RELIANCE NEW ENERGY SOLAR TO ACQUIRE FARADION LIMITED DETAILS HERE GH VB
Reliance Industries Ltd:: రిలయన్స్ చేతికి యూకేకు చెందిన సంస్థ..100 శాతం వాటాతో.. రూ.1,000 కోట్లకు పైగా..
ప్రతీకాత్మక చిత్రం
Reliance: దేశంలో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్( RNESL) యూకేకు చెందిన ఫారడియాన్ సంస్థను సొంతం చేసుకుంది.
దేశంలో అగ్రగామిగా ఉన్న సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance Industries Limited) ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(RNESL) యూకే(UK)కు చెందిన ఫారడియాన్(Faradian) సంస్థను సొంతం చేసుకుంది. 100 శాతం షేర్ ను కొనుగోలు చేసినట్లు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంస్థను 100 మిలియన్ల గ్రేట్ బ్రిటన్ పౌండ్లు(రూ.10,041 కోట్లు) సొంతం చేసుకుంది. వాణిజ్యపరమైన అభివృద్ధి(Development)ని వేగవంతం చేయడానికి అదనంగా మరో 25 మిలియన్ల పౌండ్లను గ్రోత్ క్యాపిటల్(Growth Capital)గా పెట్టుబడి పెడుతుంది.
యూకేలోని షెఫీల్డ్, ఆక్స్‌ఫర్డ్‌లో సోడియం-అయాన్ బ్యాటరీ సాంకేతికతను అభివృద్ధి చేసిన ప్రముఖ గ్లోబల్ కంపెనీల్లో ఫారాడియన్ సంస్థ కూడా ఒకటి. సోడియం, అయాన్ టెక్నాలజీ పరంగా అనేక అంశాలను కవర్ చేసే వ్యూహాత్మకమైన, విస్తృతమైన పోర్ట్ ఫోలియోను ఈ సంస్థ కలిగి ఉంది. ప్రత్యామ్నాయ బ్యాటరీ టెక్నాలజీ(Technology)తో పోలిస్తే ఈ సాంకేతికత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో లిథియం(Lithium), అయాన్, లెడ్ యాసిడ్(Led Acid) లను ఉపయోగించారు. ఈ సంస్థ సోడియం-అయాన్ టెక్నాలజీ(Sodium ion Technology)లో పేటెంట్‌ను కూడా కలిగి ఉంది.
సుస్థిరమైంది: కోబాల్ట్, లిథియం, కాపర్ లేదా గ్రాఫైట్‌పై ఆధారపడకుండా ఈ సాంకేతికత పనిచేస్తుంది. ఈ గ్రహంలోనే సమృద్ధిగా ఉండే మూలకాల్లో సోడియం ఆరో స్థానంలో ఉంది. పేటెంట్ జీరో: ఇది సురక్షితమైన రవాణాతో పాటు నిల్వ సామార్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. తక్కువ ఖర్చు: లెడ్ యాసిడ్ తో పోలిస్తే ఓనర్షిప్ కాస్ట్ మరింత తక్కువ. స్కేలబిలిటీ: ఇప్పటికే ఉన్న లిథియం-అయాన్ తయారీ అవస్థాపనను ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా వాణిజ్యావసరాలకు అనేక భాగస్వాములను కలిగి ఉంది. పనితీరు: లిథియం-అయాన్ ఫాస్ఫేట్తో సమానంగా శక్తి సాంద్రత, విస్తృత ఆపరేటింగ్ ఉష్ణోగ్రత పరిధి - 30 డిగ్రీల నుంచి +60 డిగ్రీల వరకు ఉంటుంది. దీంతో పాటు ఫాస్ట్ ఛార్జ్/డిశ్చార్జ్ సామార్థ్యాన్ని కలిగి ఉంది.
ఇవన్నీ తదుపరి తరం, అధిక సాంద్రత, సురక్షితమైన, స్థిరమైన, తక్కువ- ధర శక్తి నిల్వ సాంకేతిక పరిష్కారాన్ని అందించడాన్ని మిళితం చేస్తాయి. భారత్‌లోని జామ్ నగర్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ప్రాజెక్టులో భాగంగా రిలయన్స్ తన ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీలో పారాడియన్ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనుంది.
ఈ విషయంపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్పందించారు. "న్యూ ఎనర్జీ ఎకోసిస్టం క్రియేట్ చేసి, భవిష్యత్తులో మరింత శక్తిమంతంగా మారడానికి ఫారాడియన్ దోహదపడుతుంది. సోడియం-అయాన్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎనర్జీ స్టోరేజ్ కోసం బ్యాటరీలను మరింత సురక్షితంగా, సుస్థిరంగా మార్చింది. అంతేకాకుండా ఖర్చు కూడా తక్కువ. విద్యుత్ వాహనాల తయారీలో ఈ బ్యాటరీలు ఎంతో కీలకం.
ఈవీ మార్కెట్ కు ఉత్ప్రేరకంగా మార్చి భారత్ లో అతిపెద్ద గిగా స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను నెలకొల్పుతాం" అని ఆయన అన్నారు.
సోడియం-అయాన్ బ్యాటరీ టెక్నాలజీ తయారీలో ఫారాడియన్ ఛాంపియన్ అని, భారత మార్కెట్లో దూసుకెళ్లడానికి, తమ వృద్ధికి రిలయన్స్ పర్ఫెక్ట్ భాగస్వామి అని ఫారాడియన్ సీఈఓ జేమ్స్ క్విన్ అన్నారు. రిలయన్స్‌తో కలిసి ప్రపంచాన్ని లిథియం వైపు ఆకర్షించేలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.