Reliance JioGigaFiber : ఆగస్టు 12న వచ్చేస్తున్న రిలయన్స్ జియో గిగా ఫైబర్

Reliance JioGigaFiber | ఆగస్టు 12 నుంచి ఈ మేరకు పూర్తి అధికారికంగా జియో గిగా ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌ అందించడం విశేషం. అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ను దేశమంతా అందించే ఈ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ ద్వారా ప్రస్తుతం సిగ్నల్‌ లేమి సమస్యకు చెక్‌ పెట్టే అవకాశం ఉంది.

news18-telugu
Updated: July 30, 2019, 4:20 PM IST
Reliance JioGigaFiber : ఆగస్టు 12న వచ్చేస్తున్న రిలయన్స్ జియో గిగా ఫైబర్
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Reliance JioGigaFiber | టెలికాం చరిత్రలో సృష్టించిన జియో నెట్ వర్క్ ప్రస్తుతం మరో సంచలనానికి తెర లేపింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ”జియో గిగా” ఫైబర్‌ పేరుతో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ సేవలతో ఈ రంగంలో రూపురేఖలను మార్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 12 నుంచి ఈ మేరకు పూర్తి అధికారికంగా జియో గిగా ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌ అందించడం విశేషం. అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ను దేశమంతా అందించే ఈ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ ద్వారా ప్రస్తుతం సిగ్నల్‌ లేమి సమస్యకు చెక్‌ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రముఖ నగరాల్లో ప్రయోగాత్మకంగా కనెక్షన్‌లు ఇచ్చిన జియో గిగా ఫైబర్‌ సేవలు ఇక మధ్యతరహా పట్టణాలకూ అందనుంది.

నెలకు రూ.600 రుసుముపై ఇంటర్నెట్‌, ల్యాండ్‌లైన్‌, టీవీ ప్రసార సేవలందించేందుకు రిలయన్స్‌ జియో సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జియో గిగా ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో లభిస్తోంది. దీని ద్వారా 90 రోజుల పాటు 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ తో సేవలకు అందిస్తున్నారు. అంతే కాదు నెలవారీ 100 జీబీ డేటా అందిస్తున్నారు. జియో గిగాఫైబర్‌ సేవలను రిఫండబుల్‌ డిపాజిట్‌తో వినియోగించుకోవచ్చు. 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ కావాలంటే రూ.4500 డిపాజిట్‌గా చెల్లించాలి. వినియోగదారుడు సర్వీస్‌ అవసరం లేదనుకుంటే తాను చెల్లించిన డిపాజిట్టు ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు.ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు ఈ పథకంలో ఉచిత ల్యాండ్‌లైన్‌ ఇస్తున్నారు. ఈ ల్యాండ్‌లైన్‌ నుంచి దేశమంతా అపరిమిత ఉచిత కాల్స్‌ పొందవచ్చు. అంతే కాదు 4కే హెచ్ డీ సర్వీసుతో పాటు, జియో గిగా టీవీ సేవలు, వీడియో కాన్ఫరెన్స్ సేవలు లభించనున్నాయి.

First published: July 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...