Reliance Smart: ఆంధ్రప్రదేశ్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్‌ స్టోర్... రూ.9 ధరకే అనేక ఆఫర్లు

Reliance Smart | రూ.1499 విలువైన సరుకులు కొన్నవారికి కిలో పంచదార రూ.9 ధరకే అందిస్తోంది రిలయెన్స్ స్మార్ట్. ఇలాంటి ఆకర్షణీయమైన పథకాలతో దేశమంతా కిరాణా సరుకులకు కస్టమర్లు ఎంచుకోదగ్గ ఉత్తమమైన సూపర్‌మార్కెట్‌గా రిలయెన్స్ స్మార్ట్ నిలుస్తోంది.

news18-telugu
Updated: September 30, 2019, 5:03 PM IST
Reliance Smart: ఆంధ్రప్రదేశ్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్‌ స్టోర్... రూ.9 ధరకే అనేక ఆఫర్లు
Reliance Smart: ఆంధ్రప్రదేశ్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్‌ స్టోర్... రూ.9 ధరకే అనేక ఆఫర్లు (image: Reliance )
news18-telugu
Updated: September 30, 2019, 5:03 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ ప్రారంభమైంది. భారీస్థాయి సూపర్ మార్కెట్ శ్రేణి అయిన రిలయెన్స్ గుంటూరు జిల్లా వినుకొండలో SH275 అద్దంకి రోడ్డులో రిలయెన్స్ స్మార్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టోర్‌లో కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్ వేర్, హోమ్ వేర్ లాంటి మరెన్నో ఉత్పత్తులు ఒకేచోట లభిస్తాయి. రిలయెన్స్ స్మార్ట్ వినియోగదారులు చెల్లించే ప్రతీ రూపాయికి తగిన నాణ్యమైన ఉత్పత్తులు, సరుకులు పొందొచ్చు. దాంతోపాటు ఎంఆర్‌పీపై కనీసం 5% డిస్కౌంట్ లభిస్తుంది. ఏడాదంతా అన్ని ఉత్పత్తులపై ఈ ఆఫర్ ఉంటుంది. దీంతో పాటు రూ.1499 విలువైన సరుకులు కొన్నవారికి కిలో పంచదార రూ.9 ధరకే అందిస్తోంది రిలయెన్స్ స్మార్ట్. ఇలాంటి ఆకర్షణీయమైన పథకాలతో దేశమంతా కిరాణా సరుకులకు కస్టమర్లు ఎంచుకోదగ్గ ఉత్తమమైన సూపర్‌మార్కెట్‌గా రిలయెన్స్ స్మార్ట్ నిలుస్తోంది. కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తుల్ని తక్కువ ధరకే అందిస్తోంది.

గుంటూరు జిల్లా వినుకొండలో ఏర్పాటైన స్టోర్‌ క‌లుపుకొని ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 18 కి చేరుకుంది. 16,529 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో కొలువు దీరిన ఈ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉత్త‌మ‌మైన డిజైన్, లేఔట్ క‌లిగి ఉంది. నాణ్య‌మైన ఉత్ప‌త్తులు మ‌రియు ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌ల వ‌ల్ల స్థానిక ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకోవ‌డంతో పాటుగా వారి దైనందిన అవ‌స‌రాల‌ను తీర్చే కేంద్రంగా రిలయన్స్ స్మార్ట్ నిల‌వ‌నుంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా, రిలయన్స్ స్మార్ట్ త‌న వినియోగ‌దారులకు సంబంధించిన దైనందిన మ‌రియు ప్ర‌త్యేక సంద‌ర్భాల‌కు త‌గిన అవ‌స‌రాల‌ను అన్ని ర‌కాలైన ధ‌ర‌ల‌తో కూడిన ఉత్ప‌త్తుల‌ను అందిస్తోంది. వినియోగ‌దారుడిపై ప్ర‌త్యేక దృష్టి సారించిన రిలయన్స్ స్మార్ట్ అత్యుత్త‌మ షాపింగ్ అనుభూతిని త‌న వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. లార్జ్ ఫార్మాట్ సూప‌ర్ మార్కెట్ కేట‌గిరీలో విస్తృత శ్రేణిలో ఉత్ప‌త్తులు అందిస్తూ వినియోగ‌దారుల‌కు అన్నిరకాలుగా చేరవవుతోంది.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

New Rules: అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే...

Smartphone: సెప్టెంబర్‌లో రిలీజైన కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... వీటిలో ఏది బెస్ట్? తెలుసుకోండి
Loading...
SBI offer: ఎస్‌బీఐ కార్డు ఉందా? అమెజాన్ సేల్‌లో రూ.10,000 బెనిఫిట్స్ పొందండి ఇలా
First published: September 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...