Reliance JioMart: జనరల్‌గా పెద్ద పెద్ద ఈ-కామర్స్ దిగ్గజాలు మార్కెట్‌లోకి ఎంటరైతే... చిన్న వ్యాపారులు రోడ్డున పడతారు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ రిటైల్ సంస్థ జియోమార్ట్ మాత్రం... చిన్న వ్యాపారులను కాపాడేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే... ఇకపై రిలయన్స్ రిటైల్... ప్యాకింగ్ వస్తువులు, గ్రాసరీ, FMCG ఉత్పత్తులను తనకు తానుగా తన ఈ కామర్స్ సైట్ జియోమార్ట్‌లో డైరెక్టుగా అమ్మదు. అందుకు బదులుగా... చిన్న కిరణా షాపులను ప్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా చేసుకొని... వారి ద్వారా ఈ వస్తువులను అమ్మిస్తుంది. వారి ద్వారానే వస్తువులను కస్టమర్లకు చేరవేస్తుంది. ఇలా ఎక్కడి నుంచి ఆర్డర్ వస్తుందో... ఆ చుట్టుపక్కల కిరాణా షాపుల నుంచి సరుకు డెలివరీ అవుతుంది. ఇది ఇప్పటివరకూ ఉన్న అమెజాన్, బిక్ బాస్కెట్, గ్రోఫర్స్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాల స్ట్రాటజీకి పూర్తి భిన్నమైన సరళి.
కిరాణా షాపుల వారు... తాము అమ్మే వస్తువులను రిలయన్స్ నుంచి లేదా ఇంకెక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు అని ఈ విషయాలు తెలిసిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. రిలయన్స్ అమ్మే 300-400 పావులర్ ఐటెమ్స్‌లో ఏవైనా కిరాణా షాపుల్లో లేకపోతే... వాటిని జియోమార్టే సప్లై చేస్తుంది. ఇందుకు గానూ వచ్చే లాభాన్ని సమానంగా పంచుతుంది. తద్వారా కిరాణా షాపుల వారికి నష్టం కలగదు. ఐతే... త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాలు వంటి వాటిని మాత్రం జియోమార్టే... తన స్టోర్లు, ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల నుంచి అమ్మకాలు, డెలివరీ చేస్తుంది.
రిలయన్స్ తన B2B క్యాష్ అండ్ క్యారీ స్టోర్లు... ఇకపై ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలుగా మారనున్నాయి. ఇవి కిరాణా షాపులకు సరుకులు డెలివరీ చెయ్యనున్నాయి. చుట్టుపక్కల స్టోర్లు… ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇస్తూ… సరుకు డెలివరీ చేయించుకోవచ్చు. జియామార్ట్… ఈ కొత్త విధానాన్ని ఈ సంవత్సరం జూన్ క్వార్టర్ నుంచి 30 నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది. ఇందులో 56,000కు పైగా కిరాణా షాపులు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏప్రిల్ నాటికి మొత్తం 100 నగరాల్లోని కిరాణాషాపులతో డీల్ కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. రిలయన్స్ నుంచి కిరాణా షాపులకు సరుకుల డెలివరీ ఆల్రెడీ మొదలైంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్… గత వారం తాము కాంట్రాక్ట్ ఫార్మింగ్, కార్పొరేట్ ఫార్మింగ్ వైపు వెళ్లట్లేదనీ, అలాంటి డీల్స్ ఏవీ కుదుర్చుకోవట్లేదని తెలిపింది. అలాగే తాము వ్యవసాయ భూమి ఎక్కడా కొనలేదనీ, కొనేది లేదని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రిలయన్స్ జియో టెలికం టవర్లపై దాడులు జరుగుతండటంతో… రిలయన్స్ ఈ విధమైన స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులే ఈ దాడులు చేసినట్లుగా ప్రచారం జరిగినా… రైతుల ముసుగులో తమ ప్రత్యర్థులు ఇలాంటి దాడులు చేయిస్తూ ఉండొచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ అభిప్రాయపడింది. ఈ దాడులపై హర్యానా హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఇప్పటివరకూ రిలయన్స్… జియోమార్ట్ ద్వారా ఎవరైనా ఆర్డర్లు ఇస్తే…. తన రిటైల్ స్టోర్ నెట్‌వర్క్ ద్వారా… గ్రాసరీ, FMCG ఉత్పత్తులను డెలివరీ చేస్తోంది. జియోమార్ట్ ఇప్పటివరకూ రోజుకు 3,00,00కు పైగా ఫుడ్ అండ్ గ్రాసరీ ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. వీటిలో 70 శాతానికి పైగా ఆర్డర్లు రెగ్యులర్ కస్టమర్ల నుంచి వస్తున్నాయి. రిలయన్స్‌కి 51 రిలయన్స్ మార్కెట్ ఔట్‌లెట్స్ ఉన్నాయి. వాటిలో 26 స్టోర్లలో కొంత భాగాన్ని రిలయన్స్ స్మార్ట్ సూపర్‌మార్కెట్లుగా మార్చింది. మిగతా భాగాన్ని స్టోర్లుగానే ఉంటుంది. అవి త్వరలో B2B ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు కాబోతున్నాయి.
ఇది కూడా చదవండి: Astrology: ఏ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి... త్వరగా డబ్బు రావాలంటే ఇలా చెయ్యాలి
ఈ కొత్త విధానం వినియోగదారులకు కూడా కలిసి రానుంది. ఈ కరోనా రోజుల్లో కస్టమర్లు కిరాణా షాపులకు వెళ్లే పని లేకుండా… జియోమార్ట్ ద్వారా ఆర్డర్ ఇస్తే… దగ్గర్లోని షాపుల నుంచి సరుకులు ఇంటికి డెలివరీ అవుతాయని రిలయన్స్ జియోమార్ట్ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.