Home /News /business /

RELIANCE RETAIL ACQUIRES AMANTE BUSINESS OF MAS HOLDINGS HERE DETAILS NS

‘Amante’ ను కొనుగోలు చేసిన Reliance Retail.. ఇక వినియోగదారులకు చేరువలో ఆ ఉత్పత్తులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇషా అంబానీ(Isha Ambani) నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RIL), శ్రీలంక ఆధారిత లోదుస్తుల యొక్క ప్రసిద్ధ బ్రాండ్ అయిన అమంటే యొక్క మొత్తం వ్యాపారాన్ని కొనుగోలు చేసింది.

    రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమార్తె ఇషా అంబానీ(Isha ambani) నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RIL), శ్రీలంక(Srilanka) ఆధారిత లోదుస్తుల యొక్క ప్రసిద్ధ బ్రాండ్ అయిన అమంటే యొక్క మొత్తం వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. దీని ద్వారా, భారతదేశపు అతిపెద్ద రిటైల్ వెంచర్ అయిన రిలయన్స్ తన వినియోగదారులకు వివిధ రకాల ఉన్నతమైన డిజైన్ ఉత్పత్తులను తీసుకురానుంది. ఆమంటే 2006-2007లో తమ వ్యాపారాన్ని ప్రారంభింంచింది. ఈ కంపెనీలు తమ ఉత్పత్తులను స్వయంగా విక్రయించడంతోపాటు టోకు పంపిణీ కూడా చేస్తాయి. వారు వివిధ రకాల ప్రీమియం లోదుస్తుల బ్రాండ్‌లను కలిగి ఉన్నారు. వీటిలో ముఖ్యమైనవి Amante, Ultimo, ‘every dé by amanté’. వీరు తమ సొంత దుకాణాలు, బహుళ-బ్రాండ్ అవుట్‌లెట్‌లు మరియు ఈ-కామర్స్ కంపెనీలలో వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తారు. వారి ఉత్పత్తులు శ్రీలంక మరియు భారతదేశం అంతటా అమ్ముడవుతాయి. అలాంటి పేరున్న బ్రాండ్ ఇప్పుడు రిలయన్స్‌తో చేతులు కలిపింది.

    ఈ అంశంపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. "మేము మా కస్టమర్‌లకు ఎప్పటికప్పుడు అత్యుత్తమమైన మరియు అధునాతనమైన ఉత్పత్తులను అందిస్తున్నాము. మా కస్టమర్లందరికీ ఉత్తమమైన సేవలను అందించడమే మా లక్ష్యం. మా బ్రాండెడ్ ఉత్పత్తులను పరిచయం చేయడం మాకు గర్వకారణం. రిలయన్స్ యొక్క ఈ ట్రెండ్‌ను కొనసాగించడానికి అమాంటే వంటి ప్రఖ్యాత లైఫ్‌స్టైల్ బ్రాండ్‌లు ఉపయోగపడాతయి. ఇది ఖచ్చితంగా మా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు సహాయపడుతుంది. వినియోగదారులందరూ అమంటా వంటి ప్రసిద్ధ బ్రాండ్ ఉత్పత్తులు మరియు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ యొక్క సమర్థవంతమైన నిర్వహణ ద్వారా ప్రయోజనం పొందుతారు’’ అని అన్నారు.
    GAMING MASTERS 2.0: జియోగేమ్స్‌లో గేమింగ్ మాస్టర్స్ 2.0 ఈవెంట్... గెలిస్తే రూ.12,50,000 బహుమతి

    MAS బ్రాండ్ సహ వ్యవస్థాపకుడు అజయ్ అమలేన్ మాట్లాడుతూ.. "మా బ్రాండ్ చాలా కాలంగా లోదుస్తుల వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ప్రీమియం నాణ్యత లోదుస్తుల బ్రాండ్‌ల వ్యాపారంలో మాకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది. మేము మా వ్యాపారాన్ని విస్తరించడానికి. మా బ్రాండెడ్ ఉత్పత్తులు రిలయన్స్ యొక్క వివిధ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుదారులందరికీ అందుబాటులో ఉంటాయి. మా లక్ష్యం భారతదేశం అంతటా ప్రీమియం నాణ్యమైన లోదుస్తుల ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడం. ఇది మా వ్యాపారాన్ని విస్తరిస్తుంది." అని అన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Isha Ambani, Mukesh Ambani, Reliance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు