ఫన్‌స్కూల్, లీగో, మ్యాటెల్, హ్యాస్‌బ్రో లాంటి కంపెనీలు పోటీ పడుతున్నాయి. సీ.బ్యానర్ ఇంటర్నేషనల్ 2015లో 100 మిలియన్ యూకే పౌండ్లకు హామ్లేస్ సంస్థను సొంతం చేసుకుంది. ఒకవేళ రిలయెన్స్‌తో డీల్ కుదిరితే హామ్లేస్ సంస్థ చేతులు మారడం నాలుగోసారి అవుతుంది.
రిలయెన్స్ రీటైల్ సంస్థ డీజిల్, మార్క్స్ అండ్ స్పెన్సర్స్, స్టీవ్ మాడెన్, కెన్నెత్ కోల్ లాంటి అనేక ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.69,198 కోట్లు. 2018 డిసెంబర్‌ నాటికి రిలయెన్స్ రీటైల్ 6400 పైగా నగరాల్లో 9,907 స్టోర్లను నిర్వహిస్తోంది.

Photos: అమితాబ్ బచ్చన్ కొన్న కొత్త వాహనం ఇదే... ఫోటోలు చూడండి

ఇవి కూడా చదవండి:

SBI Quick Transfer: క్షణాల్లో ఎవరికైనా రూ.10,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు

SBI Account: కేవైసీ లేకపోయినా ఎస్‌బీఐలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా...

JIO 251 Plan: ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్
First published: April 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>