Reliance Smart: హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్... ఆఫర్స్ ఇవే

Reilance Smart Store | బోడుప్పల్‌లో ఏర్పాటుచేసిన స్టోర్‌తో కలుపుకొని తెలంగాణలో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య ఇరవైకి చేరుకుంది.

news18-telugu
Updated: October 31, 2019, 6:18 PM IST
Reliance Smart: హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్... ఆఫర్స్ ఇవే
Reliance Smart: హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్... ఆఫర్స్ ఇవే
  • Share this:
హైదరాబాద్ వాసులకు శుభవార్త. హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ ప్రారంభమైంది. బోడుప్పల్‌లోని చిల్కానగర్ మెయిన్ రోడ్డులో ఎస్ఎస్ఎస్ గార్డెన్‌లో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ ప్రారంభమైంది. 13250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ ఏర్పాటైంది. వినియోగదారుల షాపింగ్ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన డిజైన్, లేఔట్‌తో స్టోర్‌ను ఏర్పాటు చేసింది రిలయెన్స్. వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని కలిగించేలా స్టోర్ ఏర్పాటైంది. కిరాణా ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్ వేర్, హోమ్ వేర్ లాంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తుల్ని అందించడంతో పాటు ఎంఆర్‌పీపై కనీసం 5% డిస్కౌంట్ అందిస్తోంది రిలయెన్స్. ఏడాదంతా ఈ డిస్కౌంట్ పొందొచ్చు. దాంతో పాటు రూ.1499 విలువగల సరుకులు కొన్న కస్టమర్లు కిలో పంచదారను రూ.9 ధరకే పొందొచ్చు.

బోడుప్పల్‌లో ఏర్పాటుచేసిన స్టోర్‌తో కలుపుకొని తెలంగాణలో రిలయెన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య ఇరవైకి చేరుకుంది. భారతదేశవ్యాప్తంగా తమ నెలవారి కిరాణా సరుకుల కోసం ఎంచుకోదగ్గ ఉత్తమమైన సూపర్‌మార్కెట్‌గా నిలుస్తోంది రిలయెన్స్ స్మార్ట్. వీటితో పాటు ప్రధానమైన ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల్ని ప్రతిరోజూ తక్కువ ధరకే కొనొచ్చు. నాణ్యమైన ఉత్పత్తుల్ని ఆకర్షణీయమైన ధరలకే అందించడం వల్ల కస్టమర్ల హృదయాలను గెలుచుకోగలుగుతుంది రిలయెన్స్ స్మార్ట్. కొన్నేళ్లుగా వినియోగదారులకు రోజువారీ అవసరాలకు కావాల్సిన ఉత్పత్తులతో పాటు ప్రత్యేక సందర్భాల్లో కావాల్సిన ప్రొడక్ట్స్‌ని సరసమైన ధరలకు అందిస్తోంది రిలయెన్స్ స్మార్ట్. లార్జ్ ఫార్మాట్ సూప‌ర్ మార్కెట్ కేట‌గిరీలో విస్తృత శ్రేణిలో ఉత్ప‌త్తులు అందిస్తూ వినియోగ‌దారుల‌కు ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన‌దే కాకుండా స్థ‌లం ప‌రంగా కూడా సారుప్యంగా అందుబాటులో ఉంది.

LG W30 Pro: ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ ప్రారంభం... ఫోన్ ఎలా ఉందో చూడండిఇవి కూడా చదవండి:

PAN Card: పాన్ కార్డు లేదా? ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు

IRCTC: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ మారాయి

Jio New Plans: రిలయెన్స్ జియో కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
Published by: Santhosh Kumar S
First published: October 31, 2019, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading