రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL), సౌదీ ఆరామ్ కో సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్టుబడుల ప్రణాళిక పునఃముదింపు చేయాలని నిర్ణాయానికి వచ్చాయి. తన చమురు శుద్ధి కర్మాగారం మరియు పెట్రోకెమికల్ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ అరామ్కోకు విక్రయించడానికి ప్రతిపాదిత $ 15 బిలియన్ల ఒప్పందాన్ని పునముదింపు చేస్తున్నట్లు తెలిపింది. రిలయన్స్ కొత్త ఇంధన వ్యాపారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ప్రతిపాదిత పెట్టుబడిని తిరిగి మూల్యాంకనం చేయడానికి రెండు సంస్థలు అంగీకరించాయి. ప్రస్తుతం రిలయన్స్ నిర్వహిస్తున్న వ్యాపారాలను పరిగణలోకి తీసుకుని, మారిన పరిస్థతులకు అనుగుణంగా పెట్టుబడుల ప్రతిపాదనలపై పునముదింపు చేసుకోవడం వలన రెండు సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని నిర్ణయానికి వ చ్చాయి. ఈ నేపథ్యంలో RIL నుంచి చమురు-రసాయనాల వ్యాపార విభజనకు ఎన్సీఎల్టీ(NCLT) వద్ద దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకున్నమని RIL వెల్లడించింది. భారత్ లో ప్రైవేటు రంగంలో పెట్టుబడులకు సౌదీ ఆరామ్ కో భాగస్వామిగా RIL కొనసాగుతుందని వెల్లడించింది. సౌదీ అరేబియాలో పెట్టుబడులకు సౌదీ ఆరామ్ కో, ఎస్ఏబీఐసీ తో కలిసి ముందు సాగుతామని RIL స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు సౌదీ అరామ్ కో సంస్థలు 2019లో O2C బిజినెస్ కు సంబంధించి ఒప్పందంపై సంతకం చేసుకున్నాయి. గత రెండేళ్లుగా ఈ ప్రక్రియలో ఇరు సంస్థలు గణనీయమైన కృషి చేశాయి. కరోనా నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లోనూ రెండు సంస్థలు కలిసి ముందుకు సాగాయి. ధీరూబాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ అభివృద్ధిలో భాగంగా రిలయన్స్ ఇటీవల న్యూ ఎనర్జీ & మెటీరియల్స్ వ్యాపారాల కోసం తన ప్లాన్లను ఆవిష్కరించింది. ఇది ప్రపంచ స్థాయి సదుపాయాలు కలిగిన పెద్ద అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ సంస్థ.
‘Amante’ ను కొనుగోలు చేసిన Reliance Retail.. ఇక వినియోగదారులకు చేరువలో ఆ ఉత్పత్తులు
కాంప్లెక్స్‌లో భాగమైన నాలుగు గిగా ఫ్యాక్టరీలు వీటిని కలిగి ఉంటాయి:
1. సౌర శక్తి ఉత్పత్తి కోసం సమీకృత సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీ
2. శక్తిని నిల్వ చేయడానికి ఒక అధునాతన శక్తి నిల్వ బ్యాటరీ ఫ్యాక్టరీ
3. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఒక ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ
4. హైడ్రోజన్‌ను మోటివ్ & స్టేషనరీ పావ్గా మార్చడానికి ఇంధన సెల్ ఫ్యాక్టరీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.