తెలుగు రాష్ట్రాల్లో ‘జియో మార్ట్’ సేవలు... ఈ 30 పట్టణాల్లో...

దేశవ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్ సేవలు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉన్నాయి.

news18-telugu
Updated: June 6, 2020, 11:25 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ‘జియో మార్ట్’ సేవలు... ఈ 30 పట్టణాల్లో...
Reliance JioMart (www.jiomart.com) :
  • Share this:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలకు నిత్యావసర కిరాణా వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేసే సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని అందించేం దుకు గాను రిలయన్స్ రిటైల్ తన విప్లవాత్మక ఆన్ లైన్ ఇ-కామర్స్ వేదిక ‘జియో మార్ట్’ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘ఎక్స్టెండెడ్ బీటా వెర్షన్’ కింద ఈ రెండు రాష్ట్రాల్లోని 30 పట్టణాల్లో జియో మార్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.  తెలంగాణలో హైదరాబాద్/ సికింద్రాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, బోధన్, ఖమ్మం, పాల్వంచ, మిర్యాలగూడ, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి లలో జియో మార్ట్ సేవలు లభ్యమవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, చిత్తూరు, కాకినాడ, గుంటూరు, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, కర్నూలు, వినుకొండ, ఉయ్యురు, అనంతపురం, నర్సరావుపేట, భీమవరం, విజయనగరం లలో నివసించే వారు కిరాణ వంటి నిత్యావసర వస్తువులను జియో మార్ట్ నుంచి పొందవచ్చు. www.jiomart.com వెబ్సైట్ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలో జియో మార్ట్ సేవల లభ్యతను తెలుసుకునేందుకు వీలుంది.

జియో మార్ట్


జియో మార్ట్ ఏర్పాటు చేసిన ఈ-కార్నర్ స్టోర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు తమకు అవసరమైన ఆహార, ఆహారేతర వస్తువులను పొందవచ్చు. పండ్లు, కూరగాయలు, నూనెలు, పప్పులు లాంటి బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు, అంట్లు శుభ్రం చేసుకునేవి లాంటి మరింకెన్నో విభాగాలకు చెందిన వాటిని వినియోగదారులు పొందవచ్చు.

ఎంఆర్పీ (MRP) కన్నా కనీసం 5 శాతం తక్కువ ధరకు లభ్యమయ్యే వాగ్దానంతో జియో మార్ట్ వినియోగదారులకు మెరుగైన విలువను అందిస్తుంది. ఇతర ఆన్ లైన్ వేదికలతో పోలిస్తే జియోమార్ట్ ఉత్పత్తులకు పోటీదాయక రీతిలో ధరలు నిర్ణయించబడ్డాయి.

facebook, facebook jio deal, facebook reliance deal, jio mart, jio mart delhi, jio mart launch, jio mart mumbai, jio platforms, jiomart, jiomart launch, jiomart whatsapp, jiomart whatsapp order, reliance jio, Reliance Jio Infocomm
జియో మార్ట్ (ప్రతీకాత్మక చిత్రం)


విప్లవాత్మక జియో మార్ట్ వేదిక ద్వారా చిన్న పట్టణాల ప్రజలు సైతం ఆన్ లైన్ షాపింగ్ అనుభూతిని పొందే అవకాశం కలుగుతుంది. కిరాణా, ఇతర నిత్యావసరాలను వారు తమ ఇంట్లో నుంచే తమ సౌలభ్యం ప్రకారం పొందే వీలుంటుంది. రెండు రోజుల్లో డెలివరీకి జియో వాగ్దానం చేసినప్పటికీ, ఎన్నో ఆర్డర్లు వాగ్దానం చేసిన సమయం కన్నా తక్కువ సమయంలోనే డెలివరీ చేయబడుతున్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గడిచిన ఏజీఎంలో ఈ నూతన ఈ –కామర్స్ ప్లాట్ఫార్మ్ జియో మార్ట్ గురించి శ్రీ ముకేశ్ అంబానీ ప్రస్తావించారు. ఈ నూతన ఆన్ లైన్ వ్యవస్థ కిరాణా స్టోర్స్ ను బలోపేతం చేస్తాయని, సమగ్ర డిజిటల్ మరియు భౌతిక పంపిణి మౌలిక వసతులతో వాటికి సాధికారికత లభిస్తుందన్నారు. ఈ సాంకేతికత ఆధారిత భాగస్వామ్యాలు ఉత్పత్తి దారులు, వర్తకులు, చిన్న వ్యాపారులు, కిరాణా స్టోర్స్, వినియోగ బ్రాండ్లు, వినియోగదారులను అనుసంధానం చేస్తాయని తెలిపారు. పొరుగునే ఉండే అతి చిన్న కిరాణా దుకాణాలు సైతం భవిష్యత్ సన్నద్ధక డిజిటైజ్డ్ స్టోర్స్ గా మారడంలో ఇది తోడ్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.నేటి మార్కెట్ వ్యవస్థలో ఉన్న అసమర్థతలను, విలువ నాశకాలను తొలగించడం ద్వారా గణనీయ నూతన విలువను వినియోగదారులు, ఉత్పత్తిదారులు, వ్యాపారులకు బదిలీ చేయడాన్ని జియోమార్ట్ తన లక్ష్యంగా చేసుకుంది. ఈ విధమైన ధోరణి దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో ఉండే ఐచ్ఛికాల (ఆప్షన్లు) పరంగా మరింత ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మెరుగైన ధర ప్రయోజనాన్ని అందిస్తుంది.

దేశవ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో జియోమార్ట్ సేవలు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉన్నాయి. మరెన్నో నగరాలు, పట్టణాలు క్రమంగా జోడించబడుతుంటాయి.
First published: June 6, 2020, 11:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading