JIO: జోష్‌లో జియో.. వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్‌కు షాక్..

JIO : ఆగస్టులో జియో మాత్రమే కొత్త సబ్‌స్క్రైబర్లను దక్కించుకోగలిగింది. మిగతా అన్ని టెలికం సంస్థలు వినియోగదారులను కోల్పోయాయి.

news18-telugu
Updated: October 18, 2019, 5:20 PM IST
JIO: జోష్‌లో జియో.. వొడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్‌కు షాక్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టెలికం రంగంలో జియో అంచెలంచెలుగా దూసుకుపోతోంది. రోజురోజుకు కొత్త కస్టమర్లను చేర్చుకుంటూ విస్తరిస్తున్న ఈ సంస్థ మరింత జోష్‌‌లో ఉంది. ఆ జోష్ ఎందుకంటారా.. ఈ ఆగస్టులో జియో మాత్రమే కొత్త సబ్‌స్ర్కైబర్లను దక్కించుకోగలిగింది. మిగతా అన్ని టెలికం సంస్థలు వినియోగదారులను కోల్పోయాయి. ప్రముఖ టెలికం వాచ్‌డాగ్ TRA తెలిపిన వివరాల ప్రకారం.. వొడాఫోన్-ఐడియా 49 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లను కోల్పోయింది. ఎయిర్‌టెల్ 5 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లను దూరం చేసుకుంది. జియో విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ సంస్థలకు భిన్నంగా 84 లక్షల మంది కొత్త యూజర్లను దక్కించుకుంది. కాగా, టెలికం మార్కెట్‌లో ప్రస్తుతం జియో వాటా 29.74 శాతం. వోడాఫోన్-ఐడియా 32.03 శాతంతో తొలి స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా, జూలైతో పోల్చితే ఆగస్టులో టెలికం యూజర్లు 0.21 శాతం పెరిగారు. అటు.. జమ్మూకాశ్మీర్, బిహార్, ఒడిసా, గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వైర్‌లెస్ సెగ్మెంట్‌లో సబ్‌స్ర్కిప్షన్లు భారీగా తగ్గాయి.

మరోవైపు.. జియో కస్టమర్లు ఇకనుంచి ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఈ నెల 9 నుంచి అందుబాటులోకి రానుంది. అంటే జియో రీచార్జ్ చేయించుకునే కస్టమర్లందరూ నేటి నుంచి ఇతర మొబైల్ ఆపరేటర్ల నెట్ వర్క్‌లకు కాల్ చేసినప్పుడు ఈ ఐయూసీ చార్జ్ కింద ప్రతి నిమిషానికి 6 పైసలు కట్ అవుతుంది. ఇందుకోసం ఐయూసీ టాప్ అప్ వోచర్లను సైతం ప్రవేశపెట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com