AJIO OUTRYT: లాక్మే ఫ్యాషన్ వీక్‌లో సరికొత్త డిజైన్ ఔట్‌రైట్‌ను ప్రవేశపెట్టిన ఎజియో..

(image: AJIO)

కేవలం మహిళలను ఉద్దేశించి తయారుచేసిన ఈ డిజైన్స్ చక్కటి ఫ్యాషన్ ను ప్రతిబింబిస్తున్నాయి. సింప్లిసిటీతో పాటు డిజిటల్ కల్చర్, రెట్రో లుక్ తో అద్భుతమైన డిజైన్లు ఈ OUTRYT బ్రాండ్ ద్వారా లభించనున్నాయి.

  • Share this:
    లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ అంటేనే దేశంలోని అగ్రశ్రేణి ఫ్యాషన్ షోలలో మంచి పేరు పొందింది. ఇందులో ఈ ఫ్యాషన్‌ షోలో ప్రముఖ ఫ్యాషనర్స్‌తో పాటు బాలీవుడ్‌ అగ్ర తారాలోకం ర్యాంప్‌పై తమ హొయలతో ఫైర్‌ పుట్టిస్తారు. పలువురు బాలీవుడ్‌ బ్యూటీస్‌ తమ స్టైల్స్‌తో లాక్మే స్టేజ్‌ని తళుక్కుమనిపిస్తారు. అయితే ఈ సంవత్సరం FDCI x Lakme Fashion Weekలో ప్రముఖ ఈ-రిటైలర్ సంస్థ AJIO తమ సరికొత్త బ్రాండ్ OUTRYT ను ఈ సందర్భంగా ప్రవేశపెట్టింది. మార్చ్ 16 నుంచి 21 వరకూ జరిగే ఈ ఫ్యాషన్ వీక్ లో AJIO తన ఫ్యాషన్ సిగ్నేచర్ ను వదిలింది. కేవలం మహిళలను ఉద్దేశించి తయారుచేసిన ఈ డిజైన్స్ చక్కటి ఫ్యాషన్ ను ప్రతిబింబిస్తున్నాయి. సింప్లిసిటీతో పాటు డిజిటల్ కల్చర్, రెట్రో లుక్ తో అద్భుతమైన డిజైన్లు ఈ OUTRYT బ్రాండ్ ద్వారా లభించనున్నాయి. హస్తకళలను సైతం ఈ ఫ్యాషన్ దుస్తుల్లో చొప్పించడం ఇందులో విశేషం. ఈ సందర్భంగా AJIO ప్రతినిధులు మాట్లాడుతూ అన్ని తరగతుల వారిని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్యాషన్ వేర్ డిజైన్ చేయడం జరిగిందని, కస్టమర్లు ఊహించిన దాని కన్నా రెట్టింపు ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

    ఈ వీడియో చూడండి...సబ్ స్క్రయిబ్ చేయండి...



    కాగా ఈ OUTRYTడిజైనర్ దుస్తులు, దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియులకు అందుబాటులో తేనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా దేశంలో ప్రఖ్యాత Reliance TRENDS స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి.
    Published by:Krishna Adithya
    First published: