Reliance Jio: ఏడాదిలో 309 శాతం పెరిగిన రిలయెన్స్ జియో లాభాలు

Reliance Jio Q4 Results | రిలయెన్స్ జియో 2017-18 లాభాలు రూ.723 కోట్లు కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో లాభాలు రూ.2,964 కోట్లు.

news18-telugu
Updated: April 18, 2019, 7:30 PM IST
Reliance Jio: ఏడాదిలో 309 శాతం పెరిగిన రిలయెన్స్ జియో లాభాలు
Reliance Jio: ఏడాదిలో 309 శాతం పెరిగిన రిలయెన్స్ జియో లాభాలు
news18-telugu
Updated: April 18, 2019, 7:30 PM IST
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌-ఆర్‌ఐఎల్‌కు జియో లాభాల పంట పండించింది. ఆర్‌ఐఎల్‌ నాలుగో త్రైమాసికం ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరంలో లాభాలు 309 శాతం పెరగడం విశేషం. 2017-18 లాభాలు రూ.723 కోట్లు కాగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో లాభాలు రూ.2,964 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి నిర్వహణా ఆదాయం రూ.38,838 కోట్లు. మూడో త్రైమాసికంలో నిర్వహణా ఆదాయం 10,383 కోట్లు కాగా నాలుగో త్రైమాసికానికి 7.0% పెరిగి 11,106 కోట్లకు చేరింది. ఇక మూడో త్రైమాసికంలో నికర లాభం 831 కోట్లు కాగా నాలుగో త్రైమాసికానికి 1.1% పెరిగి 840 కోట్లకు చేరింది. నాలుగో త్రైమాసికంలో ఒక యూజర్‌పై రూ.126.2 లాభం రావడం విశేషం. లాభాలు పెరగడమే కాదు రిలయెన్స్ జియో అప్పులు రూ.107,000 కోట్లు తగ్గాయి.

2018-19 ఆర్థిక సంవత్సరంలో మేము ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. రిలయెన్స్‌ భవిష్యత్‌ నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించాం. ప్రస్తుతం జియో ద్వారా 30 కోట్ల మంది యూజర్లకు సేవలు అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఈ స్థాయిలో డేటా, వాయిస్ ట్రాఫిక్ పెరుగుదల అసమానమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా నెట్‌వర్క్ రిలయెన్స్ జియో. త్వరలో జియో ప్రతీ జిల్లా, తాలుకా, గ్రామపంచాయతీ, పల్లెల్లోకి వెళ్తుంది. 99 శాతం జనాభాను కవర్ చేస్తుంది.
ముఖేష్ అంబానీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్


రిలయెన్స్ జియో వినియోగం బాగా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. నాలుగో త్రైమాసికంలో మొత్తం డేటా వినియోగం 956 కోట్ల జీబీ కాగా కాల్స్ 72,414 కోట్ల నిమిషాలు మాట్లాడినట్టు రిలయెన్స్ చెబుతోంది. వీడియో 500 కోట్ల గంటలు చూశారని తేలింది. ఒక యూజర్ ఒక నెలలో 10.9 జీబీ డేటా వాడుతుండగా, 823 నిమిషాల వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నారు. మార్చి 31 నాటికి రిలయెన్స్ జియో సబ్‌స్క్రైబర్లు 30 కోట్లు దాటడం విశేషం. ప్రపంచంలో ఈ మైలురాయిని వేగంగా చేరిన సంస్థ ఇదే. అంతేకాదు... ట్రాయ్‌కు చెందిన మైస్పీడ్ అనలిటిక్స్ యాప్‌లో 25 నెలలుగా వరుసగా టాప్‌లో నిలుస్తోంది జియో. ఇక జియో యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గిగాఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. త్వరలో 1600 పట్టణాల్లో సేవలు మొదలుకానున్నాయి.Photos: స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ వేషాల్లో ఎన్నికల సిబ్బంది

ఇవి కూడా చదవండి:
Loading...
Pan card: ఉమాంగ్ యాప్‌లో పాన్ కార్డు సేవలు... ఇలా అప్లై చేయొచ్చు

Post Office Franchise: రూ.5 వేలతో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్... వివరాలు తెలుసుకోండి

IPL 2019: జొమాటో ప్రీమియర్ లీగ్... 30 శాతం క్యాష్‌బ్యాక్, 40 శాతం డిస్కౌంట్
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...