హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Jio Q1 Result | మొదటి త్రైమాసికంలో దూసుకెళ్లిన జియో... లాభాల పంట..

Reliance Jio Q1 Result | మొదటి త్రైమాసికంలో దూసుకెళ్లిన జియో... లాభాల పంట..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Reliance Jio | ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జియో రూ.2520 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

  రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్ ఫామ్స్.. 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో దూసుకుపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జియో రూ.2520 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో జియో లాభం రూ.891 కోట్లు మాత్రమే. అంటే సగటున 183 శాతం వృద్ధి నమోదైనట్టు లెక్క. జూన్ త్రైమాసికానికి రెవిన్యూ రూ.16,557 కోట్లు వచ్చింది. ఒక్కో యూజర్‌కు సగటు రెవిన్యూ (ARPU) పరంగా చూస్తే 7.5 శాతం (రూ.140.3) వృద్ధి నమోదైంది. వాస్తవానికి 3.5 శాతం గ్రోత్ అంచనా వేయగా.. అంతకంటే రెట్టింపు వృద్ది చెందింది. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరిగింది. దీంతో జియో డేటా వినియోగం కూడా భారీగా పెరిగింది.

  రిలయన్స్ జియో సంస్థ ఇప్పటి వరకు 14 డీల్స్ కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది గూగుల్. ఇది జియో చేసిన 14వ డీల్. రిలయెన్స్ జియోలో 9.99 శాతం వాటా కోసం రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకుంది. జియో కుదుర్చుకున్న మొదటి డీల్ ఇది.

  సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్,  జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్ ,  కేకేఆర్,  ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్, అబు ధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ-ADIA, ఎల్ క్యాటర్టాన్,  సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్-PIF,  ఇంటెల్ క్వాల్కమ్  లాంటి సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టాయి.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Reliance, Reliance Industries, Reliance Jio, Reliance JioMart

  ఉత్తమ కథలు