హోమ్ /వార్తలు /బిజినెస్ /

Farm Reform Laws:ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తప్పుడు ప్రచారం, ట్రాయ్‌ను ఆశ్రయించిన జియో

Farm Reform Laws:ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తప్పుడు ప్రచారం, ట్రాయ్‌ను ఆశ్రయించిన జియో

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Reliance Jio: వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా రైతులు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఎయిర్ టెల్, వోడా ఫోన్ ఐడియా (వీ) సంస్థలు తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రిలయన్స్ జియో ఆరోపించింది.

ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ రిలయన్స్ జియో సంస్థ టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియాను ఆశ్రయించింది. వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా రైతులు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఎయిర్ టెల్, వోడా ఫోన్ ఐడియా (వీ) సంస్థలు తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది. కేంద్రం తీసుకొచ్చిన రైతు సంస్కరణట చట్టాల వల్ల రిలయన్స్ లాభ పడుతుందనే తప్పుడు ప్రచారం చేస్తున్న ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు ఉత్తర భారతదేశంలో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గత 17 రోజులకు పైగా వారు ఆందోళనలు చేస్తున్నారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాల వల్ల రిలయన్స్ బాగు పడుతుందంటూ ఈ కంపెనీలు (ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా) ఉద్దేశ పూర్వకంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా తప్పుడు పుకార్లు సృష్టిస్తున్నాయి.’ అని రిలయన్స్ ఆరోపించింది. ఆయా కంపెనీలు చేస్తున్న పుకార్లను నమ్మిన తమ కస్టమర్లు పోర్ట్ ఔట్ రిక్వెస్ట్ (ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం) పెడుతున్నారని రిలయన్స్ జియో ఆరోపించింది. ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం జియో వినియోగదారుల్లో కొందరు తమ ఫోన్ నెంబర్‌ను జియో నుంచి ఇతర నెట్ వర్క్‌కు మార్చాలనుకుంటున్నారు. అందుకు వారు చెబుతున్న కారణం ఇదే. అయితే, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా చేస్తున్న పుకార్ల వల్లే కస్టమర్లు ఇలా చేస్తున్నారని రిలయన్స్ జియో ఆరోపించింది.

‘ఎయిర్ టెల్, వీ సంస్థలు తమ ఉద్యోగులు, ఏజెంట్లు, రిటైలర్ల ద్వారా ఈ విషపూరితమైన, విభజన ప్రచారం చేస్తున్నాయి. జియో నెంబర్లను పోర్ట్ పెట్టుకుంటే ఓ రకంగా రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపినట్టేననే భావనను కస్టమర్లలో కలిగిస్తున్నారు.’ అని ట్రాయ్‌కు చేసిన ఫిర్యాదులో జియో పేర్కొంది. దీంతోపాటు తమ ప్రత్యర్థి కంపెనీలు రైతుల ఉద్యమాన్ని జియోను డ్యామేజ్ చేసేందుకు వినియోగించుకుంటున్నాయని ఆరోపించింది. జియో నుంచి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలకు నెట్ వర్క్ మార్చుకోవాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాయని ట్రాయ్‌కు రిలయన్స్ లేఖ రాసింది.

First published:

Tags: AIRTEL, Farmers Protest, Reliance Jio, TRAI, Vodafone Idea

ఉత్తమ కథలు