ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాల్లో సంక్షోభానికి కారణమైతే, మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మాత్రం ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల జీవనోపాధిని రక్షించడమే కాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించింది. ఒక్క రిలయన్స్ రీటైల్ (Reliance Retail) వ్యాపారంలోనే 1,50,000 కొత్త ఉద్యోగాలు సృష్టించడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో కల్పించిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. కొత్తగా 1,50,000 ఉద్యోగులు చేరడంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 3,61,000 కి చేరింది. 2021 మార్చిలో రిలయన్స్ రీటైల్ ఉద్యోగుల సంఖ్య 2,08,000 మాత్రమే.
LIC IPO SBI Tips: ఈ టిప్స్‌తో ఎల్ఐసీ ఐపీఓకి అప్లై చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ
రిలయన్స్ రీటైల్ ఫిజికల్ స్టోర్ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో పాటు డిజిటల్, కొత్త ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటవుతున్నాయి. వేగవంతమైన విస్తరణకు అనుగుణంగా, ఈ ఉద్యోగాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ నాన్-మెట్రోలు, టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనే కావడం విశేషం. చిన్న పట్టణాలలో జీవనోపాధి అవకాశాలు ఉద్యోగార్ధులకు పెద్ద ఉపశమనాన్ని అందిస్తాయి. వారి స్వగ్రామాలలో నివసించే అవకాశం ఉంటుంది.
ఉద్యోగాలు కల్పించడంతో పాటు కోవిడ్ 19 మహమ్మారి కాలంలో రిలయన్స్ రీటైల్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భద్రత, శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రజల భద్రత, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, ఈ సూత్రాన్ని నిలబెట్టడానికి రిలయన్స్ రీటైల్ బృందంలోని సభ్యులను, వారి కుటుంబాలను రక్షించడానికి కంపెనీ అనేక కార్యక్రమాలను చేపట్టింది.
Aadhaar Update: ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు... ఈ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే
సురక్షితమైన పని వాతావరణం కోసం స్టోర్స్‌కు వచ్చే ఉద్యోగులకు ఎప్పటికప్పుడు RTPCR నిర్వహించారు. స్టోర్‌లు, DC & FCలలోని అన్ని కాంటాక్ట్ పాయింట్‌లను తరచుగా శానిటైజేషన్ చేశారు. మాస్కులు ధరించిన వినియోగదారులను మాత్రమే లోపలికి అనుమతించారు. స్టోర్లలో అవసరమైన చోట యూవీ క్లీనింగ్ చేశారు. హోమ్ డెలివరీ కోసం ఉపయోగించే పరికరాలను శానిటైజ్ చేశారు. ఉద్యోగుల మధ్య కంటాక్ట్ నివారించడానికి DC/FCలలో ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ ప్రాంతాలుగా విభజించారు. టచ్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ తొలగించడానికి పీపుల్ ఫస్ట్ యాప్‌ని ఉపయోగించి అటెండెన్స్ వేశారు. ఫ్రంట్‌లైన్ సిబ్బందికి PPE కిట్లతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే మెడిసిన్ అందించారు.
ఇక ఉద్యోగుల వ్యక్తిగత భద్రత కోసం ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ 19 సింప్టమ్ చెకర్ సర్వే నిర్వహించారు. ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్‌తో థర్మల్ స్కానింగ్ చేశారు. ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లోవ్స్, ఫేస్ షీల్డ్స్ తప్పనిసరి చేశారు. అవసరమైనవారికి పాలీ-టాఫెటా ఫాబ్రిక్ జాకెట్ లేదా PPE సూట్ అందించారు. ఉద్యోగులు తరచూ చేతులు కడుక్కోవడానికి గంటకోసారి అలర్ట్ కూడా చేశారు. స్టోర్ పరిశుభ్రతపై సమాచారాన్ని డిస్‌ప్లే చేశారు. స్థానికంగా ఉండే వైద్యులతో పాటు రిలయన్స్ నిపుణుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వ్యక్తిగత భద్రత, హైజీన్ పాటించాలని రీజనల్ రేడియోల ద్వారా తెలిపారు. హెచ్‌ఆర్ సంపర్క్ కాల్స్ సమయంలో ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించారు. వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు ఆర్ స్వాస్థ్య, ఆర్ఆర్ పీపుల్ కనెక్ట్ ఇమెయిల్స్ పంపారు.
Jio New Plans: జియో నుంచి 4 కొత్త ప్లాన్స్ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
ఉద్యోగి సంరక్షణకు ప్రాముఖ్యతనిస్తూ, మహమ్మారి సమయంలో రిలయన్స్ వారిని అనేక రకాలుగా ఆదుకుంది. మరణించిన ఉద్యోగుల నామినీకి ఉద్యోగి చివరిగా తీసుకున్న నెలవారీ జీతాన్ని 5 సంవత్సరాల పాటు అందిస్తోంది. వారి పిల్లలందరికీ భారతదేశంలోని ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాచిలర్ డిగ్రీ వరకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతి, బుక్ ఫీజు చెల్లిస్తోంది. వారి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలకు బ్యాచిలర్ డిగ్రీ వరకు హాస్పిటలైజేషన్ కవరేజీ కోసం 100 శాతం ప్రీమియం చెల్లిస్తోంది. ఇక ఆఫ్-రోల్ ఉద్యోగులు మరణిస్తే వారి నామినీకి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో ఆదుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.