Reliance Industries Ltd: బిజినెస్​లో రిలయన్స్​ ఇండస్ట్రీస్‌ హవా.. ఒకే రోజు రెండు పెద్ద ఒప్పందాలు​ కుదుర్చుకుని రికార్డు

ప్రతీకాత్మక చిత్రం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (Reliance Industries Ltd) టేకోవర్ల పర్వం కొనసాగుతోంది. ఒకే రోజు రెండు పద్ద కంపెనీలతో ఒప్పందాలు​​ కుదుర్చుకుంది రిలయన్స్ (reliance)​.

  • Share this:
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (Reliance Industries Ltd) టేకోవర్ల పర్వం కొనసాగుతోంది. ఒకే రోజు రెండు పద్ద కంపెనీలతో ఒప్పందాలు​​ కుదుర్చుకుంది రిలయన్స్ (reliance)​. తాజాగా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ లిమిటెడ్‌ (Sterling and Wilson Solar Ltd)  ఈక్విటీలో 40 శాతం వాటాను ఆర్‌ఐఎల్‌ కొనుగోలు చేసింది. ఎస్‌డబ్ల్యూ ఎస్‌ఎల్‌లో ఈ వాటా కొనుగోలు కోసం రూ.,2,845 కోట్లు వెచ్చించనుంది. ఇదే రోజు నార్వేకి చెందిన ఆర్‌ఈసీ సోలార్‌ను 77.1 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5,800 కోట్లు) కొనుగోలు చేసింది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌ (Reliance New Energy Solar Ltd) ద్వారా ఆర్‌ఐఎల్‌ ఈ కొనుగోళ్లను చేపట్టింది. చైనా ప్రభుత్వ నిర్వహణ లోని  చైనా నేషనల్‌ బ్లూస్టార్‌ (గ్రూప్‌) కంపెనీ లిమిటెడ్‌ నుంచి ఆర్‌ఈసీ సోలార్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దక్కించుకుంది. సరికొత్త టెక్నాలజీతో అధునాతనమైన పాలీసిలికాన్‌ సోలా ర్‌ సెల్స్‌, ప్యానెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీలో ఆర్‌ఈసీ సోలార్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది.

సెకండరీ కొనుగోలు, ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా..

ఆర్‌ఈసీ (REC) సోలార్‌ను రిలయన్స్‌ (Reliance) కొనుగోలు చేయగా ఎస్‌డబ్ల్యూఎస్‌ ఎల్‌లో 40 శాతం వాటాలను ప్రైమరీ పెట్టుబడులు, సెకండరీ కొనుగోలు, ఓపెన్‌ ఆఫర్‌ (open offer) ద్వారా చేజిక్కించుకోనుంది. సోలార్‌ (solar) ఈపీసీ రంగంలో ఉన్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ లిమిటెడ్‌ను ఎస్‌పీ గ్రూప్‌.. కుర్షిద్‌ యాజ్ది దారువాల కుటుంబంతో కలిసి నిర్వహిస్తోంది. ఈ వాటా కొనుగోలు ద్వారా స్టెర్లింగ్‌ అండ్‌  విల్సన్‌ డైరెక్టర్ల బోర్డులో ఆర్‌ఐఎల్‌ (RIL)కు రెండు స్థానాలు లభిస్తాయి.

పర్యావరణ వ్యవస్థ నిర్మాణంలో భాగం: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్​ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ( Reliance Industries chairman and managing director Mukesh Ambani ) మాట్లాడుతూ..  "మా న్యూ ఎనర్జీ ప్లాట్‌ ఫామ్‌ను నిర్మించే వ్యూహాత్మక భాగస్వామిగా స్టెర్లింగ్ మరియు విల్సన్ సోలార్ లిమిటెడ్‌ను మేం స్వాగతిస్తున్నాం. స్టెర్లింగ్ మరియు విల్సన్ సోలార్ లిమిటెడ్ దాని ఇంజనీరింగ్ టాలెంట్, లోతైన డొమైన్ నాలెడ్జ్, గ్లోబల్ ప్రెజెన్స్, గ్లోబల్‌గా అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్‌లను అమలు చేసిన అనుభవం ఉపకరిస్తుంది. ఈ భాగస్వామ్యం పర్యావరణ వ్యవస్థ నిర్మాణంలో భాగమవుతూ గ్రీన్ ఎనర్జీని భారతీయ వినియోగదారులకు అందించడానికి మాకు వీలు కల్పిస్తుంది” అన్నారు.

రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ స్టెర్లింగ్ & విల్సన్ సోలార్‌లో ఒక్కో షేరుకు రూ. 375 ధరలో 2.93 కోట్ల ఈక్విటీ షేర్లను (పోస్ట్-ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్‌లో 15.46 శాతానికి సమానం) ప్రిఫరెన్షియల్ కేటాయింపు (Preferential allotment of 2.93 crore equity shares)ను పొందుతుంది. అదనంగా.. అదే ధర వద్ద 1.84 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా 9.70 శాతం వాటాను షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా కొనుగోలు చేసింది. ఆ తరువాత ఆయిల్-టు-రిటైల్ కొంగ్లోమిరేట్​ (oil-to-retail conglomerate) కూడా సెబీ నిబంధనల ప్రకారం కంపెనీలో అదనంగా 25.9 శాతం కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ కోసం వెళ్లనుంది. ఇది విజయవంతమైతే స్టెర్లింగ్ & విల్సన్ సోలార్‌లో ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్ 40 శాతం వాటా దక్కుతుంది.
Published by:Prabhakar Vaddi
First published: