ఫ్యూచర్ స్టోర్ లీజులు రిలయన్స్ పేరు మీద ఉండడంతో ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్‌ను (Future Retail Stores) తీసుకోవడాన్ని రిలయన్స్ ప్రారంభించింది. ఇకపై ఫ్యూచర్ వీటిని నిర్వహించే వీలుండదు. ఈ స్టోర్స్‌లో పని చేసే వారందరికీ రిలయన్స్ (Reliance) ఉద్యోగావకాశాలను అందిస్తోంది. ఫ్యూచర్ రిటైల్ నెట్‌వర్క్‌లో పని చేస్తున్న సుమారు 30,000 మందికి వారు ఉద్యోగాలు కొనసాగించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఉద్యోగులు ఈ చర్యను హర్షించారు. నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి నుంచి ఉపశమనం పొందారు. ఉద్యోగభద్రతకు అవకాశం ఏర్పడింది. అదే విధంగా విక్రేతలు, సరఫరాదారులు కూడా ఊరట చెందారు. వారు తమ బకాయిలు పొందుతున్నారు, వ్యాపారం నిలకడగా కొనసాగుతుందని భావిస్తున్నారు. భారీ కార్పొరెట్ సంస్థ తమ నూతన కస్టమర్ కావడం కొత్త వ్యాపార అవకాశాలను అందించగలదన్న ఆశాభావంతో ఉన్నారు.
భవన యజమానులు సైతం తమ స్టోర్స్‌ను రిలయన్స్‌కు లీజుకు ఇస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది అద్దెలు ఫ్యూచర్ గ్రూప్ నుంచి వారికి అందలేదు. ఆ బకాయిలను తీర్చే విషయంలో ఫ్యూచర్ శక్తి సామర్థ్యాలపై వారు అనిశ్చితితో ఉన్నారు. వారితో చర్చించిన పిమ్మట రిలయన్స్ వారి పాత బకాయిలను తీర్చింది మరియు వారు అద్దెలను క్రమం తప్పకుండా పొందగలుగుతున్నారు.
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో తన ఆస్తిని లీజుకు ఇచ్చిన రిటైర్డ్ వైద్యుడు డాక్టర్ NPVS రాజు, రిలయన్స్ కార్యకలాపాలను చేపట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. రిలయన్స్‌కు మా స్టోర్‌ను లీజుకు ఇచ్చినప్పటి నుంచి మేము చాలా సంతోషంగా ఉన్నామని ఆయన చెప్పారు. మా బకాయిలన్నీ క్లియర్ చేయబడ్డాయి. మేము క్రమం తప్పకుండా అద్దెలను పొందుతున్నామన్నారు.
భారతదేశంలో వ్యవస్థీకృత అగ్రగామిగా పరిగణించే ఫ్యూచర్ రెండేళ్ల నుంచి కష్టాల్లో చిక్కుకుంది. రుణదా తలకు చెల్లింపులు చేయలేకపోయింది. 2020 మధ్యలో తన రిటైల్ ఆస్తులను రిలయన్స్ కు విక్రయించేం దుకు చర్చలు జరిపింది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో అమెజాన్ లేవనెత్తిన అంశం అడ్డుగా నిలిచింది. ఫ్యూచర్ రిటైల్ బిజినెస్ నియంత్రించేందుకు, ఆ విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు అది అవరోధంగా మారింది.
కుదుర్చుకునే ఒప్పందం దేశీయ చట్టాలను ఉల్లంఘించినట్లవుతుంది. అదే సమయంలో అమెజాన్ ఈ మల్టీ బ్రాండ్ రిటైల్ లో ఇన్వెస్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే, అలా ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు అంగీకరించవు. అయితే ఈ రిటైలర్ సంస్థను నియంత్రించాలన్న అమెజాన్ ఆరాటం న్యాయపరమైన వివాదాలకు దారితీసింది.
రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంలో జాప్యానికి దారి తీసింది. అది ఉద్యోగుల్లో అనిశ్చితిని ఏర్పరిచింది. విక్రేతలకు, సరఫరాదారులకు వ్యాపారాన్ని తగ్గించింది. భవనాల యజమానులకు, సప్లయర్స్ కు, రుణదాతలకు భారీగా బకాయిపడేలా చేసింది. బకాయిలు పేరుకుపోవడంతో రుణదాతలు ఒత్తిళ్లను అధికం చేశారు. మరో వైపున కంపెనీ దివాళా తీయడం ప్రారంభమైంది. అది గనుక జరిగితే, రుణదాతలకు ఎంతో నష్టం. అదే విధంగా కంపెనీ సిబ్బంది అంతా ఉద్యోగాలు కోల్పోతారు.
అయితే, నష్టాలు వస్తున్న స్టోర్స్‌ను రిలయన్స్ తీసుకోవడంతో ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. సర్దుబాటు పథకం గనుక ఆమోదం పొందితే, తమ బకాయిలు రాగలవని రుణదాతలు ఇప్పుడు భావిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.