RELIANCE MUBADALA DEAL MUBADALA TO INVEST RS 9093 CRORE IN RELIANCE JIO LEADING GLOBAL TECHNOLOGY AND GROWTH INVESTORS MK
Jio - Mubadala Deal: జియోలో ముబదాలా ఇన్వెస్ట్మెంట్...రూ.9093 కోట్లతో వాటా కొనుగోలు.
(ప్రతీకాత్మక చిత్రం)
Jio - Mubadala Deal: అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిలయన్స్ జియోలో (Reliance Mubadala Deal) పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రూ .9,093.60 కోట్లతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.85 శాతం వాటాలను కొనుగోలు చేసింది.
జియో ప్లాట్ ఫామ్స్ లో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), అలాగే అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మధ్య భాగస్వామ్య ఒప్పందం (Reliance Mubadala Deal) జరిగింది. ఇందులో భాగంగా రూ .9,093.60 కోట్లను జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ముబదాలా పెట్టుబడి ప్రాతిపదికన చూస్తే ఇది జియో ప్లాట్‌ఫామ్‌లలో 1.85 శాతం ఈక్విటీ వాటాగా మారుతుంది.
ఇప్పటికే జియో ప్లాట్‌ఫాంలో ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, సహా తాజాగా ముబదాలా ఇన్వెస్ట్ మెంట్ పెట్టుబడవతో ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ, ఇన్వెస్టర్ల నుంచి రూ .87,655.35 కోట్ల పెట్టుబడులను కేవలం ఆరు వారాల్లోపు సేకరించింది.
ఈ ఒప్పందం నియంత్రణా సంస్థలు, అలాగే ఇతర అవసరమైన ఆమోదాలకు లోబడి ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ ఈ ఒప్పందం కోసం ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుండగా, అదే సమయంలో, డేవిస్ పోల్క్ & వార్డ్వెల్ను లీగల్ కౌన్సెల్‌గా నియమించారు.
గ్లోబల్ ఇన్వెస్టర్లు కన్ను జియో వైపే...
గ్లోబల్ ఇన్వెస్టర్లు జియోను ఎందుకు ఇష్టపడుతున్నారో పరిశీలిస్తే, జియో ప్లాట్ ఫాం దేశంలోనే డిజిటల్ సామర్థ్యానికి ఒక ప్రతీకగా నిలిచింది. అలాగే జియో సంస్థకు భారత మార్కెట్‌పై లోతైన అవగాహన ఉంది. COVID-19 తరువాత డిజిటలైజేషన్ అవకాశాలు పెరిగాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాధనాల వాడకం పెరిగింది, దీని నుండి ప్రయోజనం పొందడం ఖాయంగా మారింది.
ముబదాలా సంస్థ ప్రత్యేకత ఏంటి...
ముబదాలా అబుదాబికి చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ. ముబదాలా అబుదాబి సావరిన్ ఇన్వెస్టర్. అబుదాబి ప్రభుత్వ గ్లోబల్ పోర్ట్‌ఫోలియో మేనేజర్. ప్రపంచంలోని 5 ఖండాలలో 229 బిలియన్ డాలర్ల పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంది.
Chairman & MD of Reliance Industries Mukesh Ambani says 'I am delighted that Mubadala has decided to partner us in our journey to propel India’s digital growth towards becoming a leading digital nation in the world.'@reliancejio@Mubadalapic.twitter.com/O5gYAhvqiS
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.