హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance New Energy: యూఎస్‌ సోలార్‌ టెక్‌ కంపెనీ కేలక్స్‌లో 20 శాతం వాటా కొంటున్న RNEL.. డీల్‌ వివరాలివే..

Reliance New Energy: యూఎస్‌ సోలార్‌ టెక్‌ కంపెనీ కేలక్స్‌లో 20 శాతం వాటా కొంటున్న RNEL.. డీల్‌ వివరాలివే..

Reliance New Energy: యూఎస్‌ సోలార్‌ టెక్‌ కంపెనీ కేలక్స్‌లో 20 శాతం వాటా కొంటున్న RNEL.. డీల్‌ వివరాలివే..

Reliance New Energy: యూఎస్‌ సోలార్‌ టెక్‌ కంపెనీ కేలక్స్‌లో 20 శాతం వాటా కొంటున్న RNEL.. డీల్‌ వివరాలివే..

Reliance New Energy: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL), గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యాలను వేగంగా అందుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా యూఎస్‌కు చెందిన సోలార్‌ టెక్నాలజీ కంపెనీలో 20 శాతం వాటా కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ముఖేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL), గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యాలను వేగంగా అందుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కాలిఫోర్నియాకు చెందిన సోలార్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ సెన్స్‌హాక్(SenseHawk) ఇంక్‌లో 79.4 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. తాజాగా యూఎస్‌కు చెందిన మరో సోలార్‌ టెక్నాలజీ కంపెనీలో 20 శాతం వాటా కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు చూద్దాం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ రిలయన్స్‌ న్యూ ఎనర్జీ లిమిటెడ్‌ (RNEL) కంపెనీ.. యూఎస్‌ కంపెనీ కేలక్స్‌ కార్పొరేషన్‌(Caelux Corporation)లో పెట్టుబడులు పెట్టనుంది. పెరోవ్‌స్కైట్ బేస్డ్ సోలార్ టెక్నాలజీ అభివృద్ధిలో నిమగ్నమైన ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని పసాదేనాలో ఉంది. కేలక్స్‌లో 20 శాతం వాటాను పొందేందుకు 12 మిలియన్ల డాలర్లను (సుమారు రూ.97కోట్లు) RNEL ఖర్చు చేస్తోంది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై రెండు కంపెనీలు సంతకాలు చేశాయి. లావాదేవీ సెప్టెంబర్ 2022 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

* 20 శాతం ఎక్కువ ఎనర్జీ

ఈ పెట్టుబడికి సంబంధించి RIL ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఈ పెట్టుబడి కేలక్స్‌లో ప్రొడక్ట్‌, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. యూఎస్‌లోని పైలట్ లైన్ నిర్మాణంతో సహా కేలక్స్‌ కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేస్తుంది. కేలక్స్‌ ప్రొప్రైటరీ టెక్నాలజీ అధిక-సమర్థవంతమైన సోలార్ మాడ్యూల్స్‌ను తయారు చేస్తుంది. ఇది సోలార్ ప్రాజెక్ట్ 25 సంవత్సరాల జీవితకాలంలో 20 శాతం ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా సోలార్‌ ప్రాజెక్ట్‌ను తక్కువ వ్యయంతోనే ఏర్పాటు చేయవచ్చు.’ అని RIL తెలిపింది.

RNEL, కేలక్స్‌ కంపెనీలు కేలక్స్‌ టెక్నాలజీని కమర్షలైజేషన్‌ చేయడం కోసం, సాంకేతిక సహకారం కోసం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రిలయన్స్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గ్లోబల్-స్కేల్ ఇంటిగ్రేటెడ్ ఫోటోవోల్టాయిక్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. కేలక్స్‌తో ఒప్పందం ద్వారా రిలయన్స్ మరింత శక్తివంతమైన , తక్కువ-ధర సోలార్ మాడ్యూల్‌లను తయారు చేయగలదు.

* టెక్నాలజీ అభివృద్ధి వేగవంతం

RIL ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..‘కేలక్స్‌లో పెట్టుబడి అధునాతన గ్రీన్‌ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఎకోసిస్టమ్‌ను రూపొందించే మా వ్యూహాలకు తోడ్పాటు అందిస్తుంది. ప్రపంచ స్థాయి ప్రతిభ తోడవుతుంది. కేలక్స్‌ ప్రొప్రైటరీ పెరోవ్‌స్కైట్-ఆధారిత సోలార్ టెక్నాలజీ స్ఫటికాకార సౌర మాడ్యూల్స్‌లో తదుపరి దశ ఆవిష్కరణకు ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాం. మేము దాని ప్రొడక్షన్‌ అభివృద్ధి, టెక్నాలజీ కమర్షలైజేషన్‌ వేగవంతం చేయడానికి కేలక్స్‌ బృందంతో కలిసి పని చేస్తాం.’ అని చెప్పారు.

కేలక్స్‌ కార్పొరేషన్ సీఈవో Scott Graybeal మాట్లాడుతూ..‘రిలయన్స్‌తో భాగస్వామ్యం ద్వారా, స్ఫటికాకార సోలార్ మాడ్యూల్స్‌ను మరింత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి, మా తయారీ సామర్థ్యాలను రూపొందించడానికి మా ప్రయత్నాలు వేగవంతం చేస్తాం. రిలయన్స్ గ్లోబల్ విస్తరణ ప్రణాళికలు , ఉత్పత్తి రోడ్‌మ్యాప్‌కు సపోర్ట్‌ ఇస్తున్నందున సౌరశక్తి భవిష్యత్తును ఒక స్థాయిలో ప్రదర్శించడానికి ఎదురుచూస్తున్నాం.’ అని వివరించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Mukesh Ambani, Reliance, Reliance Industries

ఉత్తమ కథలు