Reliance Retail - Future Group Deal | ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌లో రిటైల్ అండ్ హోల్‌సేల్ వ్యాపారాలను కొనుగోలు చేసింది. రూ.24,713 కోట్లు చెల్లించి రిలయన్స్ సంస్థ ఫ్రూచర్ గ్రూప్ రిటైల్‌ను కైవసం చేసుకుంది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో రిటైల్ అండ్ హోల్ సేల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ (ఆర్ ఆర్ ఎఫ్ ఎల్ ఎల్) కు బదిలీ చేయనుంది. అలాగే ఫ్యూచర్ గ్రూప్‌లోని లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ విభాగాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తుంది. ఆర్ ఆర్ ఎఫ్ ఎల్ ఎల్ సంస్థ ఫ్యూచర్ ఎంటర్ (ఎఫ్ఈఎల్) ప్రైజెస్ లిమిటెడ్‌లో రూ.1200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదించింది. ఎఫ్ఈఎల్ ఈక్విటీ వారెంట్స్ మీద మరో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ‘ఈ డీల్ ద్వారా ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఎన్నో సరికొత్త బ్రాండ్స్, ఎకోసిస్టమ్‌కు భారత్‌లో మోడ్రన్ రిటైల్‌ను కొత్త తీరాలకు తీసుకెళ్లిన రిలయన్స్ ఓ ఆవాసం కల్పిస్తుంది.’ అని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు. యూనిక్ మోడల్ ద్వారా చిన్న వర్తకులు, కిరాణా దుకాణాదారులతోపాటు పెద్ద కన్జ్యూమర్ బ్రాండ్స్ వరకు అందరినీ కలుపుకొని రిటైల్ ఇండస్ట్రీలో మరింత పురోగతి సాధించేందుకు ప్రయత్నిస్తామన్నారు. దేశంలో తమ వినియోగదారులకు సేవలు అందిస్తామన్నారు. రిటైల్, హోల్ సేల్ రంగంలో అనుభవం, పేరు ఉన్న ఫ్యూచర్ గ్రూప్ విభాగం రిలయన్స్ రిటైల్ వ్యాపారానికి కరెక్టుగా సూట్ అవుతుంది. కొన్ని లక్షల మంది వ్యాపారులకు సేవలు అందించేందుకు రిలయన్స్ రిటైల్‌కు కూడా ఓ అద్భుత అవకాశం లభిస్తుంది. అయితే, ఈ విలీనం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Reliance, Reliance JioMart