Home /News /business /

RELIANCE LAUNCHED NEW SMART STORE IN BANDLAGUDA JAGIR HYDERABAD SS

Reliance Smart: హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్... ప్రారంభోత్సవ ఆఫర్స్ ఇవే

Reliance Smart: హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్... ప్రారంభోత్సవ ఆఫర్స్ ఇవే

Reliance Smart: హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్... ప్రారంభోత్సవ ఆఫర్స్ ఇవే

Reliance Smart | హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో ఏర్పాటు చేసిన స్టోర్‌తో తెలంగాణలో రిలయెన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ల సంఖ్య 23 కి చేరుకుంది.

    రిలయెన్స్ రీటైల్ హైదరాబాద్‌లో మరో స్మార్ట్ స్టోర్‌ను ప్రారంభించింది. బండ్లగూడ జాగీర్‌లో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ ప్రారంభమైంది. చేవెళ్ల రోడ్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ దగ్గర ఉందీ స్టోర్. కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్ వేర్, హోమ్ వేర్‌తోపాటు మరెన్నో ఉత్పత్తులన్నీ ఒకేచోట లభిస్తాయి. ప్రారంభోత్సవ ఆఫర్స్‌ని ప్రకటించింది రిలయెన్స్. రూ.1499 విలువైన వస్తువులు కొన్నవారికి రూ.9 ధరకే కిలో పంచదార అందిస్తుంది రిలయెన్స్ స్మార్ట్. అంతేకాదు... ఏడాదంతా ఎంఆర్‌పీ పైన కనీసం 5% డిస్కౌంట్ పొందొచ్చు. ఇలాంటి ఆఫర్స్‌తో దేశవ్యాప్తంగా వినియోగదారులకు నెలవారీ కిరాణా సరుకులు కొనేందుకు ఉత్తమమైన సూపర్ మార్కెట్‌గా రిలయెన్స్ స్మార్ట్‌ నిలుస్తోంది.

    హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో ఏర్పాటు చేసిన స్టోర్‌తో తెలంగాణలో రిలయెన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ల సంఖ్య 23 కి చేరుకుంది. బండ్లగూడ జాగీర్‌లో 20,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో వినియోగదారులు సులువుగా సరుకుల్ని ఎంపిక చేసుకునేలా ఉత్తమమైన డిజైన్, లేఔట్‌తో స్టోర్ ఏర్పాటైంది. కొన్నేళ్లుగా రిలయెన్స్ స్మార్ట్ తన వినియోగదారులకు ప్రతీరోజు, ప్రత్యేక సందర్భాల్లో ఆకర్షణీయమైన ధరలకే ఉత్పత్తుల్ని అందిస్తోంది. లార్జ్ ఫార్మాట్ సూపర్ మార్కెట్‌ కేటగిరీలో విస్తృత శ్రేణిలో ఉత్పత్తులు అందిస్తోంది.

    ఇవి కూడా చదవండి:

    IRCTC: రైలులో ఫుడ్ ఫ్రీ... కానీ ఓ కండీషన్

    4G Data: రోజూ 2జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్‌లో ఏది బెస్ట్

    Save Money: మీకు రూ.1 కోటి కావాలంటే నెలనెలా జమ చేయండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Reliance, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు