రిలయన్స్ రీటైల్ 'హ్యాండ్‌మేడ్ ఇన్ ఇండియా' (Handmade in India) ప్రోగ్రామ్ ప్రకటించింది. ప్రామాణికమైన హస్తకళా ఉత్పత్తులను (Handcrafted Products) ప్రదర్శించడం, గొప్ప భారతీయ కళారూపాలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం లక్ష్యంగా అనేక కొత్త కార్యక్రమాలను చేపట్టనుంది. వివిధ సాంప్రదాయ భారతీయ కళలు, కళాఖండాలను పునరుద్ధరించడానికి, వేలాది కళాకారులు, హస్తకళాకారులకు స్థిరమైన జీవనోపాధిని అందించడానికి, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు భారతీయ కళలను పరిచయం చేయడానికి ఈ కార్యక్రమాలను రూపొందిస్తోంది. రిలయన్స్ (Reliance) హస్తకళల బ్రాండ్ అయిన స్వదేశ్ (Swadesh) ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపించనుంది. ఇది దేశవ్యాప్తంగా చేతితో తయారు చేసిన ఉత్పత్తుల్ని అమ్మేందుకు కళాకారులకు మాత్రమే అంకితమైన స్టోర్‌ను అందిస్తుంది.
మొదటి స్వదేశ్ స్టోర్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కానుంది. చేతితో తయారు చేసిన వస్త్రాలు, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, చేతివృత్తుల వారి నుంచి నేరుగా సేకరించబడిన వస్తువులు, ఉత్పత్తులు ఇందులో ఉంటాయి. భారతీయ చేతివృత్తులవారిని, సెల్లర్లను ఒకే ప్లాట్‌ఫామ్ పైకి చేర్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు స్వదేశ్ బ్రాండ్‌తో ఈ కళాఖండాలను అందించనుంది రిలయన్స్ రీటైల్.
LIC Policy: ఈ పాలసీతో ప్రీమియం తక్కువ... బెనిఫిట్స్ ఎక్కువ
భారతదేశానికి చెందిన గొప్ప కళలు, హస్తకళలు, చేనేత కళారూపాలను ప్రపంచానికి అందించాలని స్వదేశ్ లక్ష్యంగా పెట్టుకుంది. నైపుణ్యం పెంచడం, డిజైన్ శిక్షణలు ఇవ్వడం కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించనుంది. తద్వారా చేతివృత్తుల వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడం స్వదేశ్ లక్ష్యం.
EPFO Alert: ఈపీఎఫ్ఓ నుంచి త్వరలో గుడ్ న్యూస్... ఆ లిమిట్ పెంచనున్న బోర్డు
స్వదేశ్ వివిధ ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికే కళాకారుల నుంచి 100 శాతం ప్రామాణికమైన ఉత్పత్తులను సేకరించడానికి టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖతో ఒక ఎంఓయూపై సంతకం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలోని MSME & టెక్స్‌టైల్స్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక ఆరోగ్యకరమైన, చైతన్యవంతమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం.
వివిధ రాష్ట్రాల్లో RiSE కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా చేతివృత్తుల వారి వారసత్వాన్ని ప్రోత్సహించడానికి స్వదేశ్ రిలయన్స్ ఫౌండేషన్‌తో జతకట్టింది. ఈ కేంద్రాలు ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్, చేనేత, హస్తకళ మంత్రిత్వ శాఖ యొక్క స్కీమ్‌లను కళాకారులు పొందేలా ప్రోత్సహించనుంది.
రిలయన్స్ రిటైల్ భారతదేశం అంతటా ఉన్న హస్తకళాకారుల్ని ఆదరించడంలో చురుగ్గా పాల్గొంటోంది. ప్రామాణికమైన, హస్తకళా ఉత్పత్తులను సేకరించడం ద్వారా గొప్ప భారతీయ వారసత్వాన్ని ప్రోత్సహించడం, చేతివృత్తుల వారి జీవనోపాధిని నిలబెట్టడం కోసం కృషి చేస్తోంది. లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ విభాగంలో కొత్త స్వదేశ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మరింత దృష్టి కేంద్రీకరించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Reliance, Reliance retail