హోమ్ /వార్తలు /బిజినెస్ /

RIL: జియో టవర్లపై దాడులను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

RIL: జియో టవర్లపై దాడులను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

జియో టవర్లపై దాడులను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ప్రతీకాత్మక చిత్రం - File Images)

జియో టవర్లపై దాడులను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ప్రతీకాత్మక చిత్రం - File Images)

Reliance Industries Limited (RIL): పంజాబ్‌లో దాదాపు 1500 జియో టెలికం టవర్లపై దాడులు జరగడంతో... ఈ అంశంపై రిలయన్స్ జియో టెలికం కోర్టుకు వెళ్తోంది.

  Reliance Industries Limited (RIL): రిలయన్స్ ఇండస్ట్రీస్ సహ సంస్థ రిలయన్స్ జియో టెలికంకి సంబంధించిన టవర్లు, ఆస్తులపై పంజాబ్‌లో దుండగులు జరిపిన దాడులను వ్యతిరేకిస్తూ... తాము పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా హైకోర్టును కోరనున్నట్లు తెలిపింది. మీడియాకు విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో ఆ సంస్థ... ఇలాంటి హింసాత్మక చర్యలు... వేల మంది తమ ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయనీ, టెలికం రంగంలో తమ కీలకమైన మౌలిక వసతులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయనీ... అలాగే... పంజాబ్, హర్యానాలో రిలయన్స్ సహ సంస్థలు నిర్వహిస్తున్న సర్వీస్ ఔట్‌లెట్లపైనా దాడులు జరుగుతున్నాయని తెలిపింది.

  పంజాబ్‌లో ఈమధ్య కొన్ని వారాలుగా రిలయన్స్ యాజమాన్యం కిందకు వచ్చే జియో టెలికంకి సంబంధించిన దాదాపు 1500 టవర్లపై దాడులు జరిగాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ... ఆందోళనలు చేస్తున్న రైతులే నాశనం చేశారనే ప్రచారం జరిగింది. నవంబర్‌లో కొంతమంది రైతుల బృందాలు పంజాబ్‌లోని రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లను బలవంతంగా మూసివేయించారు. ఈ కొత్త చట్టాలు కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉంటాయని జరుగుతున్న ప్రచారంతో రైతులు ఇలాంటి ఆందోళనలకు దిగినట్లు తెలిసింది.

  రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటన

  తమ ప్రత్యర్థులు, వ్యాపార శత్రువులు ఈ దాడులను ప్రేరేపిస్తున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరోపించింది. రైతుల ఆందోళనలను అడ్డం పెట్టుకొని స్వార్థ పూరిత ఆలోచనలతో... కావాలనే ఈ దాడులు చేస్తున్నారనీ, కావాలనే రిలయన్స్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆ కంపెనీ ఆరోపించింది.

  ఇలాంటి దాడులకు పాల్పడేవారు, వీటిని ప్రేరేపించేవారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలనీ, అలాగే... పంజాబ్, హర్యానాలో తమ వ్యాపారాలు సజావుగా జరిగేలా తమకు రక్షణ కల్పించాలని కోర్టును కోరనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.

  "ఇదంతా తప్పుడు ప్రచారం అనేది సుస్పష్టం. వాస్తవాలను హైకోర్టు ముందు ఉంచుతాం. వాస్తవం ఏంటంటే... ప్రస్తుతం కేంద్రం రూపొందించిన వ్యవసాయ సంస్కరణ చట్టాలతో రిలయన్స్‌కి ఎలాంటి సంబంధమూ లేదు. వాటి ద్వారా రిలయన్స్ ఎలాంటి లాభమూ పొందేది లేదు." అని రిలయన్స్ తన స్టేట్‌మెంట్‌లో తెలిపింది.

  "ఈ చట్టాలకూ రిలయన్స్‌కీ లింకు పెట్టి మా వ్యాపారాలు, మాపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇదంతా జరుగుతోంది" అని రిలయన్స్ తన స్టేట్‌మెంట్‌లో తెలిపింది.

  పంజాబ్, హర్యానా సహా కొన్ని రాష్ట్రాలకు చెందిన వేల మంది రైతులు... ఢిల్లీ సరిహద్దుల్లో కంటిన్యూగా ఆందోళనలు చేస్తున్నారు. నవంబర్ 26న ఈ ధర్నాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తెచ్చిన చట్టాలను పూర్తిగా రద్దు చెయ్యాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే... కనీస మద్దతు ధరను తిరిగి కల్పిస్తూ... దీనిపై గ్యారెంటీ ఇవ్వాలని కోరుతున్నాయి.

  ఈ అంశంపై కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే ఆరుసార్లు చర్చలు జరిగాయి. ఆందోళన చేస్తున్న రైతులు... కొత్త చట్టాల వల్ల తమకు మద్దతు ధర లభించదనీ, తమ భూములను కాంట్రాక్ట్ లేదా కార్పొరేట్ ఫార్మింగ్ పేరుతో... కార్పొరేట్ వర్గాలు లాగేసుకుంటాయనే అభిప్రాయంతో ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టాల వల్ల రైతులకే మేలు జరుగుతుందని చెబుతోంది.

  జనవరి 4న అంటే నేడు మరోసారి కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. వీటిని చివరి రౌండ్ చర్చలుగా రైతులు భావిస్తున్నారు. ఇవాళ్టి చర్చల్లో ఎలక్ట్రిసిటీ యాక్ట్, పర్యావరణం వంటి అంశాల్లో ఉన్న సందిగ్ధతలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఐతే... కేంద్రం నుంచి కనీస మద్దతు ధరకు గ్యారెంటీ, మూడు చట్టాలనూ రద్దు చేసే అంశంపై ఇంకా ఎలాంటి గ్యారెంటీ రాలేదు.

  ఇది కూడా చదవండి: Diabetes Control: డయాబెటిస్‌ సమస్యకి వేప ఆకులతో చెక్... ఇలా చెయ్యండి

  కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదా కార్పొరేట్ ఫార్మింగ్ వంటి ప్లాన్స్ ఏవీ తమకు లేవని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. రైతుల సాధికారతే తమకు ముఖ్యమన్న రిలయన్స్... తమకు ఇలాంటి వాటిలోకి వెళ్లే ఉద్దేశం లేదని తెలిపింది. ఇదే అంశంపై మరింత స్పష్టత ఇచ్చిన సంస్థ... తాము కార్పొరేట్ ఫార్మింగ్ (కార్పొరేట్ వ్యవసాయం) కోసం ఎప్పుడూ వ్యవసాయ భూమిని కొనలేదనీ, అలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం కూడా కొనలేదనీ, అలాంటి ప్లాన్స్ లేవని చెప్పింది. అంతేకాదు... తాము ఎప్పుడూ ఆహార ధాన్యాలను రైతులు, వారి సప్లయర్ల నుంచి డైరెక్టుగా కొనట్లేదనీ... ఏది కొన్నా కనీస మద్దతు ధర (MSP)కే కొంటున్నట్లు తెలిపింది. తక్కువ ధరలకు ఎలాంటి దీర్ఘ కాలిక ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టులూ తాము కుదుర్చుకోలేదని తెలిపింది.

  Disclosure: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd which publishes teluguNews18.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: BUSINESS NEWS, Reliance Industries, Reliance Jio

  ఉత్తమ కథలు